E-Paper
Advertisement

రేవంత్ సీఎం అయ్యారంటే అది కేసీఆర్ పుణ్యమే.. జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

రేవంత్ సీఎం అయ్యారంటే అది కేసీఆర్ పుణ్యమే.. జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Advertisement

Jeevan Reddy: జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ గూటికి చేరిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. నిన్న జగిత్యాలలో జరిగిన కేసీఆర్ సభ తెలంగాణ ఉద్యమ రోజులను గుర్తు చేసిందని, ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

ముఖ్యంగా రేవంత్ రెడ్డి తీరుపై జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రానికి పట్టన శని రేవంత్ రెడ్డి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఎంతో ముందుచూపుతో విద్యకు ప్రాధాన్యతనిస్తూ గురుకులాలను ఏర్పాటు చేస్తే, రేవంత్ రెడ్డి వాటిని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారంటే అది కేసీఆర్ పుణ్యమేనని, కానీ రేవంత్ మాత్రం ప్రజా పాలన పేరుతో ప్రజలను వంచిస్తున్నారని మండిపడ్డారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూలుస్తున్నారని, ఈ పాలన కేవలం ఆయన అనుచరుల కోసమే తప్ప సామాన్యుల కోసం కాదని విమర్శించారు.

Advertisement

తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం గురించి చెబుతూ.. ‘నా జీవితం ఒక తెరిచిన పుస్తకం, ఎప్పుడూ రాజ్యాంగ బద్ధంగానే నడుచుకున్నాను’ అని స్పష్టం చేశారు. తనకు సమర్థత లేకపోతే 14 సార్లు టికెట్ ఇచ్చారా? అని ప్రశ్నించారు. పదవుల కోసం తానెప్పుడూ ఢిల్లీ చుట్టూ తిరగలేదని, ఆత్మగౌరవం కోసమే పనిచేస్తానని చెప్పారు. గత 20 నెలలుగా కాంగ్రెస్‌లో మానసిక వేదన అనుభవించానని, కేసీఆర్ తనను పెద్ద మనసుతో అక్కున చేర్చుకున్నారని భావోద్వేగానికి లోనయ్యారు.

పార్టీ ఫిరాయింపుల విషయంలో రేవంత్ రెడ్డి తీరును తప్పుబట్టారు. స్వంత పార్టీ ఎమ్మెల్యేలపై నమ్మకం లేకే ఇతర పార్టీల వారిని చేర్చుకుంటున్నారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు దూతగా రేవంత్ బీజేపీలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని సంచలన ఆరోపణ చేశారు. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కు సూచిస్తూ.. పార్టీ ఫిరాయింపులే అభివృద్ధి అనుకుంటే, రేవంత్ రెడ్డిని కూడా బీజేపీలో చేరమని చెప్పాలని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ ప్రతిరోజూ రాజ్యాంగం చదువుకోవాలని జీవన్ రెడ్డి హితవు పలికారు.

Advertisement

Also Read: వార్నీ.. రోబోతో ఓట్లు అడుగుతున్నారా? దళపతి ఫ్యాన్స్ మామూలు రచ్చ కాదుగా!

Related News

అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

Big Stories

Advertisement
×