Pawan Kalyan Movie Shooting : ఏపీ డిప్యూటీ సీఏం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఏపీ సార్వత్రిక ఎన్నికల ముందు ఒకేసారి మూడు సినిమాలను అనౌన్స్ చేశాడు. హరిహరి వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను ప్రకటించాడు. వీటిలో వీరమల్లు, ఓజీ సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు రెడీగా ఉన్నాయి. ఆయన ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే చిత్రం చేస్తున్నాడు.. ఈ సినిమాను త్వరగా పూర్తి చెయ్యాలని డేట్స్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మూవీ షూటింగ్ కోసం పవన్ కళ్యాణ్ రాజకీయాలను పక్కన పెట్టాడని ఓ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది..
కేబినెట్ మీటింగ్ కు డుమ్మా.. ?
పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేవలం సినీ నటుడు మాత్రమే కాదు. ఏపీ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కూడా. ఆయన బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలి. రాష్ట్రానికి సంబందించిన ప్రతి కీలక విషయాన్ని చర్చించే సమయాల్లో ఆయన మీటింగ్ లలో తప్పనిసరిగా ఉండాలి. కానీ ఈ మధ్య సినిమా కోసం ఆయన మీటింగ్ కు వెళ్లలేదని ఓ వార్త మీడియా వర్గాల్లో షికారు చేస్తుంది. నిన్న కేబినేట్ మీటింగ్ మధ్యలోనే బయటికి వచ్చిన న్యూస్ ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన ఓ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారట.
మొయినబాద్ షూటింగ్ సెట్‌లో పవన్ ?
నిన్న కేబినెట్ మీటింగ్ నుంచి బయటికి వచ్చిన పవన్ కళ్యాణ్ నేరుగా హైదరాబాద్ వచ్చాడు. ఈ రోజు నుంచి కొన్ని రోజుల డేట్స్ ను మైత్రీ మూవీ మేకర్స్ కి ఇచ్చాడట. మైత్రీ వాళ్లు పవన్‌తో ఉస్తాద్ భగత సింగ్ అనే సినిమా చేస్తున్నారు. దీనికి హరీష్ శంకర్ డైరెక్టర్. ఈ సినిమా షూటింగ్ కోసమే.. ఏపీ కేబినెట్ మీటింగ్ ను స్కిప్ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్… మొయినబాద్ ఏరియాలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కోసం వేసిన సినిమా సెట్స్ లో ఉన్నారని సమాచారం.
Also Read : లెనిన్ నుంచి శ్రీలీల అవుట్… ఆమె కెరీర్‌ను వాళ్ల అమ్మే నాశనం చేస్తుందా ?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ అప్డేట్..
టాలీవుడ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబోలో గతంలో వచ్చిన సినిమాల్లో గబ్బర్ సింగ్ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ అవ్వడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.. అయితే ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది..ఆయన డిప్యూటీ సీఎం అవ్వడం వల్ల సినిమాలు చేసేంత సమయం అయితే ఉండడం లేదు. అందుకే సెట్స్ మీద ఉంచిన సినిమాలను ముందుగా కంప్లీట్ చేసి ఆ సినిమాలను అనుకున్న టైమ్ కి రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన ఆయన తొందరలోనే ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను కంప్లీట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మొయినబాద్ లో ఏర్పాటు చేసిన సెట్ లో కీలక సీన్లను చిత్రీకరిస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ మూవీని పూర్తి చేసి థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్..