BigTV English

Sudigali Sudheer: బతికుండగానే నా తండ్రిని చంపారు.. సుధీర్ చీకటి కోణంలో బయటపడ్డ నిజాలు

Sudigali Sudheer: బతికుండగానే నా తండ్రిని చంపారు.. సుధీర్ చీకటి కోణంలో బయటపడ్డ నిజాలు

Sudigali Sudheer: ఇండస్ట్రీలో ఉన్నవారికి ఎన్ని ప్రశంసలు దక్కుతాయో అందరికీ తెల్సిందే. ఒక స్టేటస్, గౌరవం, ప్రేమ.. ఇలా ఎవరికీ దక్కనివన్నీ వారికి దక్కుతాయి. వారు ఏ చిన్న పని చేసినా అది సోషల్ మీడియాలో హైలైట్ గా మారుతుంది. ఇక వారు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటారు. ఎంత డబ్బు ఉన్నా.. ఇలాంటి గౌరవం ఎవరికీ దక్కదు. అయితే ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. ఇండస్ట్రీలో ఉన్నవారు వీటితో పాటు కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. పబ్లిక్ లైఫ్ ను లీడ్ చేయలేరు. పర్సనల్ గా తమకు నచ్చిన ఏ పనిని చేయలేరు. ఎక్కడ ఏ తప్పు చేసినా  సోషల్ మీడియాలో ఏకిపారేస్తారు.


 

ఇలాంటివన్నీ ఓకే కానీ, వారిమీద లేనిపోని పుకార్లు పుట్టిస్తారు. అతడు, ఆమెతో రిలేషన్ లో ఉన్నాడని, వారిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారని, కొద్దిగా క్లోజ్ గా ఉన్నా కూడా  హీరోయిన్ తో ఎఫైర్ నడుపుతున్నాడని కూడా రాసుకొస్తారు. అవి కూడా కొద్దివరకు పర్లేదు. కానీ సెలబ్రిటీలకు అత్యంత బాధాకరంగా మారే విషయం ఏంటంటే.. వారిని, వారి కుటుంబంలోని వారిని బ్రతికి ఉండగానే చంపేస్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్.. ఆ సీనియర్ హీరో అనారోగ్యంతో మరణించాడు. డబ్బులు లేక అనాథగా మృతి చెందిన సీనియర్ నటుడు. స్టార్ కమెడియన్ తండ్రి మృతి.. షాక్ లో ఫ్యాన్స్ ఇలాంటి థంబ్ నెయిల్స్ తో  వ్యూస్ కోసం కొంతమంది యూట్యూబ్ ఛానెల్స్ చాలా నీచంగా చేస్తున్నారు.


 

స్టార్ కమెడియన్ వేణు మాధవ్ ఆయన బతికుండగానే.. చాలామంది ఆయన చనిపోయినట్లు రాసుకొచ్చారు. దానికి వేణు మాధవ్ చాలా బాధపడ్డాడు. మమ్మల్ని బతకనివ్వండి. మేము బతికే ఉన్నామని మాకు మేము క్లారిటీ ఇచ్చుకునే దుస్థితి సెలబ్రిటీలకు తప్ప ఇంకెవరికి రాదు అని వాపోయాడు. ఇలాంటి ఒక వార్తనే తనను ఎంతో బాధపెట్టిందని సుడిగాలి సుధీర్ చెప్పుకొచ్చాడు. జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ కు బుల్లితెరపై సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. షో ఎలాంటిది అయినా కూడా సుధీర్ వచ్చాడంటే ఎంటర్ టైన్మెంట్ పక్కా ఉండాల్సిందే.  బుల్లితెరపై వచ్చిన గుర్తింపుతో హీరోగా మారిన సుధీర్.. అక్కడ నెగ్గలేక మళ్లీ బుల్లితెరపైనే షోస్ చేసుకుంటూ బిజీగా మారాడు.

