దట్టమైన పొగమంచు కమ్ముకుంటున్న నేపథ్యంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లే పలు ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సుమారు 3 నెలల పాటు ఈ రైళ్ల సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. సజావుగా కార్యకలాపాలు కొనసాగించేందుకు రైల్వే పలు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ, పొగమంచు సంబంధిత జాప్యాలు, రద్దులు ప్రతి సంవత్సరం ప్రయాణీకులను ఇబ్బంది కలిగిస్తూనే ఉన్నాయి.
రైల్వే ట్రాక్స్ సరిగా కనిపించని నేపథ్యంలో డిసెంబర్ 1, 2025 నుంచి ఫిబ్రవరి 28, 2026 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వాటిలో సహారన్ పూర్-ఢిల్లీ మార్గంలో నడిచే కీలకమైన జలంధర్-ఢిల్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ కూడా ఉంది. ఈ రైలు రాకపోకలను మార్చి 1, 2026 వరకు క్యాన్సిల్ చేస్తున్నట్లు తెలిపింది. సేఫ్టీ గైడ్ లైన్స్ ప్రకారం పలు రైళ్లను రద్దుచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. పొగమంచు కారణంగా అనేక రైళ్లను రద్దు చేయాలనే ఉన్నతాధికారుల సూచనల ప్రకారం ఈ రైళ్లను క్యాన్సిల్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు అసౌకర్యానికి గురికాకుండా చూసుకోవడానికి రైల్వే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
పొగమంచు కారణంగా రద్దు చేసిన రైళ్ల వివరాలను భారతీయ రైల్వే అధికారికంగా ప్రకటించింది. ఈ 16 రైళ్లు 3 నెలల పాటు అందుబాటులో ఉండవని తెలిపింది. ఇంతకీ ఆ రైళ్లు ఏవో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
⦿ 12207 కత్గోడం–జమ్మూ ఎక్స్ ప్రెస్
⦿ 12208 జమ్మూ–కత్గోడం ఎక్స్ ప్రెస్
⦿ 14681 ఢిల్లీ–జలంధర్ సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
⦿14682 జలంధర్–ఢిల్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్
⦿ 12317 అమృత్ సర్–కోల్ కతా అకల్ తఖ్త్ ఎక్స్ ప్రెస్
⦿12318 కోల్‌కతా–అమృత్ సర్ అకల్ తఖ్త్ ఎక్స్ ప్రెస్
⦿ 12357 అమృత్ సర్–కోల్ కతా దుర్గియానా ఎక్స్ ప్రెస్
⦿ 12358 కోల్ కతా–అమృత్ సర్ దుర్గియానా ఎక్స్ ప్రెస్
⦿ 14523 అంబాలా–బరౌని ఎక్స్ ప్రెస్
⦿ 14524 బరౌని–అంబాల ఎక్స్ ప్రెస్
Read Also: సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం, ఇక ఆ నగరాలకు ఈజీగా వెళ్లొచ్చు!
⦿ 14605 జమ్మూ–యోగ నగరి రిషికేశ్ ఎక్స్ ప్రెస్
⦿ 14606 యోగా నగరి రిషికేశ్–జమ్మూ ఎక్స్ ప్రెస్
⦿ 14615 అమృత్ సర్–లాల్ కువాన్ ఎక్స్ ప్రెస్
⦿ 14616 లాల్ కువాన్–అమృత్సర్ ఎక్స్ ప్రెస్
⦿14617 అమృత్ సర్ –పూర్నియా జనసేవా ఎక్స్ ప్రెస్
⦿14618 పూర్నియా– అమృత్ సర్ జనసేవా ఎక్స్ ప్రెస్
చలికాలంలో ఉత్తర భారతదేశం అంతటా పొగమంచు అంతరాయాలు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలోనే ముందస్తు జాగ్రత్తగా ఈ రైళ్లను రద్దు చేస్తూ భారతీయ రైల్వే నిర్ణయం తీసుకుంది.
Read Also: మొంథా ఎఫెక్ట్.. 150కి పైగా రైళ్లు రద్దు, పలు విమాన సర్వీసులు క్యాన్సిల్!