E-Paper
Advertisement

Khushboo: త్రిష – విజయ్ రిలేషన్ పై ఘాటుగా స్పందించిన ఖుష్బూ!

Khushboo: త్రిష – విజయ్ రిలేషన్ పై ఘాటుగా  స్పందించిన ఖుష్బూ!
Advertisement

Khushboo:సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలో నైనా సరే ఒక జంట రెండుకు మించి చిత్రాలలో కలిసి నటించారంటే చాలు వారి మధ్య ఏదో ఉందనే రూమర్లు రావడం సహజమే. ఇక ఆ సెలబ్రిటీలు బయట జంటగా కనిపిస్తే మాత్రం ఆ రూమర్లకు మరింత ఆజ్యం పోసినట్టు అవుతుంది. ఈ క్రమంలోనే కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దాదాపు 5 కి పైగా చిత్రాలలో నటించి ఆకట్టుకున్న త్రిష (Trisha) , విజయ్ (Vijay) గురించి కూడా ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలే వెలువడుతున్నాయి. త్రిష – విజయ్ గంత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్నారని, వివాహం కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మరొకవైపు విజయ్ భార్య సంగీత కూడా విజయ్ కి ఒక సినీనటితో ఉన్న బంధం కారణంగానే తాను విడిపోతున్నట్లు ఫ్యామిలీ కోర్టులో తెలుపుతూ విడాకులు కోరుతూ పిటిషన్ వేసింది. ఇక విడాకుల పిటిషన్ ను పరిశీలించిన ఫ్యామిలీ కోర్టు ఏప్రిల్ 20న విజయ్ హాజరు కావాలని నోటీసులు పంపించిన విషయం తెలిసిందే.

ఆగని ఎఫైర్ రూమర్స్..

మరొకవైపు తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో టీవీకే అనే పార్టీని స్థాపించిన విజయ్ తన పార్టీతో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయన వ్యక్తిగత విషయాలను బయటకు తీస్తూ అటు రాజకీయంగా ఆయనను దెబ్బతీసే ప్రయత్నం ప్రత్యర్ధులు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.ఇలా వార్తలు వినిపిస్తున్న సమయంలో త్రిష విజయ్ ఇటీవల ఒక చెన్నై పెళ్లి వేడుకలో మళ్లీ జంటగా కనిపించి రూమర్లకు చోటు ఇచ్చారు. ఇక అలా వీరిద్దరి రిలేషన్ పై వార్తలు జోరుగా వినిపిస్తున్న నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు వీరిపై మండిపడుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా వీరి రిలేషన్ పై వస్తున్న రూమర్స్ గురించి ప్రముఖ నటి , రాజకీయ నాయకురాలు ఖుష్బూ స్పందించింది.

స్పందించిన ఖుష్బూ..

Advertisement

ఖుష్బూ మాట్లాడుతూ..” త్రిష నాకు అత్యంత సన్నిహితురాలు. ఆమె ఎంతో హుందాగా ఉండే మృదుస్వభావి. ఎవరో తెలియని వారు చేసే అసభ్యకరమైన కామెంట్స్ గురించి ఆలోచించి సమయం వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు. సెలబ్రిటీల వెంటపడుతూ వారి వ్యక్తిగత విషయాలలో తలదూర్చి ఆనందం పొందే వారిని అస్సలు పట్టించుకోవద్దని ఎదుటివారిపై బురద చల్లే సంస్కృతి పెరిగిపోవడం దురదృష్టకరం” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఖు ష్బూ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కనీసం ఇప్పటికైనా ఈ జంటపై వస్తున్న రూమర్స్ ఆగిపోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

also read:Dhurandhar 2: జోరు పెంచిన ధురంధర్ 2.. విడుదలకు ముందే 130 కోట్లు..ఇదేంటి సామీ!

రూమర్స్ కి ఆజ్యం పోసిన త్రిష తల్లి..

Advertisement

ఇకపోతే సోషల్ మీడియాలో రూమర్స్ దావాణంలా పాకి పోతున్నాయి. ముఖ్యంగా ఏ ఐ టెక్నాలజీని ఉపయోగించి త్రిష విజయ్ పెళ్లి చేసుకున్నట్టు ఫోటోలు క్రియేట్ చేశారు. అయితే ఈ ఫోటోలకి త్రిష తల్లి లైక్ కొట్టడంతో ఆ రూమర్స్ మరింత బలమయ్యాయి. పైగా ఎలక్షన్స్ రిజల్ట్ వెలువడిన తర్వాత త్రిష – విజయ్ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఎలక్షన్స్ టైంలో కనీసం ఇప్పటికైనా విజయ్ స్పందించి రూమర్స్ కి చెక్ పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Related News

ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్.. లోపం ఉంటేనే స్టోరీ సక్సెస్ అవుతుందా.. మరి అఖిల్ సంగతేంటి?

యూట్యూబ్లో హీట్ పుట్టిస్తున్న ‘తబాహీ’.. ఈ బోల్డ్ పర్ఫార్మెన్స్ ఏంటి యష్!

పవన్ కళ్యాణ్ చిన్నారి అభిమాని నిరంజన్ మృతి!

కన్నప్ప బ్యూటీ బాగా బిజీ.. మరీ ఈ క్రేజ్ ఏంటి గురూ!

వేధించేవాడు.. అహంకారపు మాటలు భరించలేకపోయా.. అంజలి షాకింగ్ కామెంట్!

బ్యాన్ చేసినా బలుపు తగ్గలేదు. ప్రకాష్ రాజ్ తీరుపై మరో నటుడు షాకింగ్ కామెంట్!

Upcoming Movies in Theater : ఈ వారంలో థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు ఇవే..డోంట్ మిస్..

Venuswamy : ఎన్టీఆర్ నుంచి రాజమౌళి వరకు.. సెలబ్రిటీల జోస్యం చెప్పిన వేణుస్వామి..

Big Stories

Advertisement
×