Farmhouse Row: తెలంగాణ రాజకీయాల్లో ఫాంహౌస్‌లు, భూముల అంశం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన భూములు, ఫాంహౌస్‌లపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఫీల్డ్ విజిట్ మూడో రోజుకు చేరుకుంది. తొలి రోజు సిద్దిపేట జిల్లాలోని రంగనాయక్ సాగర్ ప్రాంతంలో హరీశ్‌రావుకు సంబంధించిన ఫాంహౌస్ ప్రాంతాన్ని కాంగ్రెస్ బృందం పరిశీలించింది. రెండో రోజు ధన్వాడలోని కేటీఆర్‌కు సంబంధించిన ఫాంహౌస్ ప్రాంతాన్ని పరిశీలించిన కాంగ్రెస్ నేతలు.. ఇవాళ రంగారెడ్డి జిల్లాపై ఫోకస్ పెట్టారు.
అజీజ్‌నగర్‌కు చేరుకున్న కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం.. హరీశ్‌రావు ఫాంహౌస్ ప్రాంతాన్ని పరిశీలించింది. భూముల విస్తీర్ణం, వాటి స్వరూపం, సంబంధిత అంశాలపై కాంగ్రెస్ నేతలు వివరాలు సేకరించారు. అజీజ్‌నగర్ తర్వాత కాంగ్రెస్ బృందం మొయినాబాద్ కి వెళ్లింది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి సంబంధించిన ఫాంహౌస్ ప్రాంతాన్ని కూడా నేతలు పరిశీలించారు. భూ కేటాయింపులు, కొనుగోళ్లు, వాటి వినియోగంపై ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందంటున్నారు కాంగ్రెస్ నేతలు.
కాంగ్రెస్ నేతలు వరుసగా ఫీల్డ్ విజిట్లు చేస్తూ భూములపై ప్రశ్నలు లేవనెత్తుతుంటే.. ఆధారాలతో సమాధానాలు చెబుతామని BRS చెబుతోంది. కాంగ్రెస్ బృందం సేకరించిన వివరాలు, వాటిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also read: చికెన్, మటన్ షాప్‌లో మీకు ఇలా జరిగిందా.. అయితే బీకేర్ ఫుల్!