E-Paper
Advertisement

ట్రోలర్లపై జగపతి బాబు సీరియస్.. రామ్‌చరణ్‌ గురించి చెబుతూ.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్..

ట్రోలర్లపై జగపతి బాబు సీరియస్.. రామ్‌చరణ్‌ గురించి చెబుతూ.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్..
Advertisement

Ram Charan Trolling: సినీ పరిశ్రమలో హీరోల జీవితాలు బయటకి కనిపించేంత ఈజీగా ఉండవని సీనియర్ నటుడు జగపతి బాబు స్పష్టం చేశారు. ఇటీవల భోపాల్ ఈవెంట్‌లో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ పొరపాటున కొన్ని మాటలు మార్చి మాట్లాడటంపై జరుగుతున్న ఆన్‌లైన్ ట్రోలింగ్‌ను ఆయన తీవ్రంగా ఖండించారు. దర్శకుడు బుచ్చిబాబు సన, రామ్‌చరణ్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ చిత్రం ‘పెద్ది’ (Peddi). ఈ సినిమాలో ‘అప్పలసూరి’ అనే కీలక పాత్ర పోషిస్తున్న జగపతి బాబు, ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో చరణ్‌కు మద్దతుగా నిలిచారు.

Read also-Divi Vadthya: బ్లాక్ డ్రెస్ లో కిల్లింగ్ లుక్ లో దివి.. రెండు కళ్లు చాలట్లేదు మావా..

Advertisement

సేడిజం చూపిస్తున్నారు!

భోపాల్ ఈవెంట్‌లో చరణ్ పొరపాటున ‘భోపాల్’ అనబోయి ‘బీహార్’ అని, క్రికెటర్ బుమ్రాను ఫుట్‌బాల్ ప్లేయర్ అని నోరు జారారు. దీనిపై జగపతి బాబు మాట్లాడుతూ, “ఆ ప్రాంతం వాళ్లో, ఆ వ్యక్తిగత అభిమానులో ఫీల్ అవ్వడంలో తప్పు లేదు. కానీ ఈ మధ్యలో ఉన్న కొందరికి ఏది దొరుకుతుందా, ఎక్కడ నెగిటివిటీ స్ప్రెడ్ చేద్దామా అనే సేడిజం, పర్వర్షన్ ఎక్కువైపోయింది. అలాంటి వాళ్లే ఇలాంటి చిన్న విషయాలను పట్టుకుని ట్రోల్ చేస్తున్నారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

హీరోల నెత్తి మీద లక్ష భారాలు ఉంటాయి

సినిమా షూటింగ్ అయిపోగానే హీరోలు చాలా ఫ్రీగా ఉంటారని అనుకోవడం భ్రమ అని జగ్గుభాయ్ అన్నారు. “ఒక సినిమా పూర్తయ్యాక కూడా హీరోల నెత్తి మీద లక్ష భారాలు (ఒత్తిళ్లు) ఉంటాయి. సెన్సార్ రిపోర్ట్, రీ-రికార్డింగ్ టెన్షన్స్, రిలీజ్ డేట్స్, ప్రొడ్యూసర్ సేఫ్టీ, ఓటీటీ డీల్స్.. ఇలాంటి ఎన్నో సమస్యలు ఒక హీరోని వేధిస్తూ ఉంటాయి. అంత ప్రెషర్‌లో ఉన్నప్పుడు బై మిస్టేక్ ఒకటి రెండు పొరపాట్లు జరగడం సహజం” అని ఆయన వివరించారు.

Read also-Podarillu Today Episode : చక్రీ మాటకు ప్రతాప్ మైండ్ బ్లాక్.. మహా గదిలోకి చక్రీ.. కన్నతల్లి కోసం కన్నా కన్నీళ్లు.. ఇదే ట్విస్ట్

‘పెద్ది’ కోసం చరణ్ పడిన కష్టం నాకు తెలుసు
‘పెద్ది’ సినిమా కోసం రామ్‌చరణ్ శారీరకంగా, మానసికంగా ఎంతో శ్రమించాడని జగపతి బాబు పేర్కొన్నారు. బాడీ లాంగ్వేజ్ మార్చుకుని, భారీ డైలాగులను పర్ఫెక్ట్‌గా చెప్తూ ఎంతో స్ట్రెయిన్ అయ్యాడని, ఇంత గొప్ప సినిమా చేసాక ఇలాంటి పిచ్చి ట్రోల్స్ గురించి చరణ్ అస్సలు కేర్ చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. సెలబ్రిటీల వెనుక ఉండే అసలు ఒత్తిడిని జగ్గుభాయ్ విడమర్చి చెప్పిన విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×