E-Paper
Advertisement

Garuda Purana: చనిపోయిన తర్వాత ఆత్మ ఎటు ప్రయాణిస్తుంది – అసలు గరుడ  పురాణం ఎం చెప్తుంది

Garuda Purana: చనిపోయిన తర్వాత ఆత్మ ఎటు ప్రయాణిస్తుంది – అసలు గరుడ  పురాణం ఎం చెప్తుంది
Advertisement

Garuda Purana: మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఎటు వెళ్తుంది. శరీరం నుంచి ఆత్మ విడిపోయిన తర్వాత జరిపే 13 రోజుల ప్రయాణం ఎందుకు ముఖ్యమైనది. ఆ 13 రోజుల్లో ఆత్మ ఎక్కడెక్కడ ఏఏ స్థితి అనుభవిస్తుంది. అసలు మనిషి మరణం తర్వాత జరగబోయే విషయాల గురించి గరుడ పురాణం ఏం చెప్తుంది. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మరణం జరిగిన వెంటనే మనిషి శరీరం విడిచిన వెంటనే, ఆత్మ సూక్ష్మ శరీరంతో ప్రయాణం ప్రారంభిస్తుంది. ఈ సమయంలో ఆత్మకు తన శరీరంపై ఇంకా మమకారం ఉంటుంది. అందుకే శాస్త్రాల ప్రకారం శరీరాన్ని అగ్నికి అప్పగించడం ద్వారా ఆత్మకు విముక్తి మార్గం సుగమమవుతుంది. గరుడపురాణం ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ 13 రోజులు ప్రయాణం చేయాల్సి వస్తుందట. ఆ 13 రోజుల్లో ఎక్కడికి వెళ్తుంది. ఈ 13 రోజులు ఆత్మకు చేయాల్సిన క్రియలు ఏంటి ఎందుకు చేస్తారు ఇప్పుడు తెలుసుకుందాం.

మొదటి 3 రోజులు:

Advertisement

మరణం తర్వాత మొదటి మూడు రోజులు ఆత్మ తన ఇల్లు, కుటుంబం చుట్టూ తిరుగుతుందని నమ్మకం. ఈ సమయంలో ఆత్మకు దారి తెలియని స్థితి ఉంటుంది. అందుకే కుటుంబ సభ్యులు శాంతి, ప్రార్థనలు చేస్తారు.

4వ రోజు నుంచి 10వ రోజు వరకు:

ఈ రోజుల్లో ఆత్మకు ప్రేత స్థితి ఉంటుందని గరుడ పురాణం చెబుతుంది. ప్రతిరోజూ చేసే పిండ ప్రదానం, తిల తర్పణం ఆత్మకు ఆహారం, శక్తిగా మారుతాయి. ఈ క్రియల ద్వారా ఆత్మకు సూక్ష్మ శరీరం ఏర్పడుతుంది మరియు తదుపరి లోకానికి ప్రయాణం సులభమవుతుంది.

11వ రోజు – ఏకోదిష్ట శ్రాద్ధం:

Advertisement

ఈ రోజు చాలా ముఖ్యమైనది. ఆత్మను పితృలోకానికి పంపే ప్రధాన క్రియ ఇది. ఇక్కడ ఆత్మను ప్రేత స్థితి నుంచి పితృ స్థితికి చేర్చుతారు.

12వ రోజు – సపిండీకరణ:

మరణించిన వ్యక్తి ఆత్మ  12వ రోజు పూర్వీకులతో కలిసిపోతుంది. అంటే పితృ దేవతలలో ఒక భాగంగా మారుతుంది. ఇది లేకపోతే ఆత్మకు శాంతి దక్కదని శాస్త్రాలు చెబుతాయి.

13వ రోజు – కర్మకాండ ముగింపు:

13వ రోజు ఆత్మ ప్రయాణానికి ముగింపు కాదు, కానీ ఒక కొత్త దశకు ఆరంభం. ఈ రోజు తర్వాత ఆత్మ తన కర్మల ఆధారంగా పితృలోకంలో ఉండవచ్చు లేదా మళ్లీ జన్మకు సిద్ధమవుతుందని గరుడపురాణంలో ఉన్నట్టు పండితులు చెప్తున్నారు.

ఈ 13 రోజులు ఎందుకు ముఖ్యమైనవి?:

ఆత్మకు శాంతి కోసం కుటుంబానికి మానసిక ధైర్యం కోసం పూర్వీకుల ఆశీస్సులు పొందేందుకు సనాతన ధర్మం ప్రకారం మరణం ఒక ముగింపు కాదు. అది ఒక మార్పు మాత్రమే. మన కర్మలే మన తదుపరి ప్రయాణాన్ని నిర్ణయిస్తాయి. అందుకే మంచి ఆలోచనలు, మంచి కార్యాలు మన జీవితం మాత్రమే కాదు మరణానంతర ప్రయాణాన్నీ ప్రభావితం చేస్తాయి.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: కూష్మాండ దీపం పెడితే రాజయోగం పడుతుందా..? అసలు శాస్త్రం ఎం చెప్తుంది.

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×