E-Paper
Advertisement

విడుదలకు ముందే 3 స్టేట్ అవార్డ్స్.. ఆరేళ్ల తర్వాత రిలీజ్ కాబోతున్న శ్రియా మూవీ!

విడుదలకు ముందే 3 స్టేట్ అవార్డ్స్.. ఆరేళ్ల తర్వాత రిలీజ్ కాబోతున్న శ్రియా మూవీ!
Advertisement

Shriya Saran:సాధారణంగా ఏ సినిమా అయినా సరే విడుదలైన తర్వాత ప్రేక్షకుల ఆదరణ భారీగా పొంది, జ్యూరీని మెప్పిస్తే.. ఖచ్చితంగా అవార్డులు లభిస్తాయి.. కానీ ఇక్కడ ఒక సినిమా విడుదలే కాలేదు.. కానీ ఊహించని విధంగా ఏకంగా మూడు.. అందులోనూ నేషనల్ అవార్డ్స్ అందుకొని ఆశ్చర్యపరిచింది. అలాంటి ఈ సినిమా 2019లో మొదలై.. 2020లో షూటింగ్ పూర్తిచేసుకుని , ఆరేళ్ల తర్వాత అనగా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఆ చిత్రం ఏమిటి? ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమా ఎందుకు విడుదలకు నోచుకోలేదు.. ఇన్ని రోజుల ఆలస్యానికి అసలు కారణమేమిటి? ఇందులో నటీనటులు, తారాగణం, సాంకేతిక నిపుణులు ఇలా తదితర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఆరేళ్ల తర్వాత విడుదలకు సిద్ధమవుతున్న శ్రియా శరణ్ మూవీ..

అదేదోకాదు సందక్కారి. వెమల్, శ్రియా శరణ్ (Shriya Saran) కాంబినేషన్లో ఆర్. మధేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బాస్ ప్రొడక్షన్ కార్పొరేషన్ బ్యానర్ పై తెరకెక్కించారు.. ఈ సినిమా థియేటర్లలోకి విడుదల కాకముందే తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డ్స్ 2020 కి గాను.. ఏకంగా మూడు అవార్డులను గెలుచుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా ఈ సినిమాకి ఉత్తమ సినిమా కేటగిరీలో మూడో బహుమతి, బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్ అంబ్రిష్ , బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ గా అయ్యప్పన్ లు అవార్డులను సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఈ సినిమా ఇలా అవార్డులు అందుకున్న సమయంలో విడుదల కాకముందే ఇలా అవార్డులకు ఎలా ఎంపిక చేస్తారనే విషయంలో విమర్శలు కూడా వచ్చాయి.అలాంటి ఈ సినిమా అప్పట్లో విడుదల కాకుండా ఆగిపోయింది. కానీ ఇప్పుడు ఆరేళ్ల తర్వాత సెప్టెంబర్ 18న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

తెలుగులో కూడా రిలీజ్ చేస్తారా?

Advertisement

ఇకపోతే ఈ సినిమా 2012లో మలయాళం లో వచ్చిన మై బాస్ అనే చిత్రానికి రీమేక్ . సత్యన్ , ప్రభు, కె ఆర్ విజయ, దేవ, రేఖ, ఉమా పద్మనాభన్ , మహానంది శంకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అమ్రిష్ సంగీతం అందించగా.. ఆరేళ్ల తర్వాత విడుదలకు సిద్ధమవుతుండడంతో అంచనాలు పెరిగిపోయాయి .మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా..?ముఖ్యంగా తెలుగులో కూడా ఈ సినిమాను రిలీజ్ చేస్తారా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో తలెత్తుతున్నాయి. మరి సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

ALSO READ:బిగ్ బాస్ 10 2వ వారం నామినేషన్స్ రచ్చ.. అందరి టార్గెట్ అతడే!

శ్రియా శరణ్ సినిమాలు..

Advertisement

శ్రియా విషయానికొస్తే.. ఇష్టం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె.. సంతోషం, చెన్నకేశవరెడ్డి, ఠాగూర్, నేనున్నాను, ఎలా చెప్పను ఇలా ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా ఆర్ఆర్ఆర్ చిత్రంలో సందడి చేసిన శ్రియా శరణ్.. గత ఏడాది మిరాయ్ సినిమాలో కీలకమైన పాత్ర పోషించి అబ్బురపరిచింది.

Related News

తరుణ్ నీలో ఈ టాలెంట్ కూడా ఉందా.. ‘ENE రిపీట్’ కోసం భలే కాకా పడుతున్నావే!

డైరెక్టర్ ఇంట్లో వినాయక చవితి చేసుకున్న నటి.. ఆ రిలేషన్ ఎదో కన్ఫర్మ్ చేసేయండయ్యా?

రాజమౌళితో సినిమా అరుదైన రికార్డు సాధించిన పృథ్వీ రాజ్ సుకుమారన్ !

జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం భారీ పోటీ.. నాగవంశీ ఫ్యాన్సీ ఆఫర్!

ట్రోలర్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఐశ్వర్య లక్ష్మి!

రామాయణం నుండి స్పెషల్ ట్రీట్ .. ఆకట్టుకుంటున్న ‘సీతారామ్’ పోస్టర్!

వినాయక చవితి స్పెషల్..నయనతార మూకుత్తి అమ్మన్ 2 టీజర్ రిలీజ్!

Big Stories

Advertisement
×