E-Paper
Advertisement

YouTuber Vaishnavi Murder: యూట్యూబర్ వైష్ణవి హత్య.. నిందితుడు ఎవరో తెలుసా, జగిత్యాల జిల్లాలో

YouTuber Vaishnavi Murder: యూట్యూబర్ వైష్ణవి హత్య.. నిందితుడు ఎవరో తెలుసా, జగిత్యాల జిల్లాలో
Advertisement

YouTuber Vaishnavi Murder: యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్యకు గురైంది. ఆమె గర్భవతి అని కనికరం లేకుండా కత్తితో దాడి చేసి పొడిచి పొడిచి చంపేశాడు. సంచలనం రేపిన ఈ ఘటన జగిత్యాల జిల్లాలో వెలుగు చూసింది. అసలు వైష్ణవి హత్య వెనుక అసలు కారణాలేంటి? ఫ్యామిలీ సమస్యలా? లేక మరేమైనా ఉన్నాయా? ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే..

జగిత్యాల జిల్లాలో దారుణం.. యూట్యూబర్ వైష్ణవి హత్య

Advertisement

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి యూట్యూబ్ ద్వారా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇదే క్రమంలో కోరుట్ల పట్టణానికి చెందిన హరిబాబుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమించింది.. చివరకు వివాహం చేసుకుంది.

ఈ పెళ్లికి అబ్బాయి తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. తాను ఆమెని పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పాడు. తల్లిదండ్రుల నుంచి వేరుపడి కోరుకున్న ప్రియురాల్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అమ్మాయి ఇంట్లోనే కాపురం కొనసాగిస్తున్నాడు. ఇదంతా జరిగి రెండేళ్లు అయ్యింది. హాయిగా సాగుతున్న వైష్ణవి సంసారంలోకి ఒక్కసారిగా కలతలు మొదలయ్యాయి.

Advertisement

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త నిందితుడు

ఇటీవల వైష్ణవి గర్భవతి అయ్యింది. ఇప్పుడు ఆమెకి ఐదో నెల కూడా. కొద్దిరోజుల నుంచి హరిబాబు ఇంట్లో ఆస్తి తగాదాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ క్రమంలో ఏం జరిగిందో తెలియదు. గతరాత్రి హరిబాబు-వైష్ణవి మధ్య జరిగిన చిన్నపాటి గొడవ జరిగింది. అది తారాస్థాయికి చేరింది.

ఒకరిపై మరొకరు పెద్దగా రంకెలు వేసుకున్నారు. కోపానికి గురైన హరిబాబు.. వైష్ణవిని కత్తితో పలుచోట్ల పొడిచాడు. అప్పటికి గానీ హరిబాబు కసి తీరలేదు. మంగళవారం ఉదయం నిందితుడు పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగిపోయాడు. కళ్ల ముందు కన్న అమ్మాయి ఆ విధంగా చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు.

ALSO READ: బాచుపల్లిలో ఘోర ప్రమాదం.. బోల్తాపడిన మినీ బస్సు, 10 మంది ఉద్యోగులు

దీంతో మాదాపూర్ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని పోలీస్ స్టేషన్ ముందు ఆర్తనాదాలు చేశారు వైష్ణవి తల్లిదండ్రులు. లేదంటే తామే చంపేస్తామంటూ బోరున విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. హత్యకు దారి తీయడానికి గల కారణాలను నిందితుడ్ని రాబట్టారు.

 

 

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×