Ram Charan: తెలుగు చిత్ర పరిశ్రమలో సుకుమార్, రామ్ చరణ్‌ల కాంబినేషన్‌కు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వీరిద్దరూ కలిసి చేసిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడమే కాకుండా, చరణ్‌లోని అసలైన నటుడిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఇప్పుడు వీరిద్దరూ తమ 17వ చిత్రం (RC17) కోసం సిద్ధమవుతుండటంతో మెగా అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది.
Read also-Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాకు ప్రభాస్ హీరోయిన్.. రెండో సినిమాకే?
తాజా సమాచారం ప్రకారం, రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా మార్చి 27న RC17 మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ లేదా ఒక చిన్న గ్లింప్స్ విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా గురించి కేవలం అధికారిక ప్రకటన మాత్రమే వచ్చింది. ఈ గ్లింప్స్ ద్వారా సినిమా థీమ్ ఏంటి? చరణ్ లుక్ ఎలా ఉండబోతోంది? అనే విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
సాధారణంగా సుకుమార్ తన సినిమాల్లో హీరోలను చాలా రా (Raw) గా చూపిస్తుంటారు. అయితే, RC17 విషయంలో ఆయన రూట్ మార్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చరణ్ చాలా స్టైలిష్‌గా, మోడ్రన్ అవతార్‌లో కనిపించనున్నారట. ‘RRR’ తర్వాత చరణ్‌కు వచ్చిన అంతర్జాతీయ గుర్తింపును దృష్టిలో ఉంచుకుని, ఈ సినిమాను పాన్-వరల్డ్ స్థాయిలో రూపొందిస్తున్నట్లు టాక్. ఈ కథలో సగానికి పైగా షూటింగ్ విదేశాల్లో జరగనుందని, హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఇది ఉండబోతుందని సమాచారం.
ఈ భారీ ప్రాజెక్టును టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ (DSP) ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. వీరి ముగ్గురి కాంబినేషన్ అంటేనే మ్యూజికల్ హిట్‌కు గ్యారెంటీ అని అభిమానులు నమ్ముతున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ (Peddi) అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ 2026 మార్చి నాటికి పూర్తి కానుంది. ‘పెద్ది’ పూర్తయిన వెంటనే, అంటే 2026 మే లేదా జూన్ నెలలో RC17 సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం క్లాసిక్ హిట్ సాధించడంతో మరో సారి అలాంటి హిట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా గురంచి మరిన్ని విషయాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.