Somy Ali: సోమీ అలీ…1990s లలో బాలీవుడ్ ని తనదైన అందాలతో షేక్ చేసిన స్టార్ హీరోయిన్.అలాంటి ఈ వెటరన్ భామ గతాన్ని ఇపుడు నెమరేసుకుంటుంది.అందులో భాగంగా 1996లో ‘మాఫియా’ సినిమా షూటింగ్ రోజులను గుర్తుచేసుకుంటూ ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అజీజ్ సెజావల్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ క్రైమ్ డ్రామా లో ధర్మేంద్ర, ఆదిత్య పంచోలి, జే మెహతా, గుల్షన్ గ్రోవర్, మోహన్ జోషి, రజా మురాద్ స్టార్స్ నటించిన సంగతి తెల్సిందే.ఇక ఆదిత్య పంచోలి తో అదరగొట్టిన ”కిస్ లడ్కీ నే దిల్ మేరా ఛీనా” అనే సూపర్ హిట్ సాంగ్ కూడా ఈ సినిమాలోనిదే.
తానొక ”సెల్ఫ్-సబోటాజింగ్ పర్సనాలిటీ”
తాజాగా తనతో నటించిన ఆదిత్య పంచోలి ని గుర్తు చేసుకుంటూ తానొక సెల్ఫ్-సబోటాజింగ్ పర్సనాలిటీ” (తనను తాను నాశనం చేసుకునే మనస్తత్వం కలవాడు) అంటూ తన మనసులోని మాటలని చెప్పుకొచ్చింది.కెరీర్ పరంగా ఎంతో టాలెంట్ ,అలాగే మంచి రూపం ఉన్నప్పటికీ తన బిహేవియర్ తో వచ్చిన అవకాశాలని వదులుకున్నాడని,కానీ మాఫియా’ సెట్స్‌పై మాత్రం ఆదిత్య తనతో ఎంతో మర్యాదగా ఉన్నాడని తెలిపింది. బయట అందరు అంటున్నట్టుగా అతని కాంట్రవర్సీ ఇమేజ్ కి ,సెట్స్ లో అతడు వ్యవహరించిన తీరుకి అసలు సంబంధమే లేదని స్పష్టం చేసింది.
also read:లారెన్స్ సరసన సాయి పల్లవి, జాన్వీ? .. 30వ సినిమాలో ఆ నలుగురు భామల హంగామా!
సోషల్ మీడియాలో తెగ వైరల్
మరోవైపు, ఈ సినిమా జర్నీలో లెజెండరీ నటుడు ధర్మేంద్రను తన “హీరో-ఫాదర్ ఫిగర్”గా చెప్పుకొస్తూ ఎమోషనల్ అయింది.స ఈ సినిమాలో ఒక లేడీ కాప్‌గా బైక్ నడపడం దగ్గర నుంచి యాక్షన్ సీన్స్ వరకు ధర్మేంద్ర ఇచ్చిన మద్దతు మరువలేనిదని ఆకాశానికి ఎత్తేసింది.ఆయనలోని ప్రొఫెషనలిజం, డౌన్-టు-ఎర్త్ స్వభావమే నేటికీ ఆయనను ఇండస్ట్రీలో నిలబెట్టిందని తెలిపింది.అలా మెహతా ప్రొడక్షన్స్‌లో వచ్చిన ఈ సినిమా తనకు ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చిందని చెబుతూ ఆమె షేర్ చేసిన త్రో బ్యాక్ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సూరజ్ పంచోలిపై కూడా తీవ్ర ఆరోపణలు
అయితే ఈ వెటరన్ భామే గత ఏడాది ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆదిత్య పంచోలిని ఒక క్రూరమైన వ్యక్తిగా అభివర్ణిస్తూ, మహిళల పట్ల అతని శారీరక హింస, నమ్మకద్రోహం గురించి తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం, అంతేకాదు 2013లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నటి జియా ఖాన్ ఆత్మహత్య కేసును ప్రస్తావిస్తూ, ఆదిత్య కుమారుడు సూరజ్ పంచోలిపై కూడా తీవ్ర ఆరోపణలు చేసింది కూడా.ఏది ఏమైనా ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్ తో పాటు బి హేవియర్ కూడా చాలా ముఖ్యమని సోమీ అలీ కామెంట్స్ తో మరోసారి ప్రూవ్ అవుతుంది !
also read:ఆ 3 సెకన్ల సీన్ కొంపముంచింది…..వివాదంలో జాక్వెలిన్ కొత్త మ్యూజిక్ వీడియో!