Shoaib akhtar On Vaibhav: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో మరోసారి వైభవ్ సూర్య వంశీ ( vaibhav suryavanshi) పేరు మారుమోగుతోంది. కిందటి ఏడాది సెంచరీ చేసి ఇరగదీసిన వైభవ్, ఈ సారి బుమ్రా బౌలింగ్ లో సిక్సర్లు కొట్టి చరిత్ర సృష్టించాడు. దీంతో నిన్నటి నుంచి వైభవ్ సూర్యవంశీ గురించి సోషల్ మీడియాలో పేరు మారుమోగుతోంది. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ, బుమ్రా పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ ( Shoaib akhtar ). వైభవ్ సూర్యవంశీ ఇచ్చిన ట్రీట్మెంట్ కు.. బుమ్రా ( Jasprit Bumrah) దిమ్మ తిరిగిపోయిందని బాంబు పేల్చారు. ఇక బౌలింగ్ కు బుమ్రా పనికిరాడు అని, అతడు రిటైర్మెంట్ తీసుకోవాల్సిందేనని చురకలు అంటించారు షోయబ్ అక్తర్.
Also Read: Inzamam-ul-Haq: కేకేఆర్, పంజాబ్ మ్యాచ్ రద్దు వెనుక కుట్రలు…క్లౌడ్ బరస్ట్ క్రియేట్ చేశారంటూ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( Rajasthan Royals vs Mumbai Indians ) మధ్య నిన్న ఫైట్ జరిగిన సంగతి తెలిసిందే. 11 ఓవర్ల ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ అద్భుతమైన బ్యాటింగ్ తో ఇరగదీసింది. ముఖ్యంగా 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కేవలం 14 బంతుల్లో 39 పరుగులు సాధించాడు. అటు యశస్వి జైస్వాల్ 32 బంతుల్లో 77 పరుగులు చేశాడు. బుమ్రా బౌలింగ్ లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ రెండు సిక్సర్లు కొట్టి చరిత్ర సృష్టించాడు. దీంతో బుమ్రాను ఉద్దేశించి దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు జనాలు.
అయితే ఇదే అంశంపై తాజాగా పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ స్పందించారు. ఓ 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ సూర్య వంశీ అత్యంత భయంకరంగా బ్యాటింగ్ చేశాడని ప్రశంసించారు. బుమ్రా బౌలింగ్ లో ఇలా బ్యాటింగ్ చేయడానికి ధైర్యం ఉండాలని.. అది వైభవ్ సూర్యవంశంకి 100కు 100% ఉందని వెల్లడించారు. అందుకే ఇంత ప్రమాదకరంగా బ్యాటింగ్ చేశాడని స్పష్టం చేశారు. అయితే 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని ఔట్ చేయ లేకపోయిన బుమ్రా దారుణంగా విఫలమయ్యాడని పరువు తీశారు. బూమ్రా బౌలింగ్ లో పదును పోయిందని.. ఇక అతడు రిటైర్మెంట్ ఇస్తే బెటర్ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమిపాలైన నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబై ఇండియన్స్ బౌలర్ల కారణంగానే తాము ఓడిపోయామని వెల్లడించారు. బుమ్రా నేతృత్వంలోని బౌలింగ్ విభాగం సరిగ్గా పనిచేయలేదని విమర్శలు చేశారు. కొన్ని బంతులు పరుగులు ఇవ్వకుండా కట్టడి చేసి ఉంటే మ్యాచ్ గెలిచే వాళ్ళమని పేర్కొన్నారు హార్దిక్ పాండ్యా పాండ్యా.
Also Read: Farhan – Smith: సింగిల్ తీయకుండా స్మిత్ ను అవమానించిన ఫర్హాన్..బాబర్ పగను తీర్చుకున్నాడుగా