E-Paper
Advertisement

Rakasa Movie: ఫాంట‌సీ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘రాకాస‌’ తెలుగు థియేట్రికల్ డీల్ క్లోజ్.. ఎంత మొత్తానికంటే?

Rakasa Movie: ఫాంట‌సీ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘రాకాస‌’ తెలుగు థియేట్రికల్ డీల్ క్లోజ్.. ఎంత మొత్తానికంటే?
Advertisement

Rakasa Movie: ఏప్రిల్ 3న రిలీజ్ కానున్న ఫ్యాన్సీ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘రాకాస‌’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రారంభం నుంచి వైవిధ్యమైన కంటెంట్, ప్రమోషనల్ ప్లానింగ్‌తో ఈ సినిమా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్‌కు ముందే జ‌రిగిన థియేట్రిక‌ల్ బిజినెస్ డీల్ ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణల్లో ఈ సినిమా థియేట్రిల్ రైట్స్‌ను శ్రీ ల‌క్ష్మి న‌ర‌సింహ మూవీ మేక‌ర్స్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నారు. దీంతో సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేష‌న్స్ ఏంటో తెలుస్తుంది. సినిమాకు థియేట‌ర్స్‌లో మంచి ఆద‌ర‌ణ ద‌క్కుతుంద‌ని ట్రేడ్ స‌ర్కిల్స్ భావిస్తున్నాయి.

Read also-Dhurandhar 2: జోరు పెంచిన ధురంధర్ 2.. విడుదలకు ముందే 130 కోట్లు..ఇదేంటి సామీ!

Advertisement

రాకాస సినిమా విడుదలకు సిద్ధమవుతోన్న‌ సమయంలో ఈ లేటెస్ట్ డీల్‌తో ‘రాకాసా’ చిత్రానికి డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ మరింత బలపడింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ విడుదల చేస్తుండ‌గా.. ఓవ‌ర్‌సీస్‌లో మేక‌ర్స్ భారీ స్థాయిలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అథ‌ర్వ‌ణ భ‌ద్ర‌కాళి పిక్చ‌ర్స్ ఈ సినిమా అంతర్జాతీయ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలను నిర్వ‌హిస్తోంది. ఈ సంస్థ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్, యూరప్, కెనడా, ఆస్ట్రేలియా వంటి కీలక ప్రాంతాల్లో కలిపి 350కు పైగా అంతర్జాతీయ స్క్రీన్లలో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేసింది. ముఖ్యంగా నార్త్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మార్కెట్లలో డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలను ప్రత్యంగిరా సినిమాస్ చేపట్టింది. విదేశీ ప్రేక్షకుల కోసం ప్రీమియర్ షోలు 2026 ఏప్రిల్ 2న ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. ఆ తర్వాతి రోజు సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ విష‌యాల‌తోనే కాకుండా ఈ సినిమాకు నాన్ థియేట్రికల్ రంగంలో కూడా మంచి డీలింగ్స్‌ కుదిరాయి. మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకోగా..ఆడియో హక్కులను సారెగ‌మ‌ దక్కించుకుంది. భారతదేశంలో ప్రముఖ మ్యూజిక్ లేబుల్స్‌లో ఒకటైన సారెగ‌మ‌ ఈ హక్కులను పొందడం విశేషం. ఈ రెండు డీలింగ్స్ చూస్తే ఇది సినిమాకు బిజినెస్ ప‌రంగా మరింత బలం చేకూర్చడమే కాకుండా..ప్రాజెక్ట్‌పై పెరుగుతోన్న ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను తెలియ‌జేస్తున్నాయి.

Advertisement

Read also-YouTuber Vaishnavi Murder: యూట్యూబర్ వైష్ణవి హత్య.. నిందితుడు ఎవరో తెలుసా, జగిత్యాల జిల్లాలో

మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాల‌తో యువ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించిన సంగీత్ శోభ‌న్ ‘రాకాస’ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయనకు జోడీగా న‌య‌న‌ర్ సారిక‌ కనిపించనున్నారు. ప్రేమ, హాస్యం, ఫాంటసీ అంశాలు కలగలిపిన కథతో ఈ సినిమా రూపొందింది. ఇంకా ఈ చిత్రంలో వెన్నెల కిషోర్‌, బ్ర‌హ్మాజీ, త‌నికెళ్ల భ‌ర‌ణి, ఆశిష్ విద్యార్థి, గెట‌ప్ శ్రీను త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఈ సినిమాకు మాన‌స శ‌ర్మ కథ‌ను అందించ‌టంతో పాటు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆమె ముందు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సిరీస్‌కు క్రియేటర్, రైటర్‌గా గుర్తింపు పొందారు. తర్వాత బెంచ్ లైఫ్‌ అనే ప్రాజెక్ట్‌ను కూడా డైరెక్ట్ చేశారు. ఈ సినిమాకు మంచి టెక్నిక‌ల్ టీమ్‌కు తోడ్పాటునందిస్తోంది. ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతాన్ని స‌మ‌కూరుస్తుండ‌గా రాజు ఎదురోలు సినిమాటోగ్ర‌పీ అందిస్తున్నారు. అన్వ‌ర్ అలీ ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. నిహారిక, జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో త‌న పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి ‘రాకాస’ మూవీని నిర్మిస్తున్నారు.

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×