Priyanka Jain: ప్రియాంకను చంపేసిన శివ్.. కాళ్లు పట్టుకుని బతిమిలాడినా వదలకుండా..

 

ప్రస్తుతం ఈటీవీలో  ఫ్యామిలీ స్టార్స్ అనే షో చేస్తున్న సుధీర్..  తాజా ఎపిసోడ్ కి రేడియో జాకీలు వర్సెస్ వీడియో జాకీలను పిలిచాడు. అందులో కాంట్రవర్షియల్ ఇంటర్వ్యూలు చేసే యాంకర్ జాఫర్ కూడా వచ్చాడు. ఇక ప్రోమో మొత్తం ఫుల్ ఫన్ తో నింపేశారు.  అందరూ కలిసి సుధీర్ ను ఒక ఆట ఆడుకున్నారు. చివర్లో జాఫర్.. సుధీర్ ను ఇంటర్వ్యూ చేసినట్లు చూపించారు. ఎప్పుడు ఏది సీరియస్ గా తీసుకొని సుధీర్ ను సైతం జాఫర్ చాలా కాంట్రవర్షియల్ ప్రశ్నలు అడిగాడు. సుధీర్ అంటే పెద్ద మ్యానుపలేటేడ్.. ?, హీరోగా సినిమాలు చేస్తూ మళ్లీ టీవీకి రావడం యూ టర్నా.. ? కొన్ని రూమర్స్ ఉన్నాయి.. వాటిలో నీ మనసుకు బాధపెట్టిన వార్త ఏది ? లాంటి ప్రశ్నలను సంధించాడు. ఇక దానికి సుధీర్.. మా ఇంట్లో వాళ్లు చనిపోయారని రాశారు. వాళ్లు బ్రతికి ఉండగానే అలా రాయడం నేను తట్టుకోలేకపోయాను అని సుధీర్ చెప్పుకొచ్చాడు.

 

అయితే సుడిగాలి సుధీర్ జబర్దస్త్ లో పేరు తెచ్చుకున్నప్పుడు అతని గురించిన ఒక కథ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సన్నాఫ్ సత్యమూర్తి కథ సుధీర్ కథ ఒకటే అని, బాగా డబ్బు ఉన్న సుధీర్ తండ్రిచనిపోవడంతో  కుటుంబాన్ని పోషించడానికి మ్యాజిక్ చేస్తూ ఉండేవాడని, అలా జబర్దస్త్ లోకి అడుగుపెట్టినట్లు చెప్పుకొచ్చారు. ఆ విషయం గురించే ఇప్పుడు  సుధీర్ స్పందించినట్లు తెలుస్తోంది.

Related News

Pawan Kalyan On Reviews : సినిమా స్టార్ట్ అయ్యేలోపే రివ్యూస్, మా ఉసురు తగులుతుంది!

OG success Event : ప్రకాశ్ రాజ్ సెట్స్‌లో ఉంటే… పవన్ కళ్యాణ్ నిర్మాతలకు చెప్పిన ఆసక్తికర కామెంట్

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సీరియస్ రిక్వెస్ట్, అసలు అది జరిగే పనేనా?

Allu Arjun : అల్లు రామలింగయ్య కు అల్లు అర్జున్ నివాళి, బన్నీ కొత్త లుక్ చూసారా?

OG Success Event : బండ్లన్న లేని లోటు తీర్చిన తమన్, నవ్వు ఆపుకోలేక పోయిన పవన్

OG Success Event : నా బలహీనతతో తమన్, సుజీత్ ఆడుకున్నారు. చంపేస్తాను అంటూ పవన్ వార్నింగ్

OG Success Meet : పవన్ కళ్యాణ్ ఆ డిజాస్టర్ సినిమా లేకపోతే నేను లేను, సుజీత్ షాకింగ్ కామెంట్స్

OG Success Event : షాకింగ్ న్యూస్, ఓజీ యూనివర్స్ కు పవన్ కళ్యాణ్ నో? ఆ సైగ కి అర్థం ఏంటి?

Big Stories

×