Boyapati Srinu : టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. యాక్షన్ కి మారుపేరు బోయపాటి అనే చెప్పాలి. తెలుగు ఇండస్ట్రీలోని టాలీవుడ్ స్టార్ హీరోలు అందరితో ఆయన సినిమాలను తెరకెక్కించారు. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం నందమూరి హీరో బాలయ్యతో అఖండ 2 సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.. ప్రస్తుతం షూటింగేస్ లో ఉన్న ఈ మూవీ శరవేగంగా అన్ని కార్యక్రమాలను పూర్తిచేసే పనిలో ఉంది. ఉండగా బోయపాటి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. అయినా ఫస్ట్ రెమినేషన్ గురించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది.
హాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలతో బోయపాటి సినిమాలు చేశారు.. రొమాంటిక్ హీరోలను కాస్త యాక్షన్ హీరోలుగా మార్చాడు. ఆయన సినిమాల్లోని పవర్ ఫుల్ డైలాగ్లు జనాలను ఎంతగా ఆకట్టుకుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలకృష్ణతో ఈయన చేసిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హీట్ అయ్యాయి. అయితే ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న బోయపాటి శ్రీను మనం మొదటి సినిమా గురించి అలాగే దానికి తీసుకున్న రెమినేషన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు. ఈయన డైరెక్టర్గా చేసిన సినిమా భద్ర.. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. ఈ మూవీకి డైరెక్టర్ తీసుకున్న రెమ్యూనరేషన్ 40 వేలట. సినిమా అయిపోక ముందే అవసరముంటే ఒక లక్ష అప్పు తీసుకున్నాడట. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాక అదే నిర్మాత పిలిచి ఐదు లక్షలు సరిపోతాయి కదా అని ఇచ్చినట్లు బోయపాటి బయటపెట్టారు. మొదటి సినిమాకే దాదాపు ఆరు లక్షల వరకు బోయపాటి తీసుకున్నాడని తెలుస్తుంది. ఫస్ట్ సినిమాకి అంత తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు అది బోయపాటికే సాధ్యం..
Also Read : రక్తం అమ్ముకున్న.. ఆ పని చెయ్యలేదని నన్ను టార్గెట్ చేశారు.. కన్నీళ్లు ఆగవు..!
మాస్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరితోనూ సినిమాలు చేశారు. అయితే ఒకటి రెండు సినిమాలు ఆయనకు నిరాశను మిగిల్చాయి. ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలు కూడా ప్రేక్షకుల ఆదరణను అందుకోవడంతో పాటుగా భారీ కలెక్షన్లను అందించాయి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల విషయానికొస్తే.. తులసి, సింహ ,లెజెండ్, సరైనోడు, అఖండ వంటి హ్యాట్రిక్ మూవీస్ ఉన్నాయి.. ప్రస్తుతం బాలయ్య తో అఖండ సీక్వెల్ మూవీ అఖండ 2 చేస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 5 న థియేటర్లలోకి వచ్చేస్తుంది. సంక్రాంతి వచ్చేవరకు పెద్ద సినిమాలు లేకపోవడంతో ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని ఈ డేట్ ని లాక్ చేసుకున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి బోయపాటి ప్లాన్ వర్కౌట్ అయ్యి సినిమాకు భారీ వసూళ్లు వస్తాయేమో చూడాలి..