Bengal Politics: బెంగాల్ ఎన్నికల ఫలితాలు కేవలం ఒక ప్రభుత్వ మార్పు మాత్రమే కాదు.. అది ఒక వ్యవస్థపై ప్రజల తిరుగుబాటు. మమత పాలనలో జరిగిన అవినీతి, క్షేత్రస్థాయిలో పెచ్చుమీరిన రౌడీ రాజ్యం దీదీని దెబ్బతీశాయి. శారదా స్కామ్ నుంచి మొన్నటి ఉపాధ్యాయ నియామక కుంభకోణం వరకు.. సందేశ్‌ఖాలీలో మహిళలపై జరిగిన అరాచకాల నుంచి రేషన్ మాఫియా వరకు.. అన్నీ టీఎంసీ పునాదులను కూకటివేళ్లతో పెకిలించాయి. ఒకప్పుడు వామపక్షాల అరాచకానికి వ్యతిరేకంగా పోరాడిన మమత..అదే తరహా క్యాడర్ రాజకీయాలకు అలవాటు పడటం ఆమెకు శాపమైంది. ఫలితంగా ఎన్నికల్లో ఓటర్లు నిశ్శబ్దంగా తమ తీర్పును వెలువరించారు. దీదీకి ఇంటికి పంపించారు.
కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్లు..పశ్చిమ బెంగాల్‌లో మమతా ఓటమికి అన్నే కారణాలున్నాయని చెప్పొచ్చు. మమతా బెనర్జీ కేవలం ఒక నాయకురాలు కాదు, ఆమె ఒక భావోద్వేగం. కానీ ఆ భావోద్వేగంపై అవినీతి అనే నీడ పడింది. తృణమూల్ కాంగ్రెస్ అట్టడుగు స్థాయి వరకు అవినీతిలో కూరుకుపోయిందనే ప్రచారం ఓటర్లలో బలంగా నాటుకుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కట్ మనీ సంస్కృతి సామాన్యులను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. దీనికి తోడు మమతా బెనర్జీపై నేరుగా అవినీతి ఆరోపణలు తక్కువగా ఉన్నప్పటికీ, ఆమె కేబినెట్ మంత్రులు, అత్యంత సన్నిహితులు జైలుకు వెళ్లడం ఆమె ఇమేజ్‌ను డ్యామేజ్ చేసింది. ఇక శారదా, రోజ్ వ్యాలీ స్కాములు దశాబ్ద కాలంగా టీఎంసీని వెంటాడుతున్నాయి. వేలమంది అర్హులైన నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న SSC కుంభకోణం..బెంగాల్ మధ్యతరగతి ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ప్రస్తుతం ఎన్నికల ఓటమి తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థలు దీదీని నేరుగా టార్గెట్ చేసే అవకాశం ఉంది. అయితే రాజకీయ కక్ష సాధింపు అని ఆమె వాదించినా, కోర్టుల్లో ఆధారాలు నిలబడితే మమతా బెనర్జీకి ఇబ్బందులు తప్పవు.
వాయిస్-3 మమత తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని పార్టీ వారసుడిగా ప్రకటించిన నాటి నుంచి టీఎంసీలో చీలికలు మొదలయ్యాయి. సువేందు అధికారి వంటి బలమైన నేతలు పార్టీని వీడటానికి అభిషేక్ పోకడలే కారణం. ఇప్పుడు అధికారంలో లేకపోవడం, పైగా కేసులు ఉండటంతో అభిషేక్ చుట్టూ రక్షణ కవచం తొలగిపోయింది. అభిషేక్ అరెస్ట్ జరిగితే, పార్టీ కేడర్ చెల్లాచెదురయ్యే ప్రమాదం ఉంది. మరోవైపు మమతా బెనర్జీ అంటేనే ఒక పోరాటం. ఆమెను రాజకీయంగా తక్కువ అంచనా వేయడం ఎవరికైనా ప్రమాదకరమే. 1984లో సోమనాథ్ ఛటర్జీ లాంటి ఉద్ధండుడిని ఓడించిన నాటి నుంచి, 2011లో కమ్యూనిస్టు కోటను కూల్చిన వరకు ఆమె ప్రస్థానం అసాధారణం. అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. గతంలో ఆమె వెనుక యువత, మేధావులు ఉండేవారు. ఇప్పుడు యువత ఉపాధి లేక వలస వెళ్తున్నారు. మేధావులు అవినీతికి వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. ఈ క్రమంలో వచ్చే ఐదేళ్లు ఆమెకు అగ్నిపరీక్షే. పార్టీని కాపాడుకోవాలంటే ఆమె మళ్లీ రోడ్ల మీదకు రావాలి, ప్రజల నమ్మకాన్ని గెలవాలి. కానీ వయస్సు, మారుతున్న రాజకీయ సమీకరణాలు ఆమెకు సహకరిస్తాయా అన్నది ప్రస్తుతం అందరి మదిలో ఉదయిస్తున్న ప్రశ్న.
Also read: త్వరలో లండన్ థేమ్స్ నదిలా మారనున్న హైదరాబాద్..!
బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ ఓడింది.. దీంతో పాటు..ఎమ్మెల్యేగా కూడా మమతా గెలవలేదు. దీంతో ఇప్పుడు అందరి కళ్లు టీఎంసీ సెకండ్ ఇన్ కమాండ్.. దీదీ వారసుడు అభిషేక్ బెనర్జీపైనే అందరి కళ్లు ఉన్నాయి. అయితే ప్రస్తుతం టీఎంసీలో అభిషేక్ బెనర్జీ నంబర్ 2గా ఉన్నప్పటికీ, సీనియర్ నాయకులలో ఆయనపై తీవ్ర అసంతృప్తి ఉంది. ఓటమి తర్వాత చాలామంది సీనియర్లు బీజేపీ వైపు చూసే అవకాశం ఉంది. బొగ్గు అక్రమ రవాణా కేసు, పశువుల అక్రమ రవాణా కేసు, మనీ లాండరింగ్ ఆరోపణలు మమతా వారుసుడిని చుట్టుముడుతున్నాయి. SSC కుంభకోణంలో పార్థా ఛటర్జీ పట్టుబడిన తర్వాత, ఆ నెట్‌వర్క్ అభిషేక్ వరకు వెళ్తోందని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ఒకవేళ అభిషేక్ కేసులతో అరెస్ట్ అయితే..అది టీఎంసీకి మరణశాసనమే అవుతుంది. దీదీ తన వారసుడిని కాపాడుకోగడం ఒక ఎత్తు అయితే..పార్టీ ముక్కలు కాకుండా చూసుకోవడం మరో ఎత్తు.
బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి రావడంతో కాషాయ శ్రేణులు టీఎంసీకి రిటర్న్ గిఫ్ ఇచ్చే ప్రమాదమూ లేకపోలేదు. టీఎంసీ హయాంలో బీజేపీ కార్యకర్తలను నానా ఇబ్బందులకు గురి చేసిన మమతా బెనర్జీ.. టీఎంసీ కార్యకర్తలపై.. బీజేపీ తన అధికారాన్ని ఝులిపించే అవకాశం ఉంది. టీఎంసీ కార్యకర్తలపై దాడులు జరగొచ్చు. ఇలాంటి సమయంలో తన కేడర్‌ను కాపాడుకోవడం దీదీకి అతిపెద్ద సవాలు. నిధుల కొరత, నాయకుల ఫిరాయింపులు పార్టీని బలహీనపరుస్తాయి. మమత మళ్లీ తన పాత పద్ధతిలో ప్రజల్లోకి వెళ్లి, బెంగాల్ అస్తిత్వం కార్డును వాడుకోవాల్సి ఉంటుంది. కానీ..అది ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది..మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఎండ్ వాయిస్- ఓ వైపు ఓటమి భారంతో దీదీ.. కేసుల భయంతో వారసుడు, గెలుపు ఉత్సాహంతో బీజేపీ.. వెరసి బెంగాల్‌లో రాబోయే రోజులు అత్యంత కీలకంగా మారనున్నాయి. మమతా బెనర్జీ ఒక ఫైటర్. ఆమె చరిత్ర చూస్తే ఎన్నోసార్లు ఓడి గెలిచారు. కానీ ఈసారి ప్రత్యర్థి బలమైన బీజేపీ, ఆరోపణలు తీవ్రమైన అవినీతి. దీదీ మళ్లీ నిలబడాలంటే ఆమె ..శక్తికి మించిన పోరటం చేయాల్సిందే. ఈ నేపథ్యంలో మమత మళ్లీ పుంజుకుంటారా? లేక ఆమె రాజకీయ ప్రస్థానం ముగిసిన అధ్యాయమేనా? అనేది కాలమే సమాధానం చెప్పాలి.
Also read: ఆత్మగౌరవమా? సెక్యులరిజమా.. 75 ఏళ్లక్రితం సోమనాథ్ చుట్టూ నడిచిన అసలు రహస్యం ఇదే..?