Salman Khan:బిగ్‌బాస్ 20 వేదికగా సల్మాన్ ఖాన్… ప్రెగ్నెన్సీ తర్వాత మహిళల శరీరంలో వచ్చే సహజ మార్పులను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేయడాన్ని తప్పుబట్టారు. కత్రినా పేరును నేరుగా ప్రస్తావించకపోయినా… ఇటీవల ఆమెపై వచ్చిన విమర్శలతో సల్మాన్ కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ప్రెగ్నెంట్ అయిన వారిని ఎందుకు ట్రోల్ చేస్తారు..? ప్రెగ్నెన్సీ తర్వాత ప్రతి ఒక్కరూ కొంత బరువు పెరుగుతారు. మళ్లీ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఫిట్‌గా మారుతారు. ప్రస్తుతం ఆమె తన కుటుంబంతో సమయం గడపాలనుకుంటోందంటూ సల్మాన్ అన్నారు.
శరీరాన్ని చూపిస్తూ ట్రోలర్స్‌కు సవాల్
మహిళలపై బాడీ షేమింగ్ మాత్రమే కాదు.. తనపై జరుగుతున్న ఏజ్ షేమింగ్‌పైనా సల్మాన్ స్పందించారు. తనకు 60 ఏళ్లు అని… జీవితాంతం మైనే ప్యార్ కియాలో కనిపించిన వయస్సులోనే ఉండలేనని అన్నారు. తన షర్ట్ తీసెసి… కెమెరా ముందే మేకప్ తుడుచుకున్నారు. తన శరీరాన్ని చూపిస్తూ ట్రోలర్స్‌కు సవాల్ విసిరారు.
ముందు మిమ్మల్ని మీరు చూసుకోండన్నారు. ఇతరులను ఎగతాళి చేసే ముందు.. ఒక్కసారి తమను తాము చూసుకోవాలని సూచించారు. మహిళలను అసౌకర్యానికి గురిచేసేలా ఫొటోలు తీసే వారిపైనా సల్మాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఆమె శరీరాన్ని కొలిచే హక్కు ఎవరికుంది…?
కత్రినా కైఫ్ బరువుపై వచ్చిన సోషల్ మీడియా కామెంట్లకు సల్మాన్ స్పందించిన తీరు.. ఒక పెద్ద ప్రశ్నను ముందుకు తెచ్చింది. ఒక మహిళ తల్లి అయిన తర్వాత ఆమెను అభినందించాల్సిన సమాజం.. ఆమె శరీరాన్ని కొలిచే హక్కు ఎవరికుంది…? తెరపై కనిపించే రూపం వెనుక కూడా ఒక మనిషి ఉంటాడనే విషయాన్ని గుర్తుచేసేలా సల్మాన్ వ్యాఖ్యలు నిలిచాయి.