E-Paper
Advertisement

నమ్మించి ముంచాడు.. 30 మంది కస్టమర్లకు చుక్కలు చూపించిన గ్యాస్ డెలివరీ బాయ్

నమ్మించి ముంచాడు.. 30 మంది కస్టమర్లకు చుక్కలు చూపించిన గ్యాస్ డెలివరీ బాయ్
Advertisement

Vishakhapatnam: విశాఖపట్నం నగరం గాజువాక పరిధిలో ఒక డెలివరీ బాయ్ చేసిన పని ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది. చిన్నగంట్యాడ ప్రాంతంలోని ఒక గ్యాస్ ఏజెన్సీలో అప్పారావు అనే వ్యక్తి డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. వినియోగదారులకు సకాలంలో సిలిండర్లు సరఫరా చేయాల్సిన అతడు, అందరినీ బురిడీ కొట్టించి ఏకంగా 30 గ్యాస్ సిలిండర్లతో ఉడాయించాడు.

డెలివరీ బాయ్ అప్పారావు తన ప్లాన్‌ను చాలా తెలివిగా అమలు చేశాడు. సాధారణంగా గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే సమయంలో వినియోగదారుల ఫోన్‌కు వచ్చే ఓటీపీని ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అయితే, అప్పారావు కస్టమర్ల దగ్గరకు వెళ్లి ‘సిలిండర్ బండిలో ఉంది, ఇప్పుడే తెస్తాను’ అని నమ్మబలికి, వారి మొబైల్స్‌కు వచ్చిన ఓటీపీలను ముందుగానే సేకరించాడు. ఇలా సుమారు 30 మంది వినియోగదారుల నుంచి వివరాలు సేకరించి, రికార్డుల్లో డెలివరీ పూర్తయినట్లు చూపించాడు.

Advertisement

కస్టమర్లకు ఓటీపీలు చెప్పినా సిలిండర్లు అందకపోవడంతో వారు ఏజెన్సీని నిలదీశారు. స్టాక్ తనిఖీ చేసిన ఏజెన్సీ నిర్వాహకులు, అప్పారావు 30 నిండు సిలిండర్లతో సహా కనిపించకుండా పోయినట్లు గుర్తించారు. దీనిపై సదరు గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు ఆ సిలిండర్లను ఎక్కడైనా విక్రయించాడా లేక దాచిపెట్టాడా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నమ్మకంగా పనిచేయాల్సిన వ్యక్తే ఇలా మోసానికి పాల్పడటంతో ఏజెన్సీ నిర్వాహకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Also Read: మానవత్వం చాటుకున్న భువనగిరి ఎంపీ.. కంటిచూపు కోల్పోయిన చిన్నారికి కొండంత అండ

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×