E-Paper
Advertisement

Repu Udayam 10 Gantalku: ‘రేపు ఉదయం 10 గంటలకు’.. ఏంటి? అసలు విషయమేంటి?

Repu Udayam 10 Gantalku: ‘రేపు ఉదయం 10 గంటలకు’.. ఏంటి? అసలు విషయమేంటి?
Advertisement

Repu Udayam 10 Gantalku: ‘రేపు ఉదయం 10 గంటలకు’ అనగానే.. రేపు 10 గంటలకు ఏం జరుగుతుందో? అని అనుకుంటున్నారా? నిజమే, ఏదైనా జరగవచ్చు. కానీ, ఇక్కడ మాత్రం ‘రేపు ఉదయం 10 గంటలకు’ అంటే.. ఏదేదో కాదు, ఇదొక సినిమా టైటిల్. అవును, ‘రేపు ఉదయం 10 గంటలకు’ (Repu Udayam 10 Gantalku) టైటిల్‌తో ఇప్పుడో సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల సందర్భంగా.. ఈ టైటిల్ బాగా వైరల్ అవుతోంది. అసలు విషయం ఏమిటంటే.. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలలో కంటెంట్ కొత్తగా ఉంటే.. ఆ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనే విషయం తెలియంది కాదు. ‘ఓ పిట్ట కథ’, ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ సినిమాలకు దర్శకత్వం వహించిన చెందు ముద్దు నుంచి వస్తున్న తాజా సస్పెన్స్‌ థ్రిల్లర్ చిత్రం ‘రేపు ఉదయం 10 గంటలకు’. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో విడుదలకానున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని మార్చి 3, మంగళవారం మేకర్స్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ ఎలా ఉందంటే..

Also Read- Allu Sirish Nainika wedding: అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ .. కనిపించని ముగ్గురు స్టార్స్… ఏం జరిగిందబ్బా?

రెండు గడియారాలు, రెండు సమయాలు!

Advertisement

అభినవ్ గోమటం (Abhinav Gomatam), హెబా పటేల్ (Hebah Patel), చైతన్య రావు, కిరీటి దామరాజు, వాసు ఇంటూరి, సాహితి అవంచ, మోహిత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే.. ఇందులో గడియారాన్ని హైలైట్ చేశారు. టైటిల్ వెనుక ఒక క్లాక్, నటీనటులు అందరి వెనుక మరొక క్లాక్ ఇందులో ఉన్నాయి. టైటిల్ వెనుక గడియారంలో పది గంటలు చూపిస్తే… ఆర్టిస్టుల వెనుక గడియారంలో రెండు గంటల సమయాన్ని చూపిస్తున్నారు. ఈ గడియారాలు, అవి చూపించే సమయాల వెనుక కథ తెలియాలంటే టీజర్, ట్రైలర్ విడుదల వరకు వెయిట్ చేయాల్సిందే అనేలా ఈ పోస్టర్ క్యూరియాసిటీని కలిగిస్తోంది. ఫస్ట్ లుక్‌తో అయితే ఆసక్తిని ఏర్పరచారనే చెప్పుకోవాలి. ఇక ఇందులో ఉన్న కంటెంట్ కూడా క్లిక్ అయితే.. క్లాక్‌కు హిట్‌ పడినట్టే.

Also Read- Laya: ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’లో మంగపతిని డామినేట్ చేశా!

త్వరలోనే టీజర్, రిలీజ్ డేట్

Advertisement

ఈ సినిమాను చెందు ముద్దు (Chendu Muddu) దర్శకత్వంలో రామ్ వీరపనేని నిర్మిస్తున్నారు. త్వరలో థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ పనుల్లో శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే టీజర్‌ను, అలాగే విడుదల తేదీని ప్రకటిస్తామని ఈ సందర్భంగా టీమ్ ప్రకటించింది. ప్రిన్స్ హెన్రీ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సునీల్ కుమార్ నామా సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Also Read- Buchi Babu Sana: ‘రై రై రా రా’ పాట చేస్తున్నప్పుడు చరణ్‌కు ‘హై ఫీవర్’.. అయినా సరే!

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×