Hive Restaurant: బిగ్ టీవీ కథనాలతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ.. అసలు ది హైవ్ రెస్టారెంట్ విషయంలో ఏం జరిగిందని తెలుసుకునే పనిలో పడింది. ఈ రెస్టారెంట్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారా అని వివరణ కోరుతూ HMRL MDకి లేఖ రాసింది. కమర్షియల్ వినియోగానికి లీజు, లైసెన్స్, NOC లు ఇచ్చారా అని ప్రశ్నించింది. స్థల వినియోగానికి అనుమతులు ఇస్తే.. దానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని GHMC కోరింది. HMRL నుంచి ఈ విషయంపై క్లారిటీ వస్తే GHMC అధికారులు యాక్షన్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు.
అంతేకాదు.. ది హైవ్ రెస్టారెంట్‌కు కూడా జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. నిర్మాణ అనుమతులపై తనిఖీలు చేశారు. కానీ, పర్మిషన్ డాక్యుమెంట్స్‌ను రెస్టారెంట్ యాజమాన్యం చూపించలేకపోయింది. దీంతో 7 రోజుల గడువుతో నోటీసులు జారీ చేశారు. అనుమతుల పత్రాలతో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. డెడ్ లైన్ దాటితే రెస్టారెంట్‌ను కూల్చివేస్తామని వార్నింగ్ ఇచ్చారు అధికారులు.
Also read: మేం అధికారంలోకి వస్తే చేసే మొట్టమొదటి పని ఇదే.. కవిత క్లారిటీ..?
నిర్మాణంలోనే కాదు.. నిర్వహణలో కూడా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రెస్టారెంట్‌లో డొమెస్టిక్ సిలిండర్లను గుర్తించింది బిగ్ టీవీ టీం. ఇక్కడ నిర్వహకులు లెక్కలేనితనం ఎలాగూ ఉంది? అధికారుల నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ ఎక్కడా లేవు. ఏదైనా ప్రమాదం జరిగితే అక్కడ నుంచి బయటపడటం కూడా అంత సులభం కాదు. ఏదోలా బయటకు వచ్చినా డైరెక్ట్ గా రోడ్డు మీదకే రావాలి. సో.. రద్దీగా ఉండే ఆ రోడ్డులో యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదం కూడా లేకపోలేదు. అలాంటి ప్రాంతంలో అనుమతులు లేకుండా, సేఫ్టీ మెజర్స్ పాటించకుండా ఎలా నిర్మిస్తారు? అంత బరితెగింపు ఏంటీ? దీనిపై అధికారుల చర్యలు ఎలా ఉంటాయనేది చూడాలి మరి..