Seetha Payanam: మల్టీ టాలెంటెడ్ యాక్టర్, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ (Action King Arjun) దర్శకత్వంలో శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘సీతా పయనం’ (Seetha Payanam). ఈ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ (Aishwarya Arjun) హీరోయిన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. నిరంజన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ వంటి వారు ఇతర ముఖ్య పాత్రల్ని పోషించారు. యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఇందులో ఓ ప్రత్యేకమైన పాత్రలో నటించారు. ఆయన మేనల్లుడు యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా మరో స్పెషల్ కామియో రోల్ పోషించినట్లుగా ఇప్పటికే క్లారిటీతో పాటు ఫస్ట్ లుక్ కూడా వదిలారు. ఫిబ్రవరి 14న ‘ప్రేమికుల రోజు’ స్పెషల్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ (Seetha Payanam Trailer)ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా వచ్చిన ట్రైలర్ కూడా సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. ఎమోషనల్‌గా టచ్ చేస్తూ సాగిన ఈ ట్రైలర్‌ను గమనిస్తే.. ‘అతను లిఫ్ట్ అడిగితే ఓకే అన్నాను.. ఇప్పుడు అతను నా పక్కనే కూర్చున్నాడు’ అనే డైలాగ్‌తో ఈ ట్రైలర్ మొదలైంది. అలా హీరోహీరోయిన్ల పయనం మొదలైంది. ఓ కారులో హీరో హీరోయిన్‌కు జరిగిన జర్నీనే ఈ సినిమా అనే హింట్ ఇస్తూ మొదలైన ఈ ట్రైలర్‌లో బ్యూటీఫుల్ విజువల్స్, లీడ్ పెయిర్ కెమిస్ట్రీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో అన్ని అంశాలను టచ్ చేసినట్లుగా ఈ ట్రైలర్ తెలియజేస్తుంది. ముఖ్యంగా సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగ్స్, అనూప్ రూబెన్స్ మ్యూజిక్ హైలెట్‌గా ఉన్నాయి. సత్యరాజ్ పాత్ర ‘రాజా రాణి’ సినిమాను తలపిస్తే, ప్రకాష్ రాజ్ పాత్ర ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రాన్ని గుర్తు చేస్తోంది.
Also Read- Rashmika Mandanna: డార్క్ పాత్రలో రష్మిక.. AA24 సినిమాలో ఎప్పుడూ లేనంత వైలెంట్‌గా..!
ఇక ఇందులో హీరో నీ పేరేంటి కనుక్కోవడానికి ఏదైనా హింట్ ఇవ్వమని అడగగానే, ‘భూమిలో పుట్టింది.. శ్రీరాముల వారికి ప్రియమైనది’ అని హీరోయిన్ ఇచ్చే హింట్ డైలాగ్, అలాగే ప్రకాష్ రాజ్ చెప్పే ‘పెళ్లి’ డైలాగ్ బాగా పేలాయి. ట్రైలర్ మధ్యలో యాక్షన్ కింగ్ అర్జున్ ఎంట్రీ, యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా ఫైట్ సీన్ మరింత అట్రాక్షన్‌గా నిలిచాయి. మాస్ యాక్షన్, లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని రకాల అంశాల్ని ఈ ట్రైలర్‌లో జోడించారు. ఈ సినిమా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. యాక్షన్ కింగ్ అర్జున్ సాంప్రదాయ విలువలకు ఇంపార్టెన్స్ ఇస్తూ, ఈ సినిమాను రూపొందించినట్లుగా ట్రైలర్ తెలియజేస్తుంది. ఫిబ్రవరి 14న ఈ చిత్రాన్ని నాలుగు భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Also Read- Renu Desai: చిన్న వయసులో జరిగిన ఆ సంఘటన.. నన్నే మార్చేసింది!