Indian Team: భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్ ని 2-1 తో కోల్పోయిన టీమిండియా.. మరో ఆసక్తికర సిరీస్ కి సిద్ధమైంది. తొలి రెండు వన్డేలలో ఆస్ట్రేలియా గెలుపొందగా.. మూడవ వన్డేలో భారత్ ఘనవిజయం సాధించింది. ఇక భారత్ – ఆస్ట్రేలియా మధ్య అక్టోబర్ 29 నుండి 5 మ్యాచ్ ల టి-20 సిరీస్ ప్రారంభం కాబోతోంది. బుధవారం కాన్ బెర్రా వేదికగా ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోబోతోంది టీమిండియా.
Also Read: BAN vs WI: 100 మీటర్ల సిక్స్ కొట్టాడు.. కానీ అదే బంతికి ఔట్ అయ్యాడు.. ఎలా అంటే
ఈ టి-20 సిరీస్ కి సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలో యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు బరిలోకి దిగనుంది. ఈ టి-20 సిరీస్ లోని అన్ని మ్యాచ్ లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:45 గంటలకు ప్రారంభం అవుతాయి. అదే సమయంలో మధ్యాహ్నం 1:15 గంటలకు అన్ని మ్యాచ్ ల టాస్ వేస్తారు. భారత జట్టులో కీలక ఫాస్ట్ బౌలర్ బుమ్రా ఈ సిరీస్ కి అందుబాటులోకి వచ్చాడు. అలాగే విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి వంటి స్టార్ ఆటగాళ్లు ఈ జట్టులో భాగం కానున్నారు. ఇక స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం నుంచి కోలుకోనందున ఈ సిరీస్ కి అందుబాటులో ఉండడం లేదు.
భారత జట్టు ఇద్దరు స్పెషలిస్ట్ పేసర్లతోపాటు ఓ పేస్ ఆల్రౌండర్ తో బరిలోకి దిగనుందని సమాచారం. ఇక నితీష్ కుమార్ రెడ్డి ఫిట్ అయితే ఈ సిరీస్ లో అతడికి అవకాశం దక్కనుంది. తొడ కండరాల గాయంతో అతడు సిడ్నీలో జరిగిన వన్డేకి దూరమైన విషయం తెలిసిందే. ఒకవేళ నితీష్ అందుబాటులోకి రాకపోతే అతడి స్థానంలో రింకు సింగ్ లేదా వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ 29 నుండి ప్రారంభమయ్యే ఈ సిరీస్ నవంబర్ 8తో ముగుస్తుంది. మొదటి టీ-20 అక్టోబర్ 29న ఆస్ట్రేలియా రాజధాని కాన్ బెర్రా లోని ఓవల్ లో జరుగుతుంది. అయితే ఈ మొదటి టి-20 కోసం టీమిండియా ఆటగాళ్లు ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు.
అక్టోబర్ 29న జరగబోయే మొదటి టీ-20 కోసం టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అయితే ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆస్ట్రేలియా రాజధాని కాన్ బెర్రాలో ఎముకలు కొరికే చలిలో భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ ప్రాక్టీస్ సమయంలో వారు విపరీతమైన చలి వల్ల ఇబ్బందులు పడుతున్న ఓ వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. ప్రాక్టీస్ లో క్యాచ్ లు పట్టిన అనంతరం చలివల్ల వారి చేతులు పగిలిపోతున్నాయి. ఈ విపరీతమైన చలివల్ల ఆటగాళ్లు తరచూ తమ చేతులను రబ్ చేస్తూ కనిపించారు. దీంతో టీమిండియా ప్రాక్టీస్ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
1వ టీ-20 అక్టోబర్ 29 – మనుకా ఓవల్, కాన్‌బెర్రా. 2వ టీ-20 అక్టోబర్ 31 – మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్.
3వ టీ-20 నవంబర్ 2 – బెల్లెరివ్ ఓవల్, హోబార్ట్. 4వ టీ-20 నవంబర్ 6 – బెల్ పిప్పెన్ ఓవల్, గోల్డ్ కోస్ట్.
5వ టీ-20, నవంబర్ 8 – ది గబ్బా, బ్రిస్బేన్.
Also Read: PKL 2025: నేడు తెలుగు టైటాన్స్‌కు చావో రేవో… ఓడితే ఇంటికే
భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (C), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ (wc), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సంజూ శాంసన్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (WK), వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా.
Canberra📍
A chilly evening 🥶, but the fielding intensity remains on point ahead of the T20I series 🔥
🎥 𝐁𝐫𝐚𝐯𝐢𝐧𝐠 𝐭𝐡𝐞 𝐜𝐨𝐥𝐝, ft. #TeamIndia #AUSvIND pic.twitter.com/W4otqJo9pe
— BCCI (@BCCI) October 28, 2025