Kohli VS Babar: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ విజేతగా బాబర్ ఆజం కెప్టెన్ గా వ్యవహరించిన పెషావర్ జల్మీ జట్టు నిలిచిన సంగతి తెలిసిందే. జట్టు బాధ్యతలను భుజాలపైన వేసుకొని, ఫైనల్స్ లో గెలిపించాడు బాబర్ ఆజం. ఈ టోర్నమెంట్లో రెండు సెంచరీలతో పాటు కీలకమైన సమయాలలో రాణించాడు. రెండు సంవత్సరాలుగా పాకిస్తాన్ జట్టులో స్థానం లేక ఆగమైపోయిన బాబర్ ఆజం, మంచి ఫామ్ లో ఉన్నాడు. దాని ఫలితమే పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ గెలవడం. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ వర్సెస్ బాబర్ ఆజం ఇద్దరిలో ఎవరు రియల్ కింగ్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది.
విరాట్ కోహ్లీ చాలా సీనియర్ ప్లేయర్. టీమిడియా తరఫున ఎన్నో మంచి ఇన్నింగ్స్ లు జట్టును గెలిపించాడు. వన్డేలలో 54 సెంచరీలు నమోదు చేశాడు. టెస్టుల్లో 30 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ టీ20 లో ఒకే ఒక్క సెంచరీ చేయడం గమనార్హం. కెప్టెన్ గా టీమిండియా కు ఐసీసీ ట్రోఫీ తీసుకురానప్పటికీ.. జట్టు తరఫున మాత్రం అద్భుతంగా ఆడాడు. వేలాది పరుగులు చేసి టీమిండియాను కాపాడాడు. ఐసీసీ టోర్నమెంట్లలో భాగంగా పాకిస్తాన్ తో ఏ మ్యాచ్ జరిగినా, విరాట్ కోహ్లీ దగ్గరుండి మ్యాచ్ గెలిపించేవాడు. అందుకే ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ అంటూ విరాట్ కోహ్లీని మెచ్చుకుంటారు. అయితే ఇక్కడ విరాట్ కోహ్లీ నెగిటివ్ ఏంటంటే.. బెంగుళూరు జట్టును ఇప్పటివరకు అతడు ఛాంపియన్ చేయలేకపోయాడు. దాదాపు పది సంవత్సరాలపాటు కెప్టెన్ గా ఉన్నప్పటికీ RCB జట్టును విజయతీరాలకు చేర్చడంలో విఫలమయ్యాడు. కానీ అతడు సాధారణ ప్లేయర్ గా ఉన్నప్పుడు రజత్ పటిదార్ కెప్టెన్సీలో మాత్రం బెంగళూరుకు టైటిల్ వచ్చింది. అలాగే టి20లో విరాట్ కోహ్లీ కాస్త స్లోగా బ్యాటింగ్ చేస్తాడు అన్నది వాస్తవం. ఇది తప్పితే విరాట్ కోహ్లీ దగ్గర నెగిటివ్ అనే అంశమే లేదు. 2027 వన్డే వరల్డ్ కప్ సమయంలో టీమిండియా తరఫున ఆడి ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు.
ఇక బాబర్ విషయానికి వస్తే.. ఇతని వయస్సు చాలా చిన్నది. అయినప్పటికీ ఇప్పటికే వన్డేల్లో 20 సెంచరీలు నమోదు చేసిన బాబర్ ఆజం, టెస్టుల్లో తొమ్మిది సెంచరీలు చేశాడు. కానీ టి20 లో మాత్రం విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ సెంచరీలు నమోదు చేశాడు. ఇప్పటివరకు టి20 లో మూడు సెంచరీలు నమోదు చేశాడు బాబర్. అలాగే విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ మ్యాచులు టి20 లో ఆడాడు. టి20 లలో 4188 పరుగులు విరాట్ కోహ్లీ చేస్తే.. బాబర్ 4596 పరుగులు సాధించాడు. యావరేజ్ లో చూసినా కూడా విరాట్ కోహ్లీ కంటే బాబర్ అన్ని రంగాల్లోనూ తక్కువగానే ఉన్నాడు. వన్డేలు, టెస్టులు అలాగే టి20 లలో విరాట్ కోహ్లీ కంటే బ్యాటింగ్ ఆవరేజ్ బాబర్ ది తక్కువగానే ఉంది. అయితే ఇటీవల విరాట్ కోహ్లీ పేరున ఉన్న ఓ రికార్డును బద్దలు కొట్టాడు బాబర్.
టి20 లలో 50 కి పైగా 40 సార్లు విరాట్ కోహ్లీ పరుగులు సాధించాడు. అంటే 40 అర్థ సెంచరీలు ఉన్నాయన్నమాట. ఈ రికార్డును తాజాగా బాబర్ ఆజం బ్రేక్ చేశాడు. ఇక విరాట్ కోహ్లీ ఇప్పటివరకు టీమిండియా నుంచి తప్పించబడలేదు. కానీ బాబర్ మాత్రం రెండు సంవత్సరాల నుంచి పాకిస్తాన్ జట్టుకు దూరంగానే ఉన్నాడు. పైన పేర్కొన్న లెక్కల ప్రకారం చూస్తే.. ఇప్పటికైతే విరాట్ కోహ్లీ కింగ్ అని చెప్పవచ్చు. క్రీడా విశ్లేషకులు కూడా ఇదే చెబుతున్నారు. అయితే పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా పెషావర్ జల్మీ జట్టును బాబర్ ఒంటి చేత్తో గెలిపించడం చెప్పుకోదగ్గ విషయం. బెంగళూరు ను మాత్రం కోహ్లీ ఛాంపియన్ గా నిలపలేకపోయాడు. ఈ విషయాన్ని పాకిస్తాన్ మాజీలు హైలెట్ చేస్తూ.. బాబర్ తోపు ప్లేయర్ అంటూ ప్రచారం మొదలుపెట్టారు.
Also Read: Tanveer Ahmed: బాబర్ ఒక్క టైటిల్ గెలిస్తే, కోహ్లీ మాత్రం కెప్టెన్సీ కోసం బిచ్చగాడిలా మారాడు Tanveer Ahmed
Putting their cricketing skills aside, one thing that’s really good about Babar is that like Kohli he didn’t faked his emotions for the cameras or to chase PR moments.
He didn’t rush out of the dugout just to grab attention, even in the winning moment he stayed out of the… pic.twitter.com/B2b1X0QpsD
— 𝐀 (@was_abdd) May 4, 2026