E-Paper
Advertisement

Sailesh Kolanu: ఇలాగే ఎంతో మంది భుజం తట్టాలి.. నానికి శైలేష్ కొలను స్పెషల్ బర్త్‌డే విశెస్!

Sailesh Kolanu: ఇలాగే ఎంతో మంది భుజం తట్టాలి.. నానికి శైలేష్ కొలను స్పెషల్ బర్త్‌డే విశెస్!
Advertisement

Sailesh Kolanu: నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) పుట్టినరోజును పురస్కరించుకుని సెలబ్రిటీల నుంచి, అలాగే అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం నాని చేస్తున్న మూవీ ‘ది ప్యారడైజ్’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఓ స్పెషల్ నోట్‌ని ఎక్స్‌ వేదికగా విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో నాని అంటే తనకి ఎంత ప్రేమో.. శ్రీకాంత్ ఓదెల తెలిపారు. శ్రీకాంత్ ఓదెలతో పాటు నాని అంటే ఎంతో అభిమానించే మరో దర్శకులలో శైలేష్ కొలను (Sailesh Kolanu) కూడా ఒకరు. ‘హిట్’ సిరీస్ చిత్రాలతో వీరి బాండింగ్ మరింత బలపడిందనే చెప్పాలి. శైలేష్‌కు సక్సెస్ లేకపోయినా నాని పిలిచి మరీ అవకాశం ఇచ్చిన రోజులు ఉన్నాయి. శైలేష్‌తో నాని నిర్మిస్తున్న ‘హిట్’ (Hit) సినిమాల సిరీస్ ఎక్కడ ఆగుతుందో తెలియదు. విశ్వక్ సేన్, అడివి శేష్, నానిలతో మూడు పార్ట్‌లను కంప్లీట్ చేసిన శైలేష్ కొలను.. ‘హిట్ 4’ను కార్తీతో చేయబోతున్నట్లుగా పార్ట్ 3లో క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

Also Read- Auto Ram Prasad: డైరెక్టర్ గా మారనున్న జబర్దస్త్ కమెడియన్.. బుల్లితెరకు గుడ్ బై చెప్పినట్టేనా?

ఇలాగే ఎంతో మంది భుజం తట్టాలి

Advertisement

ఈ క్రమంలో తన నిర్మాత, హీరో అయిన నాని పుట్టినరోజును పురస్కరించుకుని శైలేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ట్వీట్‌లో.. ‘‘2017లో అలా నా భుజం మీద చేయి వేశారు.. నా లైఫ్ ఇలా మారిపోయింది. మీరు ఇలాగే ఎంతో మంది భుజం మీద చెయ్యి వేసి అందరి లైఫ్‌లు మార్చేస్తూ ఉండాలి. అంతటి శక్తి మీకు ఎప్పుడూ ఉండాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తాను. నీ పక్కన ఉంటే సినిమాపై ప్రేమ రోజురోజుకూ పెరుగుతూనే ఉంటుంది. సక్సెస్‌లోనే కాదు ఫెయిల్యూర్‌లో కూడా గ్రోత్ ఎలా వెతుక్కోవాలో నేర్పించి మళ్లీ నిలబెట్టావ్. అందుకు నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాని బ్రో.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు (HBD Nani). గాడ్ బ్లెస్ యు’’ అని శైలేష్ కొలను పేర్కొన్నారు.

Also Read- Rashmika – Vijay: వామ్మో కట్నం కింద రష్మిక అన్ని కోట్లు ఇస్తోందా..ఎస్టేట్ తో పాటూ బోలెడు ఆస్తులు కూడా!

ఎంతో ప్రేమ ఉంటే తప్ప..

Advertisement

నిజంగా ఒక మనిషిపై ఎంతో ప్రేమ ఉంటే తప్ప ఇలాంటి మాటలు రావు. శైలేష్ కొలను హార్ట్‌లో నుంచి వచ్చిన మాటలివని ఆయన ట్వీట్ చూస్తుంటే అర్థమవుతోంది. నిజమే, శైలేష్ డౌన్‌లో ఉన్నప్పుడు కూడా నాని ఎలా అతనని నమ్మారో, అతనిపై ఎంతగా నమ్మకం ఉంచారో అందరికీ తెలిసిందే. ‘హిట్’ సిరీస్ చిత్రాల మధ్యలో వెంకటేష్‌తో శైలేష్ కొలను చేసిన ‘సైంధవ్’ చిత్రం దారుణ పరాజయాన్ని చవిచూసింది. అయినా కూడా శైలేష్‌కు ఛాన్స్ ఇచ్చి, వెనకుండి మరీ హిట్టు వచ్చేలా చేశారు నాని. అందుకే, అది మనసులో ఉంది కాబట్టే.. శైలేష్ ఇలా రియాక్ట్ అయ్యాడంటూ, నాని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. నాని నిజమైన నేచురల్ స్టార్ అని, ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఇంకా ఎందరో ప్రతిభావంతులకు అవకాశం ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Also Read- Sree Vishnu: చిరంజీవికి ఫ్యాన్ కానీ వారెవరు? అంటూనే జర్నలిస్ట్‌కి శ్రీ విష్ణు ఝలక్!

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×