E-Paper
Advertisement

Intermediate Exams 2026: రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు షురూ.. పకడ్బందీ ఏర్పాట్లు చేసిన ఇంటర్మీడియట్ అధికారులు

Intermediate Exams 2026: రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు షురూ.. పకడ్బందీ ఏర్పాట్లు చేసిన ఇంటర్మీడియట్ అధికారులు
Advertisement

Intermediate Exams 2026:  రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: రేపటి నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షల జరగనున్న నేపథ్యంలో అధికారులు నిర్వహణ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంటర్మీడి యట్ వార్షిక పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందు చేరుకోవాలని సూచించారు. ప్రాక్టికల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించిన అధికారులు ఇదే తరహాలో మాల్ ప్రాక్టిసుకు తావులేకుండా ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

నిఘా నీడలో పరీక్ష కేంద్రాలు

విద్యార్థుల హాల్ టికెట్లో పేరు, ఫోటో, సబ్జెక్ట్ వివరాల్లో తప్పులు దొర్లితే ప్రిన్సిపాల్స్ను సంప్ర దించి సవరించుకోవాలని విద్యార్థులకు గతంలో ఇంటర్ బోర్డు అధికారులు సూచించారు. పరీక్షా కేంద్రం ఆవరణ, ప్రశ్నపత్రాలు తెరిచే గదిలో సీసీ కెమెరాలతో ఏర్పాట్లు చేశారు. సీసీ కెమె రాల్లో పరీక్షలు జరుగుతున్న తీరును ఇంటర్ బోర్డు అధికారులు వీక్షించనున్నారు.

Advertisement

Also Read: Asifabad Municipality: చిక్కినట్టే చిక్కి చేజారిపోయిన మున్సిపల్ పీఠం.. బలం ఉన్నా.. ఫలితం సున్నా..!

కట్టుదిట్టమైన చర్యలు

ప్రశ్నపత్రాల లీకేజీకి ఆస్కారం లేకుండా ఇంటర్ బోర్డు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. విద్యార్థులు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఇంటర్ బోర్డు చెబుతోంది. విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ వంటి చర్యలకు పాల్పడితే మూడేళ్లపాటు డిబార్ చేస్తామని హెచ్చరిస్తు న్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెం టర్లు మూసివేసేలా చర్యలు తీసుకోవడంతో పాటు 144 సెక్షన్ విధించనున్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు హాజరయ్యేలా ఆర్టీసీ బస్సులను నడపాలని ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ఓఆర్ ఎస్ ప్యాకెట్లు, మెడికల్ పాయింట్ ఏర్పాటు చేసి సిబ్బంది పరీక్షా కేంద్రాల వద్ద అందుబాటులో ఉండేలా వైద్యాధికారులు చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగం ఆదేశించింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. తాగునీరు, టాయిలెట్స్ తదితర మౌలిక సదుపాయాలు సరైన స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. సిట్టింగ్ స్క్వాడ్ను నియమించి, ఎలాంటి సమ స్యలు తలెత్తకుండా చూడనున్నారు.

మూడు జిల్లాల్లో 379 పరీక్ష కేంద్రాలు

Advertisement

రంగారెడ్డి జిల్లాలో 200 ఇంటర్ పరీక్ష కేంద్రాలున్నాయి. ఇందులో మొదటి సంవత్సరంలో చదివే జనరల్, ఒకేషనల్ విద్యార్థులు 84,301 మంది… ద్వితీయ సంవత్సరంలో జనరల్, ఒకేషనల్ కలిపి 70,171 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. అదే మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు 151 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ఫస్ట్ ఇయర్ జనరల్ విభాగంలో 64,780 మంది విద్యార్థులు ఉండగా.. ఒకేషనల్ కోర్సుకు సంబందించిన విద్యార్థులు 1,368 మంది ఉన్నారు. మొదటి సంవత్సరంలో మొత్తంగా 66,148 మంది పరీక్షలు రాస్తున్నారు. ఇంటర్ సెకండ్ ఇయర్ జనరల్ విభాగంలో 67,792 మంది విద్యార్థులు, ఒకేషనల్ కోర్సులో 1,258 విద్యార్థులు కలిపి మొత్తం 69,050 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వికారాబాద్ జిల్లాలో 28 ఇంటర్ పరీక్ష కేంద్రాలున్నాయి. మొదటి సంవత్సరంలో జనరల్ 6708, ఒకేషనల్ 1686 మంది విద్యార్థుల చొప్పున మొత్తం 8394 మంది పరీక్షలు వ్రాయనున్నారు. ద్వితీయ సంవత్సరంలో జనరల్ 6549, ఒకేషనల్ 1457 మంది చొప్పున 8006 మంది పరీక్షకు హాజరైతున్నట్లు అధికారులు వివరించారు.

Also Read: CM Revanth Reddy: పంచాయితీలు వద్దు.. సామరస్యమే ముద్దు.. దేవాదుల సాక్షిగా సీఎం రేవంత్ సంచలన ట్వీట్

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×