సంతోష్ శోభన్ కొన్నాళ్లుగా అడ్రెస్ లేరు. అతను హీరోగా మొదలైన ఒకటి, రెండు సినిమాలు ఆగిపోయాయి. అయితే సడన్ గా ‘కపుల్ ఫ్రెండ్లీ’ అంటూ వాలెంటైన్స్ డేకి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఫిబ్రవరి 14న విడుదల కానున్న ఈ సినిమాకి ప్రీమియర్ షోలు పడ్డాయి.మరి సినిమా ఏ మేరకు ఆకట్టుకుందో.. ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :
శివ(సంతోష్ శోభన్) సరిగ్గా చదువుకోక.. ఏ పని చేయడం చేతకాక ఇంట్లో వాళ్ళతో తిట్లు తింటూ ఉంటాడు. ఒకరోజు అతను చెన్నై వెళ్లి ఇంటీరియర్ డిజైనర్ గా జాబ్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. మరోవైపు పార్ట్ టైం చేసి డబ్బులు సంపాదించేందుకు బైక్ డ్రైవింగ్,కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అతనికి మిత్ర(మానస వారణాసి) పరిచయం అవుతుంది. ఆమె ఇంట్లో వాళ్ళు ఆమెకు పెళ్లి చేయాలని చూస్తుంటే.. చెన్నైలో జాబ్ వచ్చిందని చెప్పి పెళ్లి నుండి ఎస్కేప్ అయ్యే ప్రయత్నాలు చేస్తుంటుంది. ఒకరోజు శివ, మిత్ర కార్ లో కలుసుకుంటారు. ఒకసారి మిత్ర తాను ఉంటున్న హాస్టల్ ఖాళీ చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో శివ సాయంతో వేరే హాస్టల్ కోసం గాలిస్తూ ఉంటుంది.అయితే సరైన రూమ్ దొరక్కపోవడంతో శివ తన రూమ్లో ఉండి.. రెంట్ షేర్ చేసుకోమని చెబుతాడు. అందుకు ఇబ్బంది పడుతూనే తప్పక ఓకే అంటుంది మిత్ర. తర్వాత అందరూ ఊహించినట్టే వాళ్ళు ఫిజికల్ గా మెంటల్ గా కూడా దగ్గరవుతారు. అదే రిలేషన్షిప్ మొదలుపెడతారు.శివ కెరీర్లో ఎదగడానికి మిత్ర సాయం చేస్తుంది. కానీ మిత్ర మాత్రం జాబ్ సంపాదించలేకపోతుంది. దీంతో ఇద్దరికీ మనస్పర్థలు వస్తాయి. ఆమెకు జాబ్ రాకపోవడానికి కారణం ఏంటి? చివరికి వీరి ప్రయాణం ఎలా ముగిసింది? వంటి ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.
విశ్లేషణ : కపుల్ ఫ్రెండ్లీ’ టైటిల్ తో టీజర్, ట్రైలర్స్ తో ఆడియన్స్ ని ఈ సినిమా యూనిట్ ప్రిపేర్ చేసిన విధానం బాగుంది. ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా అనిపిస్తుంది. కొంత కామెడీ, కొంత రొమాన్స్, ఇంటర్వెల్ సీక్వెన్స్ .. బాగానే అనిపిస్తాయి.అలా అని కొత్తగా ఏమీ ఉండవు. ముఖ్యంగా మణిరత్నం, గౌతమ్ మీనన్ వంటి దర్శకులు గతంలో తీసిన లవ్ స్టోరీస్ చూసిన వాళ్లకి ఇది ఏమాత్రం కొత్త ఫీలింగ్ కలిగించదు. ఇక సెకండాఫ్ అయితే ఎంత ప్రిపేర్ అయ్యి వెళ్లిన ఆడియన్స్ కి అయినా బోర్ కొట్టకుండా ఉండదు. ఒకే చోట కథ తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ లో ఎమోషనల్ డోస్ ఎక్కువైన ఫీలింగ్ కలిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ పాత పాయింట్ తీసుకున్నప్పటికీ కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. కానీ పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. ముఖ్యంగా సినిమాకి అత్యంత కీలకంగా ఉండాల్సిన సెకండాఫ్ తేలిపోయింది. టెక్నికల్ గా మాత్రం సినిమా రియలిస్టిక్ ఫీలింగ్ ఇస్తుంది. ముఖ్యంగా దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ సినిమా స్థాయిని పెంచింది. మ్యూజిక్ కొంత వరకు ఓకే. రన్ టైం తక్కువే అయినప్పటికీ సెకండాఫ్ వల్ల ఎక్కువగానే ఉన్న ఫీలింగ్ అందరికీ కలుగుతుంది.
నటినటుల విషయానికి వస్తే .. సంతోష్ శోభన్ ఈ సినిమాలో కూడా నటనతో ఇంప్రెస్ చేసింది ఏమీ లేదు. ‘ఏటో వెళ్ళిపోయింది మనసు’ వంటి సినిమాల్లో నానిని ఇమిటేట్ చేసినట్టు అనిపిస్తుంది. రొమాన్స్ లో మాత్రం రెచ్చిపోయాడు. మానస వారణాసి లుక్స్ బాగున్నాయి. రాజీవ్ కనకాల, గోపరాజు రమణ తమ స్థాయికి తగ్గ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. యోగిబాబు అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు.
రిలేటబుల్ లవ్ స్టోరీ: సినిమాలో లవ్ సీన్స్ గానీ, గానీ చాలా నేచురల్‌గా ఉన్నాయి. ఈ కాలం జంటలు ఖచ్చితంగా రిలేట్ చేసుకుంటారు.
రొమాన్స్ & కెమిస్ట్రీ: ట్రైలర్ లోనే ముద్దు సీన్లు చూసి అందరూ షాక్ అయ్యారు. సినిమాలో కూడా సంతోష్ – మానస మధ్య కెమిస్ట్రీ పీక్స్‌లో ఉంది. సీన్లు రొమాంటిక్‌గా ఉన్నా ఎక్కడా అసభ్యంగా అనిపించకుండా, చాలా పొయెటిక్‌గా తీశారు.
సంతోష్ శోభన్ మార్క్: సంతోష్ తన టైమింగ్‌తో మళ్ళీ అదరగొట్టాడు, ఎమోషన్ అయినా ఆయన నటనకు జంటలు ఫిదా అవ్వాల్సిందే. మానస వారణాసి కూడా తన సినిమా చాలా బాగా చేసింది.
వాలెంటైన్ వైబ్స్: యూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్ కావడంతో విజువల్స్ అన్నీ కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు పెద్ద అసెట్.
సెన్సార్ ‘A’ సర్టిఫికేట్: పేరుకు కపుల్ ఫ్రెండ్లీ అయినా, సెన్సార్ వాళ్ళు దీనికి ‘A’ ఇచ్చారు. కేవలం టైటిల్ వల్లనా లేక లోపల ఉన్న రొమాన్స్ వల్లనా అనేది కొంచెం డౌటే.
సాగదీత: సెకండాఫ్‌లో కొన్ని సీన్లు కొంచెం సాగదీసినట్టు అనిపిస్తాయి. కుటుంబంతో కలిసి వెళ్లాలంటే కొన్ని సీన్లు కొంచెం ఇబ్బందిగా అనిపించొచ్చు.
అసలు ముచ్చటకు వస్తే : మీరు మీ పార్ట్‌నర్‌తో కలిసి ఈ వాలెంటైన్స్ డే రోజు ఒక మంచి ‘మోడరన్ లవ్ స్టోరీ’ చూడాలనుకుంటే ‘కపుల్ ఫ్రెండ్లీ’ బెస్ట్ ఛాయిస్. మరీ లోతుగా ఆలోచించకుండా, సరదాగా ఎంజాయ్ చేయడానికి ఈ బొమ్మ పక్కా సెట్ అయితది.