E-Paper
Advertisement

టాలీవుడ్ బిగ్గెస్ట్ మిస్టరీ.. బాలయ్య, శ్రీదేవి కాంబినేషన్లో ఆగిన ‘మెగా’ ప్రాజెక్ట్ వెనుక అసలు కథ ఇదే!

టాలీవుడ్ బిగ్గెస్ట్ మిస్టరీ.. బాలయ్య, శ్రీదేవి కాంబినేషన్లో ఆగిన ‘మెగా’ ప్రాజెక్ట్ వెనుక అసలు కథ ఇదే!
Advertisement

Balakrishna Sridevi :తెలుగు సినీ హిస్టరీలో కొన్ని కాంబోలు సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ క్రియేట్ చేస్తాయి. మరికొన్ని కాంబినేషన్లు అనౌన్స్మెంట్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తాయ్. అలాంటి ఒక క్రేజీ కాంబినేషన్ నందమూరి బాలకృష్ణ మరియు శ్రీదేవి. వినడానికే చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది కద! కానీ, దురదృష్టవశాత్తూ ఈ భారీ చిత్రం సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోయింది. ఇంతకీ అసలు 1991లో ఏం జరిగింది? చూసేద్దామా !

శ్రీదేవి బాలయ్యతో ఎప్పుడు నటిస్తుందా

Advertisement

ఎన్టీఆర్ – శ్రీదేవి …ఈ కాంబినేషన్ కి ఎంత క్రేజ్ ఉండేదో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. నిజానికి బడిపంతులు’లో ఎన్టీఆర్‌కు మనవరాలిగా నటించిన చిన్నారి శ్రీదేవితో హీరోగా చేయనని మొండికేశాడట రామారావ్. కాని పట్టుబట్టి వేటగాడు తో ఆ కాంబినేషన్ కి శ్రీకారం చుట్టాడు రాఘవేంద్రరావ్. ఇక ఆ తర్వాత కొండవీటి సింహం’, ‘జస్టిస్ చౌదరి వంటి ఎన్నో సినిమాలతో బాక్సాఫీస్ ని ఈ జోడీ ఎలా షేక్ చేసిందో తెలిసిందే.అయితే  రామారావ్ తో సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన శ్రీదేవి బాలయ్యతో ఎప్పుడు నటిస్తుందా అంటూ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారు అభిమానులు. ఎట్టకేలకి ఆ ఎదురుచూపులకు 1991 జనవరిలో తెరపడింది.

also read: జాన్వీ కపూర్ గ్లామర్ డోస్.. హద్దులు దాటుతున్న శ్రీదేవి తనయ! ఆ డ్రెస్ ఏంటి బాబోయ్?

Advertisement

రాఘవేంద్రరావు దర్శకత్వంలో.. అశ్వినీదత్ భారీ ప్లాన్!

1990లో చిరంజీవి, శ్రీదేవి జంటగా ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ లాంటి విజువల్ వండర్‌ను నిర్మించిన వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్, బాలయ్యతో కూడా అదే స్థాయి ప్రాజెక్ట్ ప్లాన్ చేశారు. దర్శకుడు మరెవరో కాదు.. బాలయ్య బాడీ లాంగ్వేజ్ తెలిసిన రాఘవేంద్రరావు. 1991 మే నెలలో స్విట్జర్లాండ్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని అప్పట్లో వార్తలు తెగ సర్కులేట్ అయ్యాయ్.
ఇక అప్పట్లోనే ఫోర్ ట్రాక్ స్టీరియో దీనికి వాడబోతున్నారని, ఈ సినిమాకి మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ . లెజెండరీ సినిమాటోగ్రాఫర్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ  అందించబోతున్నారని, ఇక సినిమా టెక్నికల్‌గా అప్పట్లోనే హాలీవుడ్ రేంజ్‌లో ఈ సినిమా ఉండబోతోందని ..ఇలా ఇబ్బడి ముబ్బడిగా వార్తలు  అప్పటి న్యూస్ పేపర్లలో ప్రముఖంగా రావడంతో మురిసిపోయారు నందమూరి అభిమానులు.
అన్నింటి కన్నా ముఖ్యంగా బాలయ్య, శ్రీదేవి కాంబినేషన్ కాబట్టి ఒక వెరైటీ కథను సిద్ధం చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించడం తో ఇక సినిమా ఫిక్స్ అనుకున్నారంతా ..

అసలు ఏమైంది? ఎందుకు ఆగిపోయింది?

అయితే అంత భారీగా అనౌన్స్ చేసిన ఈ సినిమా ఎందుకు సెట్స్ పైకి వెళ్ళలేదన్నది ఇప్పటికీ టాలీవుడ్ లో ఒక మిస్టరీనే. 1991 మే నెలలో మొదలు కావాల్సిన సినిమా నుంచి ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ రాలేదు.అయితే ఆ సమయంలో శ్రీదేవి బాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌గా బిజీగా ఉండటంతో డేట్స్ అడ్జస్ట్మెంట్ చేయలేకపోయిందని, దానికి తోడు బాలయ్య-శ్రీదేవి ఇమేజ్‌కు తగ్గట్టుగా కథ సరిగ్గా కుదరలేదని ఫిలిమ్ సర్కిల్స్ లో వినిపించే టాక్.

బాలయ్య, శ్రీదేవి కాంబోలో ఆ సినిమా గనుక వచ్చి ఉంటే

అలా ఈ కాంబినేషన్‌లో రావాల్సిన సినిమా మొత్తానికి అటకెక్కింది. అయితే ఇదే బాలయ్య – రాఘవేంద్రరావు – అశ్వినీదత్ కాంబోలో అశ్వమేధం’ సినిమా వచ్చింది. కానీ అందులో శ్రీదేవి స్థానంలో నగ్మా కథానాయికగా నటించడం గమనార్హం.ఒకవేళ బాలయ్య, శ్రీదేవి కాంబోలో ఆ సినిమా గనుక వచ్చి ఉంటే.. అప్పట్లోనే సౌత్ ఇండియాలో అన్ని రికార్డులు తిరగరాసేది అనడంలో ఎలాంటి డౌటే లేదు. ఏది ఏమైనా అందగాడు బాలయ్య, అతిలోక సుందరి శ్రీదేవి కనీసం ఒక్క సినిమా కూడా కలిసి చేయకపోవడం నందమూరి అభిమానులకి లోటని చెప్పక్క తప్పదు.

also read :బాక్సాఫీస్ వద్ద ‘జానీ’ సునామీకి 23 ఏళ్లు.. ఒక డిజాస్టర్ ఎలా ‘కల్ట్ క్లాసిక్’గా మారిందో తెలుసా?

 

Related News

స్మోకింగ్ చేస్తోన్న నయనతార.. మార్పుకు కారణం?

కూతురు టాలీవుడ్ ఎంట్రీపై రవీనా టాండన్ ఏమన్నారంటే?

వారి టార్చర్ వల్లే వదిలేసా -ఐశ్వర్య లక్ష్మీ

యష్ ‘టాక్సిక్’ కథ లీక్..ఆ సెంటిమెంట్ వింటే మైండ్ పోవాల్సిందే!

బాలయ్యకు గాయం.. NBK 111 రిలీజ్ డౌటేనా? కొరటాల ప్రాజెక్ట్‌పై పడ్డ ఎఫెక్ట్!

రీతూ వర్మ – వైష్ణవ్ తేజ్ మధ్య బ్రేకప్?

జయకృష్ణ సీక్రెట్ లీక్ చేసిన రషా.. ‘శ్రీనివాస మంగాపురం’ సెట్స్‌లో ఏం జరిగిందంటే?

మరో కొత్త సినిమాతో ‘లెనిన్ ‘డైరెక్టర్.. ఒక హిట్.. క్రేజీ హీరోతో ఛాన్స్!

Big Stories

Advertisement
×