E-Paper
Advertisement

జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం భారీ పోటీ.. నాగవంశీ ఫ్యాన్సీ ఆఫర్!

జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం భారీ పోటీ.. నాగవంశీ ఫ్యాన్సీ ఆఫర్!
Advertisement

Jailer 2 Movie: కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Deelip kumar)డైరెక్షన్లో నటించిన జైలర్ 2(Jailer 2) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఇప్పటికీ విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఈ సినిమాని అక్టోబర్ 15వ తేదీ విడుదల చేయబోతున్నట్లు చిత్రం నిర్మాతలు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు నెల రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఈ సినిమా భారీ స్థాయిలో బిజినెస్ జరుపుకుంటుంది.

జైలర్ 2 కోసం పోటీపడుతున్న దిల్ రాజు నాగ వంశీ..

జైలర్ సినిమా తెలుగు, తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా తెలుగు హక్కుల కోసం టాలీవుడ్ నిర్మాతలు భారీగా పోటీ పడుతున్నారు. జైలర్ సినిమా తెలుగు హక్కులను నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ జీఎస్టీతో కలిపి 55 కోట్ల రూపాయలు చెప్పగా టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు(Dil Raju) మాత్రం జీఎస్టీ తో 30 కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక సితార ఎంటర్టైన్మెంట్ అధినేత నాగ వంశి (Nagavamsi)మాత్రం జిఎస్టిలతో కలిపి 45 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ సినిమా తెలుగు రైట్స్ సొంతం చేసుకోవడం కోసం నాగ వంశీ ఈ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

జైలర్ 2 తెలుగు హక్కుల పై నాగవంశీ కన్ను ..

Advertisement

రజినీకాంత్ నటించిన కూలీ సినిమా హక్కులను కైవసం చేసుకోవడం కోసం నాగ వంశీ చాలా ప్రయత్నాలు చేశారు కానీ అదే సమయంలో ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో ఈ సినిమా హక్కులను కైవసం చేసుకున్నారు. అయితే ఇప్పుడు మాత్రం జైలర్ 2 హక్కులను సొంతం చేసుకోవాలనే ఆలోచనలో నాగ వంశి ఉన్నట్టు తెలుస్తుంది. మరి జైలర్ 2 సినిమా హక్కులు ఎవరికి సొంతమవుతాయో తెలియాల్సి ఉంది.

జైలర్ సీక్వెల్ చిత్రం..

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఇదివరకే రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ సీక్వెల్ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల అంచనాలను పెంచేసింది.మరి ఈ సీక్వెల్ సినిమాతో రజనీకాంత్ ఎలాంటి సక్సెస్ అందిస్తారు అనేది తెలియాల్సి ఉంది. ఇక రజనీకాంత్ చివరిగా గత ఏడాది కూలి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇక కూలి సినిమా తర్వాత ఈ ఏడాది రాబోతున్న జైలర్ 2సినిమా పైనే ప్రేక్షకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో పాటు ప్రస్తుతం కమల్ హాసన్ తో నటిస్తున్న సినిమాతో పాటు రజనీకాంత్ తన తదుపరి సినిమాలో షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement

Also Read: త్రిగుణ్ పద్ధతి మార్చుకోవాలి.. కామనర్స్ కు మద్దతుగా మాజీ కంటెస్టెంట్!

Related News

ట్రోలర్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఐశ్వర్య లక్ష్మి!

రామాయణం నుండి స్పెషల్ ట్రీట్ .. ఆకట్టుకుంటున్న ‘సీతారామ్’ పోస్టర్!

వినాయక చవితి స్పెషల్..నయనతార మూకుత్తి అమ్మన్ 2 టీజర్ రిలీజ్!

Varanasi Leak : గుడి దగ్గర ఆ డైనోసర్ ఏంటి..జక్కయ్య నీ ప్లానేంటి సామి..?

గణనాథుడి ఆశీస్సులు అందరికి ఉండాలి.. పవన్ కళ్యాణ్ స్పెషల్ ట్వీట్..

రీ రిలీజ్ కి సిద్ధం అవుతున్న ‘ఉపేంద్ర’ మూవీ!

ఈ స్పీడ్ ఏంటి రవితేజా.. ఇరుముడి తర్వాత జోరు పెంచాడుగా !

Big Stories

Advertisement
×