E-Paper
Advertisement

Indian Navy: అగ్నివీర్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్.. క్వాలిఫికేషన్ ఇదే, అప్లై చేసుకున్నారా..?

Indian Navy: అగ్నివీర్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్.. క్వాలిఫికేషన్ ఇదే, అప్లై చేసుకున్నారా..?
Advertisement

నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్.. దేశ రక్షణ రంగంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించే యువతకు భారత నౌకాదళం అద్భుతమైన అవకాశం కల్పించింది. 01/2027 ,02/2027 బ్యాచ్‌లకు సంబంధించి అగ్నివీర్ (సీనియర్ సెకండరీ రిక్రూట్ – SSR) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. కేవలం అవివాహిత పురుషులు అలాగే మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అవుతారు. సముద్ర తీరాల రక్షణలో పాలుపంచుకోవాలనుకునే ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 6వ తేదీలోపు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

విద్యార్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి గణితం అలాగే ఫిజిక్స్ సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కనీసం 50 శాతం మార్కులు కలిగి ఉండటం తప్పనిసరి. వీటితో పాటు మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి విభాగాల్లో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిజిక్స్ అలాగే మ్యాథ్స్ సబ్జెక్టులతో రెండేళ్ల వొకేషనల్ కోర్సు పూర్తి చేసిన వారికి సైతం అవకాశం కల్పించారు.

Advertisement

వయస్సు: అభ్యర్థుల వయోపరిమితిని పరిశీలిస్తే 01/2027 బ్యాచ్ అభ్యర్థులు డిసెంబర్ 1, 2004 నుండి మే 31, 2009 మధ్య జన్మించి ఉండాలి. 02/2027 బ్యాచ్ అభ్యర్థులు మే 1, 2005 నుండి అక్టోబర్ 31, 2009 మధ్య జన్మించిన వారై ఉండాలి. పురుషులు అలాగే మహిళా అభ్యర్థులు కనీసం 157 సెంటీమీటర్ల ఎత్తు ఉండటం ప్రాథమిక అర్హతగా నిర్ణయించారు.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ:  ఎంపిక ప్రక్రియ మొత్తం మూడు దశల్లో కొనసాగుతుంది. మొదటి దశలో కంప్యూటర్ ఆధారిత ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్ (INET) నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారిని షార్ట్‌లిస్ట్ చేసి రెండో దశకు ఎంపిక చేస్తారు. రెండో దశలో భాగంగా రాత పరీక్షతో పాటు శారీరక దార్ఢ్య పరీక్ష (PFT) అలాగే వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. తుది ఎంపికలో అభ్యర్థుల ప్రతిభను ప్రామాణికంగా తీసుకుంటారు.

Advertisement

ఎగ్జామ్: పరీక్షా విధానాన్ని గమనిస్తే.. హిందీ అలాగే ఇంగ్లీష్ భాషల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. మొత్తం 100 మార్కులకు గాను 50 ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లీష్ అలాగే సైన్స్ తో పాటు మ్యాథమెటిక్స్ అలాగే జనరల్ అవేర్‌నెస్ విభాగాల నుండి ప్రశ్నలు వస్తాయి. ఒక గంట వ్యవధిలో ఈ పరీక్ష పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగటివ్ మార్కింగ్ విధానం అమల్లో ఉంది.

శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు ఒడిశాలోని ఐఎన్‌ఎస్ చిల్కాలో శిక్షణ ఇస్తారు. 01/2027 బ్యాచ్ వారికి డిసెంబర్ 2026లో అలాగే 02/2027 బ్యాచ్ వారికి మే 2027లో శిక్షణ ప్రారంభమవుతుంది.

జీతం: మొదటి ఏడాది నెలకు రూ. 30,000 జీతం లభిస్తుంది. దీనికి ఏటా నిర్ణీత ఇంక్రిమెంట్ అదనంగా ఉంటుంది. అభ్యర్థికి చేతికి 70 శాతం జీతం అందగా మిగిలిన 30 శాతం అగ్నివీర్ కార్పస్ ఫండ్‌కు జమ అవుతుంది.

నాలుగు ఏళ్ల పదవీ కాలం ముగిసిన తర్వాత ‘సేవా నిధి’ పథకం కింద ప్రభుత్వం ఇచ్చే వాటాతో కలిపి సుమారు రూ. 10.04 లక్షలు అందజేస్తారు.

దరఖాస్తు ఫీజు: ఆసక్తి గల అభ్యర్థులు రూ. 550 దరఖాస్తు ఫీజు చెల్లించి నేవీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు: ఆన్‌లైన్ ప్రక్రియ మార్చి 14 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 6న ముగుస్తుంది. ఐనెట్ పరీక్షను మే 2026లో నిర్వహించే అవకాశం ఉంది.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.joinindiannavy.gov.in/

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×