E-Paper
Advertisement

ప్రధాని మోదీపై సెటైరికల్ స్కిట్ వివాదం.. రగిలిపోతున్న బీజేపీ నేతలు!

ప్రధాని మోదీపై సెటైరికల్ స్కిట్ వివాదం.. రగిలిపోతున్న బీజేపీ నేతలు!
Advertisement

PM Modi Mimicry: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన ఛాత్రోంకి గూంజ్‌ కార్యక్రమంలో వేసిన సెటైరికల్ స్కిట్‌ రాజకీయ వివాదానికి దారితీసింది. స్టేజీపై ప్రధాని మోదీ హావభావాలు, మాట్లాడే తీరును ఇమిటేట్‌ చేస్తూ ఆయన చేసిన స్కిట్‌ వివాదాస్పదమైంది. ముఖ్యంగా ఓ సభలో మోదీ ఓ వృద్ధురాలికి కుర్చీ ఏర్పాటు చేయాలని సూచించిన ఘటనను ప్రస్తావిస్తూ చేసిన సెటైర్‌పై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు.

అసభ్యంగా ఎగతాళి..

ఇదిగో ఈ వీడియోనే బీజేపీ నేతలను ఆగ్రహానికి గురిచేసింది. కాంగ్రెస్‌ కార్యక్రమంలో జరిగిన స్కిట్‌పై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీని కమెడియన్స్‌, జోకర్స్‌ పార్టీ అని కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు సోషల్‌ మీడియాలో విమర్శలు గుప్పించారు. బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్‌ కేశవన్‌ ఈ స్కిట్‌ను అసభ్యంగా ఎగతాళి చేయడంగా అభివర్ణించారు. ఇక ఈ వివాదంలో ప్రధానంగా వినిపిస్తున్న మరో ఆరోపణ… ప్రధాని మోదీ తల్లిని అవమానించేలా స్కిట్‌లో వ్యాఖ్యలు చేశారన్నది. విద్యార్థుల కార్యక్రమాన్ని ఉపయోగించుకుని మోదీ తల్లిని అవమానించారని కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి ఆరోపణలు చేశారు. ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి సైతం రాజకీయాలకు తల్లి అంశం కావద్దన్నారు.

రాహుల్‌ గాంధీ..

Advertisement

స్కిట్‌లో కమెడియన్ చేసిన వ్యాఖ్యలు.. దానికి రాహుల్‌ గాంధీ స్పందనపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఒక కామెడీ పెర్ఫార్మెన్స్‌ ఇప్పుడు మరోసారి బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధానికి కారణమైంది.

Also read: సీఎం కోట ముందు కవిత ఛాలెంజ్‌….నేను బహుజన బాణాన్ని.. ఏ పార్టీకి తొత్తును కాదు..!

Tags

Related News

దానం నాగేందర్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ట్విస్ట్.. రంగంలోకి బీఆర్ఎస్, బీజేపీ!

రాఖీ సినిమా సీన్ రిపీట్.. చెల్లిని చంపిన భర్తను అతి దారుణంగా చంపిన అన్నయ్య!

బీఆర్ఎస్ ఫాంహౌస్‌లపై కాంగ్రెస్ ఫోకస్.. ఫీల్డ్ విజిట్ నివేదికపై ఉత్కంఠ!

కత్రినా ట్రోలింగ్ ఎఫెక్ట్.. బిగ్‌బాస్ స్టేజ్‌పై సల్మాన్ ఫైర్!

బిగ్‌టీవీ బిగ్ ఇంపాక్ట్.. రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ.. ‘ది హైవ్ రెస్టారెంట్’కు నోటీసులు!

సికింద్రాబాద్ ఇస్కాన్ వద్ద మెట్రో పిల్లర్ల గుంతల పూడ్చివేత.. ఇక కథముగిసినట్టేనా..?

వైరల్‌గా మారిన కేరళ ఎమ్మెల్యే స్టోరీ.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

Big Stories

Advertisement
×