BigTV English

Priyanka Jain: ప్రియాంకను చంపేసిన శివ్.. కాళ్లు పట్టుకుని బతిమిలాడినా వదలకుండా..

Priyanka Jain: ప్రియాంకను చంపేసిన శివ్.. కాళ్లు పట్టుకుని బతిమిలాడినా వదలకుండా..

Priyanka Jain: అయ్యబాబోయ్.. అంతలా ఏం జరిగింది..? నిజంగా శివ్, ప్రియాంకను చంపేశాడా.. ? అంటే నిజంగానే చంపేశాడు. కానీ ఆటలో. ఏంటీ ఆటలోనా.. మేము ఎంత భయపడ్డామో అని అనుకుంటే ఊపిరి పీల్చుకుంది. మరి ఏంటి ఆ టైటిల్ అంటే.. ఆ వీడియోలో వారు చేసిన ఓవర్ యాక్షన్ కూడా అలాగే ఉంది కాబట్టి. అసలు విషయానికొస్తే.. ప్రియాంక జైన్ గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.


మౌనరాగం అనే సీరియల్ ద్వారా ప్రియాంక జైన్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ సీరియల్ లో మూగ అమ్మాయిగా ఆమె నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక అదే సీరియల్ తోనే శివ్ కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ సీరియల్ సమయంలోనే ప్రియంకా – శివ్ మధ్య పరిచయం ప్రేమగా మారింది. మౌనరాగం తరువాత ప్రియాంక జానకి కలగనలేదు అనే సీరియల్ చేసింది. ఇది మరింత గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు అమ్మడిని బిగ్ బాస్ వరకు తీసుకెళ్లేలా చేసింది తీసుకెళ్లేలా చేసింది.

ఇక సీరియల్ హీరోయిన్ గా ఉన్నంతవరకు ప్రియాంక గురించి ఎవరికి ఏమి తెలియలేదు. కానీ, ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిందో ఆమె ప్రవర్తన, ఆలోచనలు.. ఇలా మొత్తం నెగిటివిటీని తీసుకొచ్చాయి. కానీ, గేమ్స్ లో మాత్రం ఈ చిన్నదాన్ని కొట్టినవారే లేరు. ఇక ఎలాగోలా బిగ్ బాస్ ద్వారా కొంతమంది అభిమానులను.. ఇంకొంత డబ్బును సంపాదించుకొని బయటపడింది. ఇక్కడే అసలైన టాస్క్ మొదలయ్యింది. ఎంతో పద్దతిగా కనిపించే ప్రియాంక కాస్తా గ్లామర్ డోస్ పెంచడం మొదలుపెట్టింది. అవకాశాల కోసం, డబ్బుల కోసం చిన్న చిన్న డ్రెస్ లు వేసుకొని షోస్ లలో కనిపించడం అలవాటు చేసుకుంది. నిత్యం హాట్ హాట్ ఫొటోస్ తో సోషల్ మీడియా షేక్ చేస్తోంది.


Samantha: సమంత సెకండ్ హ్యాండ్.. డిజైనర్ సంచలన వ్యాఖ్యలు

బిగ్ బాస్ తరువాత ప్రియాంక సీరియల్స్ లో నటించే అవసరం రాలేదు. షోస్, యూట్యూబ్ బ్లాగ్స్ చేస్తూ బాగానే సంపాదిస్తుంది. ఇక ఇన్స్టాగ్రామ్ లో ప్రియాంక – శివ్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. వీరు చేసే కంటెంట్ బావున్నా కూడా వీరి ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తారనే విమర్శలు కూడా వచ్చాయి. కానీ, ఆ విమర్శలను పట్టించుకోని ఈ జంట.. ఎక్కడో ఎవరో చేసిన కంటెంట్ ను కాపీ కొట్టి  తాము చేస్తున్నట్లుచూపిస్తున్నారు.

ఇక ఇప్పటి వీడియో సంగతి గురించి మాట్లాడితే.. వీడియో ఓపెన్ చేయగానే.. ప్రియాంక, శివ్ కాళ్ల దగ్గర  మోకాళ్ల మీద కూర్చొని.. శివ్ ప్లీజ్ చంపొద్దు.. ప్లీజ్ శివ్ చంపొద్దు అంటూ బతిమిలాడుతుంది. సడెన్ గా చూసినవారెవరైనా ఏంటి ఇది .. ఏం చేస్తున్నారు అనే నుమానం వస్తుంది. చివరకు ట్విస్ట్ రివీల్ చేస్తున్నట్లు.. లూడోలో ప్రియాంక కాయిన్ ను శివ్ చంపడం చూపించడంతