E-Paper
Advertisement

నెట్‌ఫ్లిక్స్‌లో టిల్లు గాడి రచ్చ.. స్టార్ బాయ్ సిద్ధూతో మీనాక్షి చౌదరి రొమాన్స్!

నెట్‌ఫ్లిక్స్‌లో టిల్లు గాడి రచ్చ.. స్టార్ బాయ్ సిద్ధూతో మీనాక్షి చౌదరి రొమాన్స్!
Advertisement

Siddu Jonnalagadda:‘డీజే టిల్లు’ ఫ్రాంచైజీతో ఆడియన్స్ కి బాగా దగ్గరైన సిద్ధూ జొన్నలగడ్డ గత సినిమా తెలుసు కదా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెల్సిందే. అయినా ప్రస్తుతం రవికాంత్ పేరేపు దర్శకత్వంలో బాడాస్, రవికాంత్ పేరేపుతోనే కోహినూర్, ఆర్జే స్వరూప్ దర్శకత్వంలో రాంబోతో పాటు టిల్లు క్యూబ్ అంటూ వరుస సినిమాలని చేతిలో పెట్టేసుకున్న సిద్దూ ఇపుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడట.

టాలీవుడ్ గోల్డెన్ లెగ్‌ మీనాక్షి చౌదరి

Advertisement

అవును.. క్రేజీ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ కోసం ఓ భారీ వెబ్ సిరీస్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న వార్తలు వినిపించగా, తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి సాలిడ్ అప్ డేట్స్ బయటికి వచ్చేసింది.ముఖ్యంగా ఇందులో సిద్దుకి జోడీగా ఎవరు నటిస్తారంటూ గత కొన్ని రోజులుగా ఆరాలు తీస్తున్నారు మూవీ లవర్స్. అయితే ఎట్టకేలకి ఈ ప్రాజెక్ట్ లో సిద్దూకి జోడీగా గుంటూరు కారం, లక్కీ భాస్కర్ వంటి చిత్రాలతో టాలీవుడ్ గోల్డెన్ లెగ్‌గా క్రేజ్ కొట్టేసిన మీనాక్షి చౌదరిని హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్టు సమాచారం. సంక్రాంతికి వస్తున్నాం, అనగనగ ఒక రాజు అంటూ వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న మీనుని క్యాస్ట్ చేయడం అంటే ప్రాజెక్ట్ కి మరింత గ్లామర్ యాడ్ అయినట్టే. ఇక సిద్ధూ జొన్నలగడ్డ ఎనర్జీకి, మీనాక్షి గ్లామర్ కలిస్తే ఆడియన్స్ కి మరో ఐ ఫీస్ట్ అవడం ఖాయం.

also read :మృణాల్ ఠాకూర్ కోసం ధనుష్ రిస్క్.. మరోసారి హాట్ టాపిక్ అయిన డేటింగ్ రూమర్స్!

Advertisement

టాలెంటెడ్ వెంకీ అట్లూరి దర్శకత్వం

ఇక ఈ క్రేజీ కాంబోలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మీద వస్తున్న ఈ సిరీస్ కి టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ‘తొలిప్రేమ’, ‘సార్’ వంటి క్లాస్ హిట్లతో డైరెక్టర్ గా సత్తా చాటిన వెంకీ తొలిసారి OTT వెబ్ సిరీస్ కి డైరెక్షన్ చేస్తుండటం విశేషం.

ఇక ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ సిరీస్ వచ్చే మేలో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తుంది. ఇక వచ్చే జూన్, జూలై నెలల్లో భారీ షెడ్యూల్స్ ప్లాన్ చేసిన మేకర్స్, 2026 చివరి నాటికి స్ట్రీమింగ్ కు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. ఇక స్వయంగా నెట్ ఫ్లిక్స్ ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సిరీస్ కి గ్లోబల్ వైడ్ గా క్రేజ్ వచ్చే అవకాశాలు పుష్కలం.

సందడి చేయడానికి రెడీ

మొత్తానికి ఆడ ఉంటా ఈడా ఉంటా అన్నట్టుగా మన హీరోలంతా ఇపుడు థియేటర్లతో పాటు OTT ప్లాట్ ఫామ్స్ లలోనూ సందడి చేయడానికి రెడీ అయిపోయారన్న మాట. చూడాలి మరి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సిరీస్ తోనైనా సిద్దూ సాలిడ్ సక్సెస్ అందుకుంటాడో లేదో!

also read :దేవర 2 అటకెక్కినట్టేనా? కొరటాలకు ఎన్టీఆర్ హ్యాండ్.. నందమూరి ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్!

Related News

కృష్ణుడిగా రామ్ చరణ్.. సూపర్ హిట్ సినిమా రీమేక్ చేయనున్నారా?

టాక్సిక్ సినిమాకు రేటింగ్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ రేటింగ్.. ఇంత రారుణమా?

మై లిటిల్ ప్యారడైజ్..కొడుకుతో క్యూట్ ఫోటోలను షేర్ చేసిన నాని..

యాంకర్ గా స్రవంతి ఉంటే సినిమా హిట్టే.. డైరెక్టర్ ప్రశంశలు..సుమ క్రేజ్ తగ్గిందా?

లెనిన్ హిట్.. మెగా హీరోతో ఛాన్స్ కొట్టేసిన భాగ్య శ్రీ?

మధ్యం మానేశాను.. హృదయ విదారకమైన బాధ అంటున్న కొండన్న!

ఆర్ట్ డైరెక్టర్ కొడుకు అరెస్ట్.. పవన్ కళ్యాణ్ స్పందిస్తారా?

యశ్ ఎదుగుదల చూసి ఏడుస్తున్నారు… ట్రోల్స్ పై సుమలత ఫైర్!

Big Stories

Advertisement
×