E-Paper
Advertisement

Dasoju Sravan: గ్రూప్- 1లో అనేక తప్పులు.. ప్రభుత్వం ఏం చేస్తోంది.. దాసోజు శ్రవణ్ నిలదీత

Dasoju Sravan: గ్రూప్- 1లో అనేక తప్పులు.. ప్రభుత్వం ఏం చేస్తోంది.. దాసోజు శ్రవణ్ నిలదీత
Advertisement

Dasoju Sravan: గ్రూప్ – 1 ఉద్యోగాల్లో అనేక తప్పులు జరిగాయంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం పాలన అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో దాసోజు శ్రవణ్ మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిందని ఆరోపించారు.

ఉస్మానియాలో రెండు రకాల లా కోర్సులు ఉన్నాయని దాసోజ్ శ్రవణ్ గుర్తుచేశారు. ఒకటి ఐదేళ్ల కోర్సు కాగా, ఇంకొకటి మూడేళ్ల హానర్స్ కోర్సు అని చెప్పారు. ఫిబ్రవరి 25న ఐదేళ్ల లా కోర్సు, ఫిబ్రవరి 27న మూడేళ్ల లా కోర్సు పరీక్ష జరిగిందని ఈ రెండు కోర్సులకు ఒకే పేపర్ ప్రశ్నాపత్రంగా ఇచ్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిందనడానికి ఇంత కన్నా నిదర్శనం ఏమి కావాలని నిలదీశారు. ప్రశ్నా పత్రం కూడా సరిగా సెట్ చేయరాని వారు ఏం పాలిస్తారు? అని ప్రశ్నించారు.

Advertisement

బంకర్ బెడ్ల కొనుగోలులో వంద కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. 60 కోట్ల రూపాయలకు రావాల్సిన బంకర్ బెడ్లను 160 కోట్లకు కొనుగోలు చేశారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా మార్చారన్నారు. ఇదొక దోపిడీ ప్రభుత్వం, బాధ్యత రహితమైన ప్రభుత్వం అని మండిపడ్డారు. గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో బ్లాక్ లిస్ట్ లో ఉన్న కంపెనీలకు ఒకేషనల్ విద్యా సంస్థల టెండర్లు కట్టబెడుతున్నారని ఆరోపించారు.

Also Read: Andhra Spicy Mutton Curry: ఆంధ్ర స్టైల్ స్పైసీ మటన్ కర్రీ.. దీన్ని స్టెప్ బై స్టెప్ ఇలా చేసేయండి

Advertisement

గ్రూప్ – 1లోనూ అనేక తప్పులు జరిగాయని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. విద్యా వ్యవస్థ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. తెలంగాణ విద్యా కమిషన్ రిపోర్టు తప్పుల తడకగా ఉందన్నారు. గురుకులాలు, ఫీజు రియంబర్స్ మెంట్ రద్దు చేయాలని విద్యా కమీషన్ సిఫార్సు చేసిందన్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి ఇచ్చిన రూ.1000 కోట్లు ఎక్కడ? అని ప్రశ్నించారు. రూ.10 వేల కోట్ల ఫీజు రియంబర్స్ మెంట్ ను ప్రభుత్వం బాకీ ఉందని, వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

Also Read: EPFO Interest Rate: ఈపీఎఫ్ వడ్డీ రేటులో మార్పుల్లేవ్.. డబ్బులు ఖాతాల్లో జమ ఎప్పుడంటే?

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×