E-Paper
Advertisement

Podarillu : ‘పొదరిల్లు’ మేకింగ్ వీడియో.. మహా అల్లరికి దండం పెట్టాల్సిందే..రచ్చ రచ్చే..

Podarillu : ‘పొదరిల్లు’ మేకింగ్ వీడియో.. మహా అల్లరికి దండం పెట్టాల్సిందే..రచ్చ రచ్చే..
Advertisement

Podarillu : ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న లేటెస్ట్ సీరియల్ ‘పొదరిల్లు’.. గత ఏడాది డిసెంబర్ 22న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సీరియల్ ఒక్కో రోజు ఒక్కో ట్విస్టుతో అందరిని ఆకట్టుకుంటూ వస్తుంది.. ఐదుగురు మగాళ్లున్న ఒక ఇంటికి ఒక ఆడపిల్ల కోడలిగా వెళ్తే ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ఆ సీరియల్ స్టోరీ. అందులోని హీరోయిన్ ఆడపిల్ల పాత్రలో నటించిన ముద్దుగుమ్మ మహాలక్ష్మి అలియాస్ కృతిక ఉమాశంకర్.. కన్నడ నటి అయిన ఈమె తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.. తన సహజమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది.. ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. లేటెస్ట్ ఫోటోలతో పాటుగా షూటింగుకు సంబంధించిన కొన్ని వీడియోలను కూడా షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో వీడియోని షేర్ చేసింది.. షూటింగ్ లొకేషన్లో ఎలా ఉంటారు అన్నది అందులో కనిపిస్తుంది. ఆ వీడియో చూడడానికి ఫన్నీగా ఉండడంతో నెటిజన్లు కూడా ఫన్నీ రియాక్షన్ ఇస్తున్నారు. ఆ వీడియో ఎలా ఉందో ఒకసారి మనం కూడా చూసేద్దాం..

పొదరిల్లు మేకింగ్ వీడియో వైరల్..

‘పొదిరిల్లు’ సీరియల్ హీరోయిన్ కృతిక ఉమాశంకర్ షూటింగ్ కు సంబంధించిన ప్రతి అప్డేట్ ని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ వస్తుంది.. ఆమె షేర్ చేసే వీడియోలకు నెట్టింట మంచి డిమాండ్ కూడా ఉంది.. తాజాగా ఆమె మరో వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. షూటింగ్ లోకేషన్ లో షాట్లు ఎలా ఉన్నాయి అన్నది ఆ వీడియోలో కనిపిస్తుంది. అందులో నలుగురు యువకులు తో పాటుగా మహాలక్ష్మి చేసిన డ్యాన్స్ స్టెప్పులు బాగా వైరల్ అయ్యాయి.. అంతేకాదు అక్కడున్న సీరియల్ యూనిట్ అందరూ కలిసి స్టెప్ వేయడం హైలెట్గా నిలిచింది.. ఇంతకీ ఆ వీడియో ఎంత ఫన్నీగా ఉందో మీరు కూడా ఇక్కడ ఒకసారి చూసేయండి..

Advertisement

Also Read :స్టేజిపైనే ఏడ్చేసిన నయన్.. కన్నీళ్లు పెట్టుకున్న భర్త.. వీడియో వైరల్..

ప్రస్తుతం స్టోరీ విషయానికొస్తే.. 

ప్రస్తుతం పొదరిల్లు సీరియల్ స్టోరీ విషయానికి వస్తే.. తన అత్త కూతురు అయిన గాయత్రిని మాధవ్ గాఢంగా ప్రేమించి ఉంటాడు. తన అత్త కారణంగా వాళ్ళిద్దరి మధ్య దూరం పెరుగుతుంది.. ఒక్కమాటలో చెప్పాలంటే వాళ్ళ అత్త పంతానికి పోయి ప్రేమికులను విడగొడుతుంది. తన కూతురికి గొప్పింటి సంబంధం చేయాలని కలలు కంటుంది. కానీ మాధవ్ మాత్రం తన మరదలని మర్చిపోలేక వేరే అమ్మాయిని తన జీవితంలోకి రానివ్వలేక బాధపడిపోతూ ఉంటాడు. ఇటీవల వెళ్ళిన ఓ పెళ్లి చూపుల్లో అమ్మాయితో మాట్లాడడం ఇష్టం లేనట్లు ఉంటాడు. అధి కాస్త క్యాన్సిల్ అవుతుంది. అయితే మహాలక్ష్మి గాయత్రీ ని ధైర్యం చేసి బయటకు రమ్మని చెప్తుంది.. మాధవ్ గాయత్రీలకు పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతుంది. మరి రేపటి ఎపిసోడ్ లో వీరిద్దరి పెళ్లి మహాలక్ష్మి దగ్గరుండి చేస్తుందా? తాయారు వీళ్ళ పెళ్లికి అడ్డుపడుతుందా అన్నది చూడాలి..

Advertisement

?igsh=eTdhdWg5Z2o2eTQ2

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×