Rashmika Manadanna: టాలీవుడ్ స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈమధ్య బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. రీసెంట్గా ది గర్ల్ ఫ్రెండ్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విషయాన్ని అందుకుంది. ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నా సరే ఈమె సమయం దొరికినప్పుడు ట్రిప్ లకు వెళ్తుంది. అయితే తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించిన ఈమె ముఖానికి మాస్క్ పెట్టుకుంది.. అక్కడున్న కెమెరామెన్లు మాస్క్ తిమ్మని అడిగితే ఫేస్ కి ట్రీట్మెంట్ అయింది సారీ అని చెప్పేస్తుంది. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రష్మికకు ఏమైంది అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అసలు రష్మిక ఫేస్ కి ఏ సర్జరీ చేయించుకుంది అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
యూత్ క్రష్ అంటే రష్మిక మందన్న పేరే వినిపిస్తుంది. ఎప్పుడూ తన అందాన్ని మెరుగుపరచుకోవడానికి జిమ్లలో ఎక్కువగా సమయాన్ని గడుపుతుంది. ఆమె చేసే యోగాసనాలు ఔరా అనిపించాల్సిందే. అలాంటి రష్మిక మదన్న ఫేస్ కి ట్రీట్మెంట్ చేయించుకున్నాను అని అనడంతో ఆమె అభిమానులు టెన్షన్ పడుతున్నారు. అసలు ఇంత అందంగా ఉన్నా రష్మిక ముఖానికి ఏం ట్రీట్మెంట్ చేయించుకుందా అనే ప్రశ్నలు కూడా సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. ఏదైనా గాయాలు అయ్యాయా? లేదా లిప్స్ కి లేదా ముక్కుకి సర్జరీ ఏమైనా చేయించుకుందా? లేదంటే డెంటల్ కేర్ ఏదైనా తీసుకుందా అన్న ప్రశ్నలు నెట్టింట వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే ఈ ప్రశ్నలు అన్నిటికీ సమాధానం దొరకాలంటే కచ్చితంగా ఆమె రెస్పాండ్ అయ్యేవరకు వెయిట్ చెయ్యాల్సిందే..
Also Read:రక్తం అమ్ముకున్న.. ఆ పని చెయ్యలేదని నన్ను టార్గెట్ చేశారు.. కన్నీళ్లు ఆగవు..!
రష్మిక మందన్నకు పుష్ప మూవీ మంచి క్రేజ్ ను అందించింది. నేషనల్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ మూవీ అన్ని ఏరియాలో మంచి టాక్ ని సొంతం చేస్తుంది. బాక్స్ ఆఫీస్ బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన సినిమా కావడంతో ఆమె సీక్వెల్ సినిమాలో కూడా నటించే అవకాశం అందుకుంది. గత ఏడాది ఈ మూవీ పార్ట్ 2 కూడా రిలీజ్ అయ్యి వసూళ్ల సునామీ సృష్టించింది.. బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన యానిమల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఏ మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. రీసెంట్ గా థామా చిత్రంలో నటించింది. ఆ మూవీ రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ ను అందుకుంది. ది గర్ల్ ఫ్రెండ్ అని లేడీ ఓరియంటెడ్ మూవీ లో నటిస్తుంది. ఇక ఈమధ్య టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తో ఎంగేజ్మెంట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుబోతుందేమో చూడాలి..