E-Paper
Advertisement

UP Rains: విరుచుకుపడ్డ వర్షాలు.. ఏకంగా 100 మంది మృత్యువాత.. సీఎం తీవ్ర భావోద్వేగం

UP Rains: విరుచుకుపడ్డ వర్షాలు.. ఏకంగా 100 మంది మృత్యువాత.. సీఎం తీవ్ర భావోద్వేగం
Advertisement

UP Rains: ఉత్తర్ ప్రదేశాన్ని రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం కురిసిన వర్షానికి ఏకంగా 100 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఒక్క ప్రయాగ్ రాజ్ లోనే 21 మంది చనిపోయినట్లు ధ్రువీకరించారు. మరోవైపు మృతుల కుటుంబాలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర సంతాపం తెలియజేశారు. 24 గంటల్లో బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

ప్రాంతాల వారీగా మృతులు..

అకస్మిక వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలినట్లు యూపీ అధికార వర్గాలు పేర్కొన్నాయి. వర్షాల కారణంగా చనిపోయిన వారి సంఖ్యను.. ప్రాంతాల వారీగా ప్రకటించాయి. ప్రయాగ్ రాజ్ లో అత్యధికంగా 21 మంది చనిపోగా.. భదోహిలో 18 మంది, మీర్జాపూర్ లో 15 మంది, ఫతేపూర్ లో మరో 10మంది ప్రాణాలు విడిచారు. అలాగే ఉన్నావ్, బదౌన్ లో ఆరుగురు, ప్రతాప్ గఢ్, బరేలీలో నలుగురు చొప్పున మృత్యువాత పడ్డారు. అటు సీతాపూర్, రాయ్ బరేలి, చందౌలీలో ఇద్దరు చొప్పున తుదిశ్వాస విడిచినట్లు అధికారుల స్ఫష్టం చేశారు.

Advertisement

Also Read: ఓటర్లకు బిగ్ అలర్ట్.. ఏపీ, తెలంగాణ సహా 16 రాష్ట్రాల్లో SIR.. ఆ తేదీల్లో ఇంటింటి సర్వే

ఒక్కసారిగా మారిన వాతావరణం

యూపీలో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయినట్లు అధికారులు, ప్రజలు చెబుతున్నారు. యూపీ వ్యాప్తంగా చాలా ప్రాంతాలను దట్టమైన మేఘాలు కమ్మేశాయని తెలియజేస్తున్నారు. అనంతరం అతివేగంగా వీచిన గాలులు ధాటికి రహదారి పక్కన ఉన్న హోర్డింగ్స్, రేకుల షెడ్లు ఎగిరిపోయాయని పేర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వృక్షాలు సైతం గాలి ధాటికి వేళ్లతో సహా బయటకు వచ్చి కుప్పకూలాయని వివరిస్తున్నారు. కుప్పకూలిన చెట్ల కారణంగా చాలా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల వాహనాలపై చెట్లు పడి నుజ్జు నుజ్జు కూడా అయ్యాయని, తుఫాను ధాటికి పలువురి ఇళ్లు సైతం దెబ్బతిన్నాయని వివరించారు.

Advertisement

Also Read: BSNL ధమాకా ఆఫర్.. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే.. 300 రోజులు పండగే!

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×