Ramayanam:నేడు దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా విదేశాలలో ఉన్న హిందువులు కూడా వినాయక చవితిని ఘనంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు కూడా.. వినాయక చవితి సందర్భంగా స్పెషల్ పోస్టర్లను పంచుకుంటూ తమ తమ సినిమాలపై అంచనాలు పెంచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మోస్ట్ అవైటెడ్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం రామాయణం. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రణబీర్ కపూర్ (Ranbir Kapoor) రాముడిగా, సాయి పల్లవి (Sai Pallavi) సీతగా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు.
సుమారుగా రూ.4 వేల కోట్ల బడ్జెట్ తో బాలీవుడ్లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి వచ్చే ప్రతి అప్డేట్ కూడా సోషల్ మీడియాలో క్షణాలలో వైరల్ అవుతుంది. ఇక అందులో భాగంగానే తాజాగా వినాయక చవితి సందర్భంగా రామాయణం మేకర్స్ సీతా, రామ్ లకు సంబంధించిన కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా , సాయి పల్లవి సీతాదేవిగా వనవాసం వెళ్లిన సమయంలో భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా నది ఒడ్డున కూర్చుని ప్రశాంతమైన ప్రకృతి మధ్య తమ సమయాన్ని గడుపుతున్న సందర్భాన్ని గుర్తుచేసేలా ఈ పోస్టర్ ను రూపొందించారు.
ALSO READ:ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న బిగ్ బాస్ 10!
ఒక జలపాతం సమీపంలోని అడవిలో బండరాయిపై ఇద్దరూ కూర్చొని కనిపించడం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో శ్రీరాముడు తన సతీమణి సీతాదేవికి ఆప్యాయంగా జడలో గులాబీ పువ్వు తుడుముతున్నట్టు షేర్ చేసిన పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది ముఖ్యంగా ఈ ఫ్రేమ్లో ఇద్దరి లుక్ చాలా ప్రశాంతంగా, చూడ ముచ్చటగా ఉంది అంటూ ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు.
నితేష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా , సాయి పల్లవి సీతగా, యశ్ రావణాసురుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా , సన్నీడియోల్ హనుమంతుడిగా కనిపిస్తున్నారు.. అలాగే మండోదరి పాత్రలో కాజల్ అగర్వాల్, శూర్పనఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా కీలకపాత్రను పోషిస్తున్నారు . ఏ ఆర్ రెహమాన్ తో పాటు హన్స్ జిమ్మర్ ఈ సినిమా సంగీతంలో భాగస్వామ్యం అయ్యారు. భారీ విజువల్ స్కేల్ తో.. 2 భాగాలుగా థియేటర్లలో విడుదల కానుంది. అందులో భాగంగానే మొదటి భాగాన్ని 2026 దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన మేకర్స్.. రెండవ భాగాన్ని వచ్చే ఏడాది అనగా 2027లో దీపావళి సందర్భంగా రిలీజ్ చేయబోతున్నట్లు ప్లాన్ చేశారు . ఇప్పటికే సినిమా నుండి విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ లకు వచ్చిన స్పందనతో సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. దీనికి తోడు ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా విడుదల చేసిన సీతారాముల పోస్టర్ కూడా ఆకట్టుకుంటుంది ఏది ఏమైనా చిత్ర బృందం సినిమాపై అంచనాలు పెంచడానికి గట్టిగానే ప్రయత్నం చేస్తోంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.