E-Paper
Advertisement

Ilaiyaraaja Live Hyderabad: హైదరాబాద్‌లో ‘మ్యాస్ట్రో’ మేనియా: గచ్చిబౌలిని ఊపేయనున్న ఇళయరాజా లైవ్ కాన్సర్ట్!

Ilaiyaraaja Live Hyderabad: హైదరాబాద్‌లో ‘మ్యాస్ట్రో’ మేనియా: గచ్చిబౌలిని ఊపేయనున్న ఇళయరాజా లైవ్ కాన్సర్ట్!
Advertisement

Ilaiyaraaja Live Hyderabad: హైదరాబాద్ ఇప్పుడు ఒక అద్భుతమైన మ్యూజికల్ నైట్‌కు రెడీ అవుతుంది. అవును .. ఇండియన్ సినిమా సంగీత శిఖరం మ్యాస్ట్రో ఇళయరాజా తన 50 ఏళ్ల సుదీర్ఘ సంగీత ప్రస్థానాన్ని ,పురస్కరించుకుని ఈరోజు (మార్చి 28, శనివారం) గచ్చిబౌలి స్టేడియంలో భారీ లైవ్ కాన్సర్ట్‌ను నిర్వహిస్తుండటం విశేషం.జోరా వరల్డ్ (Zora World) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మ్యూజికల్ నైట్‌ అటు టాలీవుడ్‌లోనూ, ఇటు మ్యూజిక్ లవర్స్ లోనూ హాట్ టాపిక్‌గా మారింది.

గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం

Advertisement

ఇక తాజాగా ఈ క్రేజీ ఈవెంట్ కి సంబంధించి గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇళయరాజా స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మ్యాస్ట్రో మాట్లాడుతూ తన ఇన్నేళ్ల ప్రయాణంలో తనకు అండగా నిలిచిన అభిమానుల కోసం, తన మధురమైన గీతాలతో నేరుగా అలరించబోతున్నట్లు చెప్పుకొచ్చారు.ఇన్ని రోజులు ఇళయరాజా పాటలని వింటూ, సినిమాల్లో చూస్తూ ఎంటర్ టైన్ అయిన ఆడియన్స్ ఇపుడు ఆయన సంగీతంలో ఉండే ఆ ఆత్మను (Soul) నేరుగా అనుభూతి చెందే అవకాశం దక్కడంతో ఎంతో ఉత్సాహంగా ఉన్నారు .

also read:Harish Shankar: పవర్ స్టార్‌ని ముంచేసి.. ఇప్పుడు మెగాస్టార్‌పై పడ్డ హరీష్

Advertisement

ఇక ఈ భారీ ఈవెంట్‌ను చాలా ప్రేస్టేజియస్ గా నిర్వహిస్తోంది జోరా వరల్డ్ టీమ్. ఇక ఈ విలేకరుల సమావేశంలో ఇళయరాజాతో పాటు నిర్వాహకులు సంజయ్ కుమార్ రెడ్డి, వినయ్ కుమార్ రెడ్డి మరియు మోహిత్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ స్టేడియం మొత్తాన్ని ఒక సంగీత సామ్రాజ్యంలా తీర్చిదిద్దినట్లు, మౌలిక వసతుల నుంచి సౌండ్ సిస్టమ్ వరకు ఇంటర్నేషనల్ స్టాండర్స్ తో ఏర్పాటు తెలిపారు.

ఈరోజు రాత్రి ఇళయరాజా స్వయంగా

ఇళయరాజా అంటే కేవలం ఒక పేరు కాదు.. అది ఏంతో మందికి అదొక ఎమోషన్. 50 ఏళ్ల కాలంలో ఆయన అందించిన వేల కొద్దీ పాటలు ఇప్పటికీ ఎంతోమందికి ఊరటనిస్తున్నాయి కూడా. ఇక ఈరోజు రాత్రి గచ్చిబౌలి స్టేడియంలో ఆయన స్వయంగా వేదికపై నుంచి పాటలు పాడుతుంటే, ఆ కిక్కే వేరుగా ఉంటుందనడంలో సందేహమే లేదు.మెలోడీ కింగ్ తన క్లాసిక్ హిట్స్‌తో పాటు ఫ్యాన్స్‌కు ఇష్టమైన పాటలతో మ్యాజిక్ చేయబోతుండటంతో చూసేందుకు రెడీ అయిపోతున్నారు మ్యాస్ట్రో ఫ్యాన్స్.

ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడైపోయిన టికెట్లు 

ఇక శనివారం (మార్చి 28)న జరగబోయే ఈ కాన్సర్ట్ కోసం ఇప్పటికే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయినట్టు తెలుస్తుంది.మరో వైపు సోషల్ మీడియాలో “Ilayaraja Live in Hyderabad” అనే హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి కూడా.ఇక సంగీత దిగ్గజం ఇళయరాజాని ఇక్కడ చూడటం ఒక లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అని  పోస్ట్లు పెడుతున్నారు ఫ్యాన్స్.

మొత్తానికి, ఈ శనివారం (మార్చి 28)రాత్రి గచ్చిబౌలి స్టేడియం సంగీత ప్రియుల కేరింతలతో, ఇళయరాజా గారి మెలోడీలతో మార్మోగిపోనుందన్న మాట.

also read:Dhurandhar 2 controversy: ‘ధురంధర్ 2’ రికార్డులపై ఒవైసీ హైదరాబాదీ పంచ్!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×