E-Paper
Advertisement

కొత్త లుక్‌ లో అవెనిస్ స్కూటర్.. యువత కోసం సుజుకి సూపర్ ప్లాన్!

కొత్త లుక్‌ లో అవెనిస్ స్కూటర్.. యువత కోసం సుజుకి సూపర్ ప్లాన్!
Advertisement

Avenis Special Edition Now More Stylish: సుజుకి మోటార్ సైకిల్ ఇండియా తన పాపులర్ స్కూటర్ అవెనిస్ స్పెషల్ ఎడిషన్‌ను కొత్త రంగుతో మరింత స్టైలిష్ గా మార్చింది. తాజాగా పెర్ల్ గ్లేసియర్ వైట్, మెటాలిక్ ఊర్ట్ గ్రే కలర్స్ ను యాడ్ చేసింది. ఈ కొత్త కలర్ తో స్కూటర్‌ కు మరింత స్టైలిష్, స్పోర్టీ లుక్ వచ్చింది. ముఖ్యంగా యువతను ఆకర్షించాలనే ఉద్దేశంతో ఈ మార్పు తీసుకువచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ కొత్త మోడల్ ధరను రూ. 86,677గా ఫిక్స్ చేసింది.

మెకానికల్ గా నో ఛేంజెస్

మెకానికల్ విషయానికి వస్తే, స్కూటర్‌ లో ఎలాంటి మార్పులు చేయలేదు. 124.3cc సామర్థ్యం కలిగిన సింగిల్ సిలిండర్, ఫోర్ స్ట్రోక్ ఇంజన్ అలాగే కొనసాగుతోంది. సుజుకి ఎకో పర్ఫార్మెన్స్ (SEP) టెక్నాలజీతో ఈ ఇంజన్ రూపొందింది. ఇది స్మూత్ పనితీరుతో పాటు మంచి ఇంధన సామర్థ్యాన్ని అందించడానికి ఉపయోగపడుతుంది. CVT గేర్‌ బాక్స్‌ తో జతచేయబడిన ఈ ఇంజన్ 6,750 rpm దగ్గర 8.5 bhp పవర్, 5,500 rpm దగ్గర 10 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రోజువారీ ప్రయాణాలకు సరిపడేలా దీని పనితీరు సెట్ చేశారు.

మంచి ఫీచర్ ప్యాకేజీ

Advertisement

ఫీచర్ల పరంగా చూస్తే, అవెనిస్ స్పెషల్ ఎడిషన్ మంచి ప్యాకేజ్ అందిస్తుంది. ముందువైపు LED హెడ్‌ల్యాంప్, వెనుక LED టెయిల్ ల్యాంప్‌లు ఉన్నాయి. చక్కటి గ్రాఫిక్స్, స్ప్లిట్ గ్రాబ్ రైల్స్ స్కూటర్‌కు స్పోర్టీ టచ్ ఇస్తాయి. ముఖ్యంగా, సుజుకి రైడ్ కనెక్ట్ ఫీచర్‌తో కూడిన బ్లూటూత్ సపోర్ట్ ఉన్న డిజిటల్ LCD డిస్ప్లే ఈ స్కూటర్‌కు ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. దీనివల్ల కాల్ అలర్ట్స్, మెసేజ్ నోటిఫికేషన్స్ లాంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి.

ఇక ప్రాక్టికాలిటీ విషయంలో కూడా ఈ స్కూటర్ బాగానే ఉంటుంది. ముందు భాగంలో USB ఛార్జింగ్ సాకెట్‌ తో చిన్న స్టోరేజ్ బాక్స్ ఉంది. ఫ్యూయల్ లిడ్ బయట ఉండటం వల్ల పెట్రోల్ నింపడం ఈజీగా ఉంటుంది. పొడవైన సీటు ఇద్దరు సౌకర్యంగా కూర్చునేందుకు అనుకూలంగా ఉంటాయి. సీటు కింద 21.8 లీటర్ల స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది.  దీనివల్ల హెల్మెట్, ఇతర వస్తువులను సులభంగా పెట్టుకోవచ్చు.

కలర్ మినహా నో ఛేంజెస్

Advertisement

మొత్తంగా సుజుకి అవెనిస్ స్పెషల్ ఎడిషన్‌లో కొత్తగా వచ్చిన ఈ కలర్ తప్ప పెద్ద మార్పులు లేవు. అయితే, ఈ కొత్త లుక్ తో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మంచి పనితీరు, అవసరమైన ఫీచర్లు, ప్రాక్టికాలిటీతో ఆల్ ఇన్ వన్  ప్యాకేజ్‌ గా  125cc సెగ్మెంట్‌ లో యువతకు మంచి ఆప్షన్‌ కానుంది.

Read Also: పల్సర్ లవర్స్ కు గుడ్ న్యూస్, కొత్త ఇంజన్‌తో NS400Z వచ్చేసింది!

Related News

నల్లగొండ జిల్లాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ జోరు, ఏడాదిలో 11 వేలకు పైగా కొనుగోళ్లు!

432 కి.మీ రేంజ్.. అరగంటలో ఛార్జింగ్.. 11 వేల కి.మీ నడిపిన తర్వాత క్రెటా EV రివ్యూ!

జావా 42 బాబర్‌కు అదిరిపోయే లుక్.. ఆల్ స్టార్స్ ఎడిషన్ ఏముంది భయ్యా!

ఆగస్టులో అదరగొట్టిన టాప్ 5 కార్లు.. నంబర్ వన్‌ ఏదంటే?

టాటా ఈవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు.. హారియర్ పై ఏకంగా రూ.2.75 లక్షల తగ్గింపు!

మహీంద్రా పేరు వెనుక ఇంత పెద్ద కథ ఉందా? కంపెనీ అసలు పేరు ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

మారుతి కస్టమర్లకు షాక్.. మళ్లీ ధరలు పెంపు, ఈసారి ఎంతంటే?

కార్నివాల్ హైబ్రిడ్ To న్యూ సోనెట్.. కియా నుంచి రాబోతున్న 10 క్రేజీ కార్లు ఇవే!

Big Stories

Advertisement
×