E-Paper
Advertisement

నడిసంద్రంలో కొట్టుమిట్టాడే 23000 ప్రాణాలు… మస్ట్ వాచ్ సోషల్ ఇష్యూ డ్రామా

నడిసంద్రంలో కొట్టుమిట్టాడే 23000 ప్రాణాలు… మస్ట్ వాచ్ సోషల్ ఇష్యూ డ్రామా
Advertisement

German Social Drama: రోడ్డుపై వెళ్తేనే ఎప్పుడేం జరుగుతుందో చెప్పడం కష్టం. అలాంటిది ఉవ్వెత్తున ఎగిసి పడే మహాసముద్రంలో జర్నీ చేస్తున్నప్పుడు ప్రమాదం జరిగితే… అందులోనూ ఆ జర్నీ అఫిషియల్ కాకపోతే, ఆయా దేశాల ప్రభుత్వాలు ప్రమాదం గురించి తెలిసినా చేతులు కట్టుకుని చూస్తూ ప్రయాణీకుల ప్రాణాలను గాల్లో వదిలేస్తే… ఇక మామూలు మనుషులు అయ్యో పాపం అని ఊరుకుంటారు. కానీ ఇలాంటి పరిస్థితులలో కొంతమంది కుర్రాళ్ళు చేసిన రిస్కీ అడ్వెంచర్ చూస్తే క్లాప్స్ కొట్టాలి అన్పిస్తుంది. ఆ కథను చెప్పే సినిమానే ‘23,000 లైవ్స్’ (23,000 Lives). మరి ఇంతకీ ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? తెలుగులో చూడొచ్చా ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

2015లో యూరప్‌లో జరిగిన మైగ్రేషన్ క్రైసిస్ నేపథ్యంలో సాగుతుంది ఈ సినిమా కథ. బెర్లిన్‌కు చెందిన లూకాస్ ఇందులో మెయిన్ రోల్. టీవీల్లో లిబియా నుండి సముద్ర మార్గం ద్వారా యూరప్‌కు వస్తున్న వలసదారుల గురించి వార్తా వస్తుంది. ఓవర్‌లోడ్ రబ్బరు పడవలపై మధ్యధరా సముద్రంలో వాళ్ళు మునిగిపోతున్న దృశ్యాలు కనిపిస్తాయి. అది చూసి లూకాస్, అతని గర్ల్‌ఫ్రెండ్ కిట్టీ, వారి స్నేహితులు చలించిపోతారు. ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోకపోవడంతో వీళ్లే స్వయంగా రంగంలోకి దిగాలని డిసైడ్ అవుతారు.

Advertisement

‘Jugend Rettet’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి క్రౌడ్‌ఫండింగ్ ద్వారా డబ్బు సేకరిస్తారు. ఆ డబ్బుతో ‘Iuventa’ అనే పాత చేపల వేట పడవను కొంటారు. దాన్ని రెస్క్యూ బోట్‌గా మార్చి సముద్రంలోకి దిగుతారు. సముద్రంలో ప్రాణాలు కాపాడే ఎలాంటి అనుభవం లేకపోయినా, ధైర్యంతో ఒక్క సంవత్సరంలోనే 16 వేర్వేరు రెస్క్యూ మిషన్ల ద్వారా ఏకంగా 23,000 మందికి పైగా వలసదారుల ప్రాణాలను కాపాడతారు. కానీ వాళ్ళు చేసిన ఈ మానవతా సేవకు దొరికిన బహుమతిని ఎవ్వరూ ఊహించలేరు.

అంతర్జాతీయ రాజకీయాలు, యూరోపియన్ అధికారులు వీళ్ళను స్మగ్లర్లతో చేతులు కలిపిన నేరస్థులుగా చిత్రీకరించి, 2017లో వారి పడవను సీజ్ చేస్తారు. లూకాస్, అతని బృందం అప్పటి నుంచి చట్టం, న్యాయం మధ్య నలిగిపోతారు. కోర్టు కేసులు, బెదిరింపులు, సమాజం నుంచి వచ్చే వ్యతిరేకతలు అన్నింటినీ ఎదుర్కొంటారు. మరి చివరికి ఈ కేసుల నుంచి లూకాస్ తన టీంతో బయట పడ్డాడా ? అయితే ఎలా ? అన్నది సినిమాలో చూసి తెలుసుకోవలసిన స్టోరీ.

తెలుగులోనూ స్ట్రీమింగ్

Advertisement

‘23,000 లైవ్స్’ అనేది జర్మన్ సోషల్ డ్రామా. హార్ట్ టచింగ్, ఇన్‌స్పైరింగ్ రియల్ లైఫ్ స్టోరీ. జూలై 17న Netflixలో విడుదలైన ఈ చిత్రం తెలుగుతో సహా ఇతర భాషల్లో డబ్బింగ్‌తో అందుబాటులో ఉంది. మానవత్వాన్ని చాటిచెప్పే ఈ చిత్రం చూసిన ప్రతీ ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. ఈ చిత్రం కుటుంబంతో కలిసి చూడడానికి బెస్ట్ ఆప్షన్. ఈ యువకుల సాహసం ఆడియన్స్ మనసును కదిలిస్తుంది.

Read Also: చావు అంటే భయపడే ప్రియుడికి విషమిచ్చి… మనసుకు హత్తుకునే లవ్ స్టోరీ

Tags

Related News

రాజభవనంలోని వాళ్ళని వెంటాడే మిస్టీరియస్ శాపం… క్రేజీ కొరియన్ డార్క్ ఫాంటసీ థ్రిల్లర్

అక్కకు రక్తం ధారబోయడానికే పుట్టాను అనుకునే అమాయకురాలు… హార్ట్ టచింగ్ సిరీస్

ఇంగ్షీషు వోవెల్స్ తో సాగే కథ… ఓటీటీలోకి వచ్చిన తమిళ రొమాంటిక్ ఆంథాలజీ

యువరాణులందరినీ ఉంపుడుగత్తెలుగా మార్చుకోవాలనుకునే రాజు… హై ఆక్టేన్ యాక్షన్ అడ్వెంచర్

అల్లరి అసుర పిల్లల రచ్చ… కిడ్స్ తో కలిసి చూడాల్సిన మస్ట్ వాచ్ సిరీస్

బతికుండగానే చనిపోయిందని షాక్… డిజిటల్ ట్రాన్సాక్షన్ లో దిమ్మతిరిగే ట్విస్ట్

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీ చిత్రాలు .. ఏకంగా 14 సినిమాలు స్ట్రీమింగ్..!

Big Stories

Advertisement
×