E-Paper
Advertisement

OTT Movie : ‘మన శంకర వర ప్రసాద్ గారు’ నుంచి ‘బ్యాండ్ వాలే’ వరకు… ఈ వాలెంటైన్స్ వారంలో చూడాల్సిన 5 కొత్త సినిమాలు సిరీస్ లు

OTT Movie : ‘మన శంకర వర ప్రసాద్ గారు’ నుంచి ‘బ్యాండ్ వాలే’ వరకు… ఈ వాలెంటైన్స్ వారంలో చూడాల్సిన 5 కొత్త సినిమాలు సిరీస్ లు
Advertisement

OTT Movie : ఈ వాలెంటైన్స్ వీక్ లో వివిధ భాషల్లో, వివిధ జానార్లలో ఉన్న సినిమాలు ఓటీటీలలోకి అడుగు పెట్టాయి. ఆ లిస్ట్ లో మ్యూజికల్ డ్రామా నుండి యాక్షన్ కామెడీ, ఎమోషనల్ థ్రిల్లర్, హారర్ కామెడీ వరకు అన్ని జానర్ల సినిమాలు ఉన్నాయి. హిందీ సిరీస్ ‘బ్యాండ్ వాలే’, తెలుగు మూవీ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ వరకు… మలయాళం, కన్నడ థ్రిల్లర్లు ఈ వారం డిజిటల్ స్పేస్‌లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ చిత్రాలు, సిరీస్‌లు విభిన్న కథలతో ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. ప్రైమ్ వీడియో, జీ5, సోనీలివ్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఉన్న టాప్ 5 తాజా మూవీస్ పై ఒక లుక్కేద్దాం.

బ్యాండ్ వాలే

ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 13న విడుదలైన తాజా హిందీ సిరీస్ ‘బ్యాండ్ వాలే’. ఈ 8-ఎపిసోడ్‌ల మ్యూజికల్ డ్రామా రత్లాం పట్టణంలో కవయిత్రి కావాలనుకునే ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఆమె చిన్న పట్టణంలో మహిళలపై ఉండే స్టీరియోటైపికల్ అంచనాల నుండి బయటపడటానికి ప్రయత్నిస్తుంది. అనామక ఆన్‌లైన్ పోయెట్రీ ద్వారా తన భావాలను వ్యక్తపరుస్తూ, రోబో – డీజే సైకో వంటి బ్యాండ్‌మేట్స్ సహాయంతో తన గుర్తింపు పొందడానికి ట్రై చేస్తుంది. ఇందులో షాలిని పాండే ప్రధాన పాత్రలో నటించగా, స్వానంద్ కిర్కిరే, జహాన్ కపూర్ ముఖ్య పాత్రలు పోషించారు.

మన శంకర వర ప్రసాద్ గారు

Advertisement

మెగాస్టార్ చిరంజీవి నటించిన యాక్షన్ కామెడీ చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’. ఈ ఏడాది టాలీవుడ్ లో సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ మూవీ. ముఖ్యంగా ఫ్యామిలే ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. జీ5లో ఫిబ్రవరి 11న విడుదలై, వ్యూస్ పరంగా రికార్డులు కొల్లగొడుతోంది. శంకర వర ప్రసాద్ (చిరంజీవి) ఒక NSG అధికారి. తన మాజీ భార్య శశిరేఖ (నయనతార), ఆమె తండ్రి (సచిన్ ఖడేకర్) చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. ఈగో క్లాష్‌ల వల్ల విడాకులు తీసుకున్న తర్వాత, ప్రొటెక్షన్ డ్యూటీలో తన కుటుంబాన్ని తిరిగి సంపాదించుకోవడానికి హీరో ప్రయత్నిస్తాడు. అండర్‌కవర్ PT ఇన్‌స్ట్రక్టర్‌గా, రివెంజ్ కోసం వచ్చిన ఎక్స్-కాప్‌తో ఫైట్ చేస్తాడు. ఫ్యామిలీ సెంటిమెంట్, యాక్షన్, కామెడీ మిళితమై ఉన్న ఈ చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందింది. వెంకటేష్, క్యాథరిన్ ట్రెసా కీలక పాత్రలు పోషించారు.

Also Read : ఎట్టకేలకు డైరెక్ట్ గా ఓటీటీలోకి అవార్డు విన్నింగ్ మూవీ… స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడ ?

బేబీ గర్ల్

Advertisement

నవిన్ పౌలీ నటించిన మలయాళం థ్రిల్లర్ ‘బేబీ గర్ల్’. జనవరి 23న థియేటర్లలో విడుదలై మిక్స్‌డ్ రివ్యూలు అందుకున్న ఈ చిత్రం సోనీలివ్‌లో ఫిబ్రవరి 12న విడుదలైంది. తిరువనంతపురంలోని గుడ్ షెపర్డ్ హాస్పిటల్‌లో క్రిస్మస్ ఈవ్‌ బ్యాక్‌డ్రాప్‌గా, ఒక నవజాత శిశువు అపహరణ చుట్టూ కథ తిరుగుతుంది. హాస్పిటల్ అటెండెంట్ సనల్ మాథ్యూ (నివిన్ పౌలీ) ప్రధాన అనుమానితుడిగా మారగా, స్వయంగా అతనే మిస్సైన శిశువును కనుగొని తాను ఇన్నోసెంట్ అని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ మెడికల్ థ్రిల్లర్ అరుణ్ వర్మ దర్శకత్వంలో రూపొందగా, ఓటీటీలో మంచి రెస్పాన్స్ దక్కుతోంది. తమిళం, తెలుగు, కన్నడ డబ్ వెర్షన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.

సూర్య: పవర్ ఆఫ్ లవ్

ఇదొక కన్నడ రొమాంటిక్ యాక్షన్ డ్రామా. ఫిబ్రవరి 13నే ఓటీటీలో విడుదలైంది. సూర్య అనే అనాథ బాలుడు బతుకుదెరువు కోసం చిన్న ఉద్యోగాలు చేస్తుంటాడు. కానీ నేరస్థులతో కలసి డేంజర్ లో పడతాడు. ప్రశాంత్ సూర్య ప్రధాన పాత్రలో, హర్షిత ఎంకే భూమికగా నటించిన ఈ సినిమా సాగర్ దాస్ దర్శకత్వంలో రూపొందింది. 128 నిమిషాల ఈ మూవీలో ప్రమోద్ శెట్టి, పి. రవిశంకర్, టి.ఎస్. నాగభరణ, శ్రుతి వంటి నటీనటులు నటించారు. గత నెల థియేటర్లలో విడుదలై మిక్స్‌డ్ రివ్యూలు అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు sun NXT ఓటీటీలో అందుబాటులో ఉంది.

భానుప్రియ భూటర్ హోటల్

ఉత్తర బెంగాల్‌లోని సుందరమైన ప్రదేశంలో ఉన్న విలాసవంతమైన హోటల్ కేంద్రంగా రూపొందిన హారర్ కామెడీ మూవీ ఇది. కానీ గ్రేవ్‌యార్డ్ పై నిర్మించిన ఈ హోటల్‌లో వింతైన సంఘటనలు జరుగుతాయి. అక్కడ ఉండే దెయ్యాలు సిబ్బంది, అతిథులను భయపెడతాయి. మిమి చక్రవర్తి, సోహమ్ మజుందార్, బోనీ సేన్‌గుప్తా, స్వస్తిక దత్తా ముఖ్య పాత్రలు పోషించిన ఈ మూవీకి అరిత్ర ముఖర్జీ దర్శకత్వం వహించగా, ఫిబ్రవరి 13న జీ5లో విడుదలైంది.

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×