Revenge Murder: రాఖీ సినిమా చూశారా.. ఆ మూవీలో తన చెల్లిని చంపిన వారిని హీరో దారుణంగా కాల్చి చంపేస్తాడు. ఇక్కడ సంతోష్ కూడా తన చెల్లిని చంపిన హరిబాబును నడిరోడ్డుపై ఖతం చేశాడు.
13 మంది అన్నయ్యలు.. ఒక్కగానొక చెల్లి.. ఆమె వాళ్ల లోకం. ఆ చెల్లి.. హరిబాబు ప్రేమలో పడింది. చెల్లి మాట కాదనలేదు అన్నయ్యలు. పెళ్లి చేసి ఇద్దరిని తమ ఇంట్లోనే ఉంచుకున్నారు. ఏం జరిగిందో తెలియదు. వైష్ణవి కత్తిపోట్లతో నెత్తుటిమడుగులో పడిపోయింది. హరిబాబు మాత్రం జంప్. పోలీసులు వాడిని అరెస్ట్ చేయడం.. బెయిల్‌పై బయటకు రావడం అంత చకచక జరిగిపోయాయి. వైష్ణవి చనిపోవడంతో ఆ ఫ్యామిలీ తట్టుకోలేకపోయింది. హరిబాబుపై కోపంతో రగిలిపోయింది. తన చెల్లిని చంపినవాడిని చట్టం వదిలినా తాము వదిలిపెట్టే ప్రస్తక్తేలేదని శపథం చేశాడు. చివరకు వైష్ణవి అన్నయ్య అనంత పనిచేశాడు. వైష్ణవిని నాలుగు గోడల మధ్య చంపేస్తే హరిబాబును నడిరోడ్డుపై నరికేశాడు.
Also read: పిఠాపురంలో ఉపాసన రాంచరణ్ సామాజిక సేవ.. రూ. 2 కోట్ల వ్యయంతో!
ప్రధాన నిందితుడిగా ఉన్న వైష్ణవి సోదరుడు సంతోష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మర్డర్ చేసిన తర్వాత సంతోష్ ఏపీకి పారిపోయేందుకు ప్రయత్నం చేశాడని.. అతడిని ట్రేస్ చేసి నిజామాబాద్ బైపాస్ రోడ్డులో పట్టుకున్నామని పోలీసులు చెబుతున్నారు. ఈ అటాక్‌లో నిందితులు వాడిన స్విఫ్ట్ కారును, హత్యకు ఉపయోగించిన పదునైన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇక్కడే అసలు ట్విస్ట్.. ఉంది. ఈ హత్య వెనుక ఇంకా ఎవరెవరి హస్తం ఉంది? అసలు ఆ కారు డ్రైవ్ చేసింది ఎవరు? ఈ మర్డర్ కేవలం సంతోష్ ఒక్కడి పనే కాదట.. హరిబాబు హత్య వెనుక సంతోష్ తల్లితో పాటు మరో ఇద్దరు సోదరుల ప్రమేయం కూడా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. అంటే ఇదొక ఫ్యామిలీ ప్లాన్డ్ రివెంజ్ అన్నమాట. మరి ఆ మిగతా ముగ్గురు ఎక్కడున్నారు? వాళ్లని పోలీసులు ఎలా పట్టుకోబోతున్నారు?
Also read: చికెన్, మటన్ షాప్‌లో మీకు ఇలా జరిగిందా.. అయితే బీకేర్ ఫుల్!