E-Paper
Advertisement

Self-Install Smart Lock: స్వయంగా డోర్‌ లాక్ ఫిట్ చేయండి.. షావోమి కొత్త స్మార్ట్ లాక్ లాంచ్ .. ఫీచర్స్ ఇవే

Self-Install Smart Lock: స్వయంగా డోర్‌ లాక్ ఫిట్ చేయండి.. షావోమి కొత్త స్మార్ట్ లాక్ లాంచ్ .. ఫీచర్స్ ఇవే
Advertisement

Xiaomi Self-Install Smart Lock| చైనా టెక్ కంపెనీ షావోమి.. కొత్త స్మార్ట్ హోమ్ సెక్యూరిటీ ప్రొడక్ట్‌ను ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేసింది. దీని పేరు షావోమి సెల్ఫ్-ఇన్‌స్టాల్ స్మార్ట్ లాక్. ఈ లాక్ ‌లో ఆధునిక భద్రతా ఫీచర్లతో పాటు ఇన్‌స్టాల్ చేసుకోవడం సౌలభ్యమే ప్రధాన ఆకర్షణ. స్వయంగా ఇన్‌స్టాల్ చేయాలనుకునే వారికి ప్రత్యేకంగా రూపొందించారు. జపాన్, యుఏఈలో మొదట లాంచ్ చేశారు. ఇప్పుడు యూరప్ మార్కెట్లలో విస్తరిస్తోంది షావోమి.

స్మార్ట్ లాక్ ధర వివరాలు

షావోమి సెల్ఫ్-ఇన్‌స్టాల్ స్మార్ట్ లాక్ ధర 145 నుంచి 153 యూరోల మధ్య ఉంది. భారత కరెన్సీలో సుమారు రూ.15,668 నుంచి రూ.16,533 వరకు ఉంటుంది. ఎక్స్‌టర్నల్ కీప్యాడ్‌తో కూడిన సెకండరీ కిట్ ధర 179 నుంచి 189 యూరోల మధ్య ఉంది. అంటే రూ.19,342 నుంచి రూ.20,422 వరకు ఉంటుంది. ఫ్రాన్స్, జర్మనీ వంటి యూరోపియన్ దేశాల రిటైలర్ల వద్ద ఇప్పటికే లభిస్తోంది.

డోర్‌కు డ్యామేజ్ కాకుండా సులభ ఇన్‌స్టాలేషన్

Advertisement

ఈ స్మార్ట్ లాక్ ప్రధాన ఫీచర్ సులభ ఇన్‌స్టాలేషన్. డ్రిల్లింగ్ లేదా రంధ్రాలు వేయాల్సిన అవసరం లేదు. ప్రొఫెషనల్ సహాయం తీసుకోవాల్సిన పనే లేదు. ఇప్పటికే ఉన్న డోర్ లాక్ లేదా నాబ్ పైనే ఫిట్ అవుతుంది. పాత హార్డ్‌వేర్ మార్చాల్సిన అవసరం లేదు. డోర్‌కు శాశ్వత మార్పులు రావు. అద్దె ఇంట్లో ఉండేవారు, సొంత ఇంటి యజమానులు ఇద్దరూ సులభంగా ఉపయోగించవచ్చు. ఇల్లు మారేటప్పుడు కూడా సులభంగా తొలగించవచ్చు.

ఎన్నో అన్‌లాక్ ఆప్షన్లు

ఈ లాక్‌లో చాలా అన్‌లాక్ మార్గాలు ఉన్నాయి. ఫింగర్‌ప్రింట్ స్కాన్‌తో త్వరగా, సురక్షితంగా తెరవవచ్చు. స్టోర్ చేసిన ఫింగర్‌ప్రింట్‌లతో ఓపెన్ అవుతుంది. పర్మనెంట్ పాస్‌కోడ్‌లు కూడా ఉపయోగించవచ్చు. అతిథులు, సర్వీస్ వర్కర్ల కోసం టెంపరరీ పాస్‌కోడ్‌లు ఇవ్వవచ్చు. స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా బ్లూటూత్ లేదా వై-ఫైతో కంట్రోల్ చేయవచ్చు. స్మార్ట్ అసిస్టెంట్‌లతో వాయిస్ కమాండ్‌లతో కూడా ఓపెన్ చేయవచ్చు. అత్యవసరాలకు ఫిజికల్ కీ స్లాట్ కూడా ఉంది.

స్మార్ట్ హోమ్ ఇంటిగ్రేషన్, మ్యాటర్ సపోర్ట్

Advertisement

ఈ లాక్ మ్యాటర్ స్మార్ట్ హోమ్ స్టాండర్డ్‌ను సపోర్ట్ చేస్తుంది. మ్యాటర్ వల్ల వివిధ బ్రాండ్ల స్మార్ట్ డివైస్‌లు ఒకదానితో ఒకటి పనిచేస్తాయి. ఒకే బ్రాండ్‌పై ఆధారపడాల్సిన అవసరం లేదు. లైట్లు, కెమెరాలతో కలిపి మేనేజ్ చేయవచ్చు. ఆటోమేషన్, హోమ్ సెక్యూరిటీ మరింత మెరుగవుతాయి.

Also Read: ఫోన్ టచ్ చేయకుండానే ఫుడ్ ఆర్డర్, క్యాబ్ బుకింగ్.. గూగుల్ జెమిని అన్ని పనులు చేస్తుంది.. ఎలాగంటే

ఈ స్మార్ట్ లాక్ ఎవరికి బాగుంటుంది?

సులభ ఇన్‌స్టాలేషన్ కావాలనుకునే వారికి ఇది చాలా బాగుంటుంది. అపార్ట్‌మెంట్లు, అద్దె ఇల్లు, స్మార్ట్ హోమ్ కావాలనుకునే వారికి సరిపోతుంది. ఫ్లెక్సిబుల్ స్మార్ట్ హోమ్ సెటప్ ఇష్టపడేవారికి ఉపయోగకరం. భద్రత, సౌకర్యం, కంపాటిబిలిటీ మూడూ ఇస్తుంది. షావోమి దీన్ని యూజర్-ఫ్రెండ్లీ, వర్సటైల్ ప్రొడక్ట్‌గా పరిచయం చేసింది. సంక్లిష్ట ఇన్‌స్టాలేషన్ లేకుండా స్మార్ట్ సెక్యూరిటీ ఇస్తుంది.

Related News

పాత ఇన్‌స్టా యూజర్‌నేమ్‌తో విసిగిపోయారా? ఇలా ఈజీగా మార్చుకోండి!

ఫోన్ కెమెరా బ్లర్‌గా ఉందా? వాటర్ మాయిశ్చర్ తొలగించే బెస్ట్ హ్యాక్స్!

120Hz డిస్‌ప్లే నిజంగానే ఎక్కువ ఛార్జింగ్ లాగేస్తుందా?అసలు నిజం ఇదే!

ఫోన్ ఛార్జింగ్ అవట్లేదా? ఈ చిన్న పొరపాట్లే USB పోర్ట్‌ను పాడుచేస్తాయి

ఆస్ట్రేలియాలో రాక్షస సాలీడు.. శాటిలైట్ ఫోటోతో అసలు సంగతి చెప్పేసి నాసా

వింటర్‌లో కాలుష్యం నుంచి ఫుల్ సేప్టీ..ఏసీలో ఈ ఒక్క మోడ్ ఉంటే చాలు!

ఒకప్పుడు భూమిపై అసలు ఆక్సిజనే ఉండేది కాదట, దీని పుట్టక భలే విచిత్రం

స్మార్ట్‌ఫోన్‌కు అడిక్ట్ అయ్యారా? డిజిటల్ డిటాక్స్ కోసం ఈ 5 మినీ గ్యాజెట్స్‌ను ట్రై చేయండి!

Big Stories

Advertisement
×