HBD Aditi Rao Hydari : టాలీవుడ్ హీరోయిన్ అదితి రావు హైదరి పేరు తెలియని వాళ్లు ఉండరు. సమ్మోహనం సినిమాతో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. తెలుగులో పలు సినిమాల్లో నటించిన కూడా ఈమెకు అంత గుర్తింపు రాలేదు కానీ.. రీసెంట్ గా హీరో సిద్ధార్థ ని పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ప్రస్తుతం ఈమె పేరు వినిపిస్తే చాలు ఆటోమేటిగ్గా సిద్ధార్థ పేరు కూడా వినిపిస్తుంది. మహాసముద్రం అనే సినిమాతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరి మనసులు కలిశాయి. కొన్నేళ్లు డేటింగ్ లో ఉన్న ఈ జంట రీసెంట్గా వివాహం బంధం లోకి అడుగుపెట్టారు.. వీరిద్దరూ కలిసి ప్రస్తుతం ముంబైలో నివాసం ఉంటున్నారు. ముంబైలోని అత్యంత లగ్జరీ హౌస్ లో వీరిద్దరు ఉన్నట్లు తెలుస్తుంది. ఆ ఇంటి ప్రత్యేకతల గురించి అదితి తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. నేడు ఈ ముద్దుగుమ్మ బర్త్ డే సందర్బంగా ఆ ఇంటి ప్రత్యేకతల గురించి ఒకసారి తెలుసుకుందాం..
సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాక ఎన్నో ఒడిదుడుగులను ఎదుర్కొని ఇండస్ట్రీలో తమ టాలెంట్ తో ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. బ్లాక్ బస్టర్ చిత్రాలతో బాగానే సంపాదించారు. ఇద్దరూ స్టార్ డం ఉన్న యాక్టర్స్ కావడంతో ఆస్తులు కూడా బాగానే కూడా పెట్టారు. సిద్ధార్థ కు చెన్నైలోనూ హైదరాబాదులను ఖరీదైన ఇల్లులు ఉన్నాయన్న సంగతి అతికొద్ది మందికి మాత్రమే తెలుసు. అలాగే ఆదితికి కూడా హైదరాబాదులో ముంబైలో ఖరీదైన బంగ్లాలు ఉన్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ ముంబైలోనే కాపురం ఉంటున్నారు. ముంబై లోని వెర్సోవాలో ఒక అద్భుతమైన లగ్జరీ అపార్ట్మెంట్ ఉంది. ఈ ఇంటికి సంబంధించిన ఫోటోస్ అదితి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. ఆ ఇంటిని డాల్ హౌస్ నువ్వు చూసి అలానే నిర్మించుకోవాలని అనుకుందట. ఎంతో అద్భుతంగా అందంగా తన ఇంటిని పెట్టుకుంది అదితి.. ఆమెకు వైట్ కలర్ అంటే ఇష్టమని ఇంటిని కూడా తనకు నచ్చిన కలర్ తోనే నింపేసింది. వెలుతురు ఎక్కువగా ఉండటంతో నాకు ఇంట్లో ఉండడం చాలా ఇష్టం అలాగే నా ఫ్రెండ్స్ కూడా ఇంట్లోనే ఉండేందుకు ఇష్టపడతారు అని ఆమె తన ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోని షేర్ చేసింది.. తన తల్లిలాగే ఇంటిని అందంగా పెట్టుకోవడం అంటే తనకిష్టమని ఆ వీడియోలో చెప్పింది. ఇవాళ అదితి బర్త్ డే సందర్బంగా ఆ ఇంటికి సంబందించిన వీడియో వైరల్ అవుతుంది.
ఇల్లు మాత్రమే కాదు ఈ జంట దగ్గర ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. వీరిద్దరికీ కార్ల కలెక్షన్ అంటే పిచ్చి. దాంతోనే తమకు నచ్చిన కార్లని గ్యారేజ్ లో పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వీరి దగ్గర ఉన్న కార్ల విషయానికొస్తే.. ఆడి క్యూ7, బీఎండబ్ల్యూ, రోల్స్ రాయిస్, మెర్సిడెస్-బెంజ్, ఆడి A4 ఉన్నాయి.
Also Read : రష్మికకు ఏం జరిగింది.. ట్రీట్మెంట్ ఎందుకు..? టెన్షన్ లో ఫ్యాన్స్..
ఇక వీరిద్దరి సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నారు. సిద్ధార్థ్ ఒకవైపు సినిమాలు మరోవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తూ వస్తున్నారు. అంతేకాదు ఈమధ్య నిత్యం వార్తల్లో కూడా నిలుస్తున్నాడు. ఇక అదితి కొన్ని ప్రాజెక్టు లకు సైన్ చేసినట్లు టాక్.. సినిమాలు మాత్రమే కాదు అటు సోషల్ మీడియాలో కూడా అదితి హైపర్ ఆక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్ర కారుకు మతి పోగోడుతుంది. నేడు ఆమె పుట్టిన రోజు సందర్భంగా.. మా బిగ్ టీవీ ప్రత్యేక విషెష్ తెలుపుతుంది.. హ్యాపీ బర్త్ డే అదితి..