Peddi OTT: రామ్ చరణ్ ..ఇతడికి,ఇతగాడి సినిమాలకి మార్కెట్ లో ఎంత క్రేజ్ ఉంటుందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు.ఇపుడు అదే దాన్నే మరోసారి ప్రూవ్ చేస్తుంది పెద్ది. యస్ ..‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఆయన నటిస్తున్న పూర్తి స్థాయి రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ థియేటర్లలోకి రాకముందే సరికొత్త సంచలనాలకు తెరతీస్తోంది.
‘ఉప్పెన’ చిత్రంతో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని, జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్పీడప్ చేయడమే కాకుండా, ఓవర్సీస్ ప్రింట్స్ మరియు సెన్సార్ పనులను వేగంగా పూర్తి చేసే పనిలో ఉంది. ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ (శివన్న), వెర్సటైల్ యాక్టర్ జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తుండటం సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేసింది.
also read :‘రాకా’, ‘చరణ్’ సినిమాల మధ్య నలిగిపోయిన ‘పుష్ప-3’.. ఇక రానట్టేనా?
దాదాపు రూ.130 కోట్లుగా ఫిక్స్
విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ చిత్రం బిజినెస్ పరంగా ట్రేడ్ వర్గాలకి పెద్ద షాకే ఇస్తుంది. ముఖ్యంగా డిజిటల్ రైట్స్ (ఓటీటీ హక్కులు) విషయంలో ‘పెద్ది’ ఒక భారీ డీల్‌ను సొంతం చేసుకున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఈ సినిమాకు వస్తున్న విపరీతమైన క్రేజ్ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల మధ్య గట్టి పోటీ ఉన్న సంగతి తెల్సిందే. చివరికి, గ్లోబల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ అన్ని భాషల (తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం) డిజిటల్ హక్కులను చేజిక్కించుకున్నట్లు సమాచారం.
అందుతున్న లీక్స్ ప్రకారం, ఈ సినిమా బేస్ ప్రైస్ డీల్ దాదాపు రూ.130 కోట్లుగా ఫిక్స్ అయింది. అయితే, ఇది కేవలం ప్రారంభ ధర మాత్రమేనని, థియేట్రికల్ రన్‌ను బట్టి ఈ విలువ మరింత పెరిగేలా ప్రత్యేక అగ్రిమెంట్లు జరిగాయని విశ్లేషకులు చెబుతున్న మాట .
ఈ డీల్‌లో చేర్చిన సరికొత్త ‘బోనస్ క్లాజులు’ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. సినిమా థియేటర్లలో సాధించే వసూళ్ల ఆధారంగా నెట్‌ఫ్లిక్స్ అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, తెలుగు వెర్షన్ బాక్సాఫీస్ వద్ద రూ.250 కోట్ల మైలురాయిని దాటితే ఒక రకమైన బోనస్, అలాగే అత్యంత కీలకమైన హిందీ మార్కెట్‌లో రూ.100 కోట్ల మార్క్‌ను అందుకుంటే ఒక స్థాయి, ఒకవేళ రూ.200 కోట్లు దాటితే మరో భారీ స్థాయి అదనపు చెల్లింపులు జరిపేలా ఒప్పందం కుదిరిందట.
దీనివల్ల సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే, ఫైనల్ ఓటీటీ డీల్ విలువ రూ.130 కోట్ల నుండి చాలా సులభంగా రూ.160 కోట్లకు పైగా దాటే అవకాశం కనిపిస్తోంది. కేవలం డిజిటల్ రైట్స్ మాత్రమే కాకుండా, ఈ సినిమా ఆడియో హక్కులు కూడా దాదాపు రూ.50 కోట్లకు పైగా పలికినట్లు ట్రేడ్ వర్గాల అంచనా.
పెద్ది’ సరికొత్త చరిత్ర సృష్టించడం పక్కా
రామ్ చరణ్ గత చిత్రాల బిజినెస్‌తో పోల్చి చూస్తే ఈ రేంజ్ మార్కెట్ ఊహించినదే అని చెప్పాలి. శంకర్ దర్శకత్వంలో ఆయన నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘గేమ్ ఛేంజర్’ డిజిటల్ హక్కులను గతంలో అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.160 కోట్లకు పైగా రికార్డు ధరకు దక్కించుకుంది. ఇప్పుడు ‘పెద్ది’ సినిమా బేస్ ప్రైస్ రూ.130 కోట్లుగా ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద పర్ఫార్మెన్స్ బాగుంటే వచ్చే అదనపు బోనస్‌లతో కలిపి ఇది ‘గేమ్ ఛేంజర్’ రికార్డులను కూడా అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది.
జూన్ 4న థియేటర్లు దద్దరిల్లడం, బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలవడం ఖాయమని మెగా అభిమానులు ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఒకవేళ సినిమా ఊహించిన విధంగా బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంటే, మాత్రం అటు థియేట్రికల్ కలెక్షన్లతో పాటు ఇటు ఓటీటీ బిజినెస్‌లోనూ ‘పెద్ది’ సరికొత్త చరిత్ర సృష్టించడం పక్కా !