Credit Politics: రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రెడిట్ చోరీ అనే పదం ఈ మధ్య పదే పదే వినిపిస్తోంది. మామూలుగా అధికార బదిలీ జరిగిప్పుడు.. ప్రభుత్వాల మార్పు వల్ల అభివృద్ది అంశంలో పవర్‌లో ఉన్న పార్టీనే క్రెడిట్ కొట్టేయాలని చూస్తుంది. దీన్ని ప్రతిపక్షం క్రెడిట్ చోరీ అంటూ జనానికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తోంది. ఈ మధ్య ఏపీ, తెలంగాణలో ఈ రకం రాజకీయలొల్లి పతాకస్థాయికి చేరుకున్నది. కానీ మనం ఇప్పుడు చెప్పుకోబోయే స్టోరీ మాత్రం దీనికి పూర్తి విరుద్దమైనది… ఇది చూసి మీరు కచ్చితంగా మెచ్చుకుంటారు కూడా. మరి ఆ వార్తేంటో చూసేద్దాం ఓసారి.
పని ప్రారంభించినవారు ఒకరు.. నిధులు సమకూర్చి… అది పూర్తయ్యేలా చేసిందీ అతనే.. ఈ పనులకు ఫినిషింగ్ టచ్ ఇచ్చింది మాత్రం ఇంకొకరు. అయినా.. ఈ పని మాది.. అంటూ క్రెడిట్ కోసం పోటీ పడకుండా.. తనకు ముందు పనిచేసిన నాయకుడి కృషిని గుర్తించడం.. ప్రస్తుత రాజకీయాల్లో అరుదైన సంఘటనగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. కేరళంలో ఇలాంటి సందర్భం వచ్చింది. అందరినీ ఆశ్చర్యపరిచింది. క్రెడిట్ చోరీకి పాకులాడకుండా.. జనం మనసును చోరీ చేసిన ఆ నేతను అంతా మెచ్చుకున్నారు. ఎవరా నేత.. అసలేం జరిగింది? తెలుసుకుందాం!
కానీ కేరళలో జరిగిన ఓ ఘటన మాత్రం ఇందుకు భిన్నమైన రాజకీయ సంస్కృతిని గుర్తుచేస్తోంది. కేరళలోని పూంజార్ నియోజకవర్గానికి చెందిన ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యే ఎంజే సెబాస్టియన్ తన నియోజకవర్గంలోని ఓ వంతెన నిర్మాణానికి సంబంధించిన ఘనతను తాను తీసుకోకుండా..మాజీ ఎమ్మెల్యే సెబాస్టియన్ కులత్తుంకల్‌కే ఇచ్చారు. గతంలో ఆ పనికి నిధులు సమకూర్చి, నిర్మాణానికి బాటలు వేసిన మాజీ ఎమ్మెల్యే సెబాస్టియన్ కులతుంకల్‌కే ప్రారంభోత్సవ గౌరవం ఇవ్వాలని కోరిన ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎంజే సెబాస్టియన్‌పై ప్రశంసలు వ్యక్తమయ్యాయి. సుమారు రూ.80 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టిన ఈ వంతెన పనులకు గతంలోనే పునాది పడగా, తరువాతి ప్రభుత్వ కాలంలో నిర్మాణం పూర్తయింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ పనులు మేం చేశామంటే మేం చేశామని కొట్లాడుతున్నారు. ఆ ప్రాజెక్టు మా హయాంలో మొదలు పెట్టామని, మేమే నిధులు కేటాయించమని చెప్పుకుంటున్నారు. అంతా అయిన తరువాత ప్రారంభోత్సవాలు చేసుకుంటూ అది తమ ఖాతాల వేసుకుంటున్నారని క్రెడిట్ చోరీ ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రెడిట్ చోరీ రాజకీయాల రచ్చతో జనం కూడా విస్తుపోతున్నారు. కానీ, కేరళంలో ఎమ్మెల్యే ఎంజె సెబాష్టియన్ విశాల హృదయాన్ని ప్రదర్శించి ఆ క్రెడిట్‌ను పాత వారి ఖాతాలోనే వేయడమే కాదు.. జనం మనసులో మంచి క్రెడిట్ కొట్టేశారు. మన తెలుగు నేతలు ఓసారి ఈ వార్త చూసి మార్పు చెందిన బాగుండని అనుకుంటున్నారు తెలుగు జనం.
Also read: జూరాల డ్యామ్ వద్ద ఉత్కంఠ.. రైతుల ధర్నాతో పోలీసులు పహారా!