E-Paper
Advertisement

తరుణ్ నీలో ఈ టాలెంట్ కూడా ఉందా.. ‘ENE రిపీట్’ కోసం భలే కాకా పడుతున్నావే!

తరుణ్ నీలో ఈ టాలెంట్ కూడా ఉందా.. ‘ENE రిపీట్’ కోసం భలే కాకా పడుతున్నావే!
Advertisement

Tarun Bhaskar: సాధారణంగా పండుగలు వచ్చాయి అంటే సెలబ్రిటీలు సాంప్రదాయంగా ముస్తాబయి, దేవాలయాలను సందర్శించడం లేదా తమ ఇంట్లోనే పూజలు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అందుకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు. గణేష్ చతుర్థి ఇలాంటి పండుగలు వచ్చాయి అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ టాలెంట్ మొత్తాన్ని ఉపయోగించి అందంగా గణేశుడిని రూపొందిస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. మొన్నటికి మొన్న నిహారిక కొణిదెల (Niharika Konidela) తన అందమైన చేతులతో అంతకుమించి అందమైన గణేషుడి ప్రతిమను తయారుచేసి అందరి మనసులు దోచుకుంది. అయితే ఇప్పుడు ఆ జాబితాలోకి ప్రముఖ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ (Tarun Bhaskar) కూడా వచ్చి చేరారు.

బయటపడ్డ తరుణ్ భాస్కర్ టాలెంట్..

ఎటువంటి పరికరాల సహాయం లేకుండా కేవలం తన చేతులకు పని పెట్టి తన టాలెంట్ మొత్తాన్ని ఉపయోగించి చక్కటి అందమైన మోడ్రన్ బొజ్జ గణపయ్యను తయారు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని ఆయన తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసి అభిమానులను సర్ప్రైజ్ చేశారు.

‘ఈ నగరానికి ఏమైంది? రిపీట్’ కోసం రిక్వెస్ట్..

Advertisement

తన స్వహస్తాలతో గణేషుడిని తయారుచేసిన తరుణ్ భాస్కర్ క్యాప్షన్ గా.. “ట్రెడిషన్ వినాయక.. ఈఎన్ఈ రిపీట్ నవంబర్ 19వ తేదీన వస్తోంది.. జర చూసుకో” అంటూ వినాయకుడిని కాకా పట్టేశారు. మొత్తానికి అయితే ఈ నగరానికి ఏమైంది రిపీట్ చిత్రం నవంబర్ 19న రాబోతున్న నేపథ్యంలో ముందుగానే తరుణ్ భాస్కర్.. ఎలాంటి విఘ్నాలు కలగకుండా.. సినిమా బ్లాక్ బస్టర్ అయిపోవాలని దీవించండి స్వామీ.. అంటూ వినాయకుడిని వేడుకున్నారు.

నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు..

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అందులో ఒక నెటిజన్ గణేశుడే చెబుతున్నట్టు..” ఈ నగరానికి ఏమైంది రిపీట్ బ్లాక్ బస్టర్ ప్రాప్తిరస్తు ” అంటే సరదాగా కామెంట్ చేయగా.. మరొకరు ” ఎలాంటి విఘ్నాలు కలగకుండా మా సినిమా హిట్ అయ్యేలా చూసుకో వినాయక ” అంటూ కామెంట్ చేశారు. మరికొంతమంది తరుణ్ భాస్కర్ నీలో ఇంత అద్భుతమైన కళ ఉందా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే వినాయక చవితి సందర్భంగా తరుణ్ భాస్కర్ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అంచనాలు పెంచుతున్న ఈఎన్ఈ రిపీట్..

Advertisement

2018లో వచ్చిన తెలుగు బడ్డీ కామెడీ చిత్రం ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ గా ఈ నగరానికి ఏమైంది రిపీట్ పేరుతో నవంబర్ 19వ తేదీన థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో విశ్వక్ సేన్, అభినవ గోమటం, వెంకటేష్ కాకుమాను కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ నగరానికి ఏమైంది చిత్రంలో సాయి సుశాంత్ రెడ్డి నటించగా ఇప్పుడు ఆయన స్థానంలో శ్రీనాథ్ మాగంటి అవకాశాన్ని దక్కించుకున్నారు. వివేక్ సాగర్ సంగీతాన్ని అందించగా .. రూట్ నోడ్ సినిమా, ఎస్ ఒరిజినల్స్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

?utm_source=ig_web_copy_link&stkn=NTc4MTIwNjQ2YQ==

Related News

హీరో అజిత్ కు  కారు గిఫ్ట్ గా ఇచ్చిన సీఎం విజయ్.. లవ్లీ బ్రదర్ అంటూ!

డైరెక్టర్ ఇంట్లో వినాయక చవితి చేసుకున్న నటి.. ఆ రిలేషన్ ఎదో కన్ఫర్మ్ చేసేయండయ్యా?

విడుదలకు ముందే 3 స్టేట్ అవార్డ్స్.. ఆరేళ్ల తర్వాత రిలీజ్ కాబోతున్న శ్రియా మూవీ!

రాజమౌళితో సినిమా అరుదైన రికార్డు సాధించిన పృథ్వీ రాజ్ సుకుమారన్ !

జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం భారీ పోటీ.. నాగవంశీ ఫ్యాన్సీ ఆఫర్!

ట్రోలర్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఐశ్వర్య లక్ష్మి!

రామాయణం నుండి స్పెషల్ ట్రీట్ .. ఆకట్టుకుంటున్న ‘సీతారామ్’ పోస్టర్!

Big Stories

Advertisement
×