E-Paper
Advertisement

నిరుద్యోగులకు సువర్ణవకాశం.. డిగ్రీ అర్హతతో 1000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్

నిరుద్యోగులకు సువర్ణవకాశం.. డిగ్రీ అర్హతతో 1000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్
Advertisement

నిరుద్యోగ అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్.. దేశవ్యాప్తంగా ఉన్న పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ (PSB) శాఖల్లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ (జేఎంజీఎస్‌-1) ఖాళీల భర్తీకి ఢిల్లీలోని హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 1000 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో తెలంగాణ రాష్ట్రానికి 30 ఖాళీలు కేటాయించారు. బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 20వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోండి.

Advertisement

పోస్టుల వివరాలు: 

మొత్తం 1000 పోస్టులలో కేటగిరీల వారీగా చూస్తే అన్‌రిజర్వ్‌డ్ (UR) అభ్యర్థులకు 425 పోస్టులు ఉన్నాయి. ఎస్సీలకు 145, ఎస్టీలకు 68, ఓబీసీలకు 264, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 98 ఖాళీలను కేటాయించారు.

Advertisement

వివిధ రాష్ట్రాల్లో ఉన్న అవసరాలకు అనుగుణంగా ఈ నియామకాలు చేపడుతున్నారు. ప్రధానంగా ఉత్తరప్రదేశ్ (200) గుజరాత్ (125) పంజాబ్ (100) ఛత్తీస్‌గఢ్ (80) ఒడిశా (80) తమిళనాడు (65) రాష్ట్రాల్లో ఎక్కువ సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో 30 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.

తెలంగాణలో: 30 పోస్టులు

విద్యార్హత:  ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. విద్యార్హతతో పాటు వృత్తిపరమైన అనుభవం తప్పనిసరి చేశారు.

అనుభవం: ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లేదా రీజినల్ రూరల్ బ్యాంక్ (RRB)లో ఆఫీసర్‌గా కనీసం 18 నెలల పాటు పనిచేసిన అనుభవం ఉండాలి.

వయస్సు: అభ్యర్థుల వయస్సు మార్చి 1 2026 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు గరిష్ట వయస్సులో సడలింపు ఉంటుంది.

సెలక్షన్ ప్రాసెస్: అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా తొలుత రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో ప్రతిభ కనబరిచిన వారికి ఇంటర్వ్యూ ఉంటుంది. లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు కాబట్టి అభ్యర్థులకు స్థానిక భాషపై పట్టు ఉండాలి. ఇందుకోసం ప్రత్యేకంగా స్థానిక భాషా పరీక్ష (LPT) నిర్వహిస్తారు. అనంతరం సర్టిఫికెట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

జీతం: ఎంపికైన ఆఫీసర్లకు నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు పే స్కేల్ వర్తిస్తుంది. దీనితో పాటు ఇతర అలవెన్సులు బ్యాంక్ నిబంధనల ప్రకారం అందుతాయి.

దరఖాస్తు ప్రక్రియ: ఆసక్తి కలిగిన అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.850 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు రూ.100 ఫీజు నిర్ణయించారు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తులకు ఏప్రిల్ 20. అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలని బ్యాంక్ అధికారులు సూచించారు

అఫీషియల్ వెబ్ సైట్: https://punjabandsind.bank.in/

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×