Sudheer Babu Son in Fauzi: ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో వారసుడు ఇండస్ట్రీకి రాబోతున్నాడు. ఇప్పటికే మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని ‘1 నేనొక్కడినే’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఆయన మేనల్లుడు అశోక్ గల్లా కూడా హీరోగా వచ్చేసాడు. మరోవైపు సుధీర్ బాబు తనయుడు చరిత్ మానస్ కూడా ఎప్పుడో ఆరంగేట్రం చేశాడు. బాల నటుడిగా ఎన్నో చిత్రాల్లో కనిపించి ఆకట్టుకున్నాడు. భలే మగాడివోయ్ మూఈవలో జూనియర్ నానిగా, విన్నర్ సినిమాలో జూనియర్ సాయి దుర్గతేజ్ గా కనిపించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు సుధీర్ బాబు మరో వారసుడి ఎంట్రీకి కూడా త్వరలోనే ఉండబోతోంది.
అది కూడా ప్రభాస్ పాన్ ఇండియా చిత్రంతో. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో ఫౌజీ ఒకటి. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవల ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా టైటిల్‌ని కూడా ప్రకటించారు. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి వంటి బాలీవుడ్ దిగ్గజాలు ఈ చిత్రంలో భాగమయ్యారు. అయితే ఇందులో ఇప్పుడు మహేష్ మేనల్లుడు, సుధీర్ బాబు చిన్న కుమారుడు దర్శన్ ఫౌజీలో నటించబోతున్నట్టు సమాచారం. జూనియర్ ప్రభాస్‌గా దర్శన్ కనిపించబోతున్నాడ. దీనిపై ఫౌజీ టీం నుంచి అధికారిక ప్రకటన లేదు.
కానీ, దాదాపు దర్శన్‌ని ఈ పాత్రకు కన్‌ఫాం అయ్యాడట. లుక్ టెస్ట్ కూడా అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. మరీ దీనిపై క్లారిటీ రావాలంటే మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే. మరోవైపు మహేష్ బాబు నిర్మిస్తున్న గుఢాచారి 2 చిత్రంలోనూ దర్శన్ కీలక పాత్ర చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి ఘట్టమనేని అభిమానులంత ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో వారసుడి వస్తున్నాడంటూ మురిసిపోతున్నారు. కాగా ఇప్పటికే సుధీర్ బాబు పెద్ద కుమార్ చరిత్ మానస్ చైల్డ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు పొందాడు.
Also Read: Bigg Boss 9 Day 50: నామినేషన్స్ ఫైర్.. తనూజ చేసిన పనికి దిమ్మతిరగిందన్న ఇమ్మూ
ప్రస్తుతం టినేజ్ లో ఉన్న చరిత్ అచ్చం మేనమామ మహేష్ ని పోలినట్టు ఉన్నాడంటూ సోషల్ మీడియా మొత్తం అతడి గురించే చర్చ. చరిత్ మ్యానరిజం, స్టైల్ అచ్చం మహేష్ బాబులా ఉండటమే కాదు లుక్ కూడా మేనమామను తలపించేలా ఉంది. దీంతో మనకు జూనియర్ మహేష్ దొరికేశాడంటూ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. ఇక మరోవైపు గౌతమ్ కూడా హీరోగా ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులంత ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా పీరియాడిక్ యాక్షన్ డ్రామా వస్తున్న ఈ చిత్రం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్ ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కన్నడ నటి చేతనా నటి చైత్ర జే ఆచార్ ఓ పాత్రను నటిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా సుధీర్ బాబు ప్రస్తుతం జటాధర మూవీతో బిజీగా ఉన్నాడు. నవంబర్ 7న ఈ సినిమా విడుదల కాబోతోంది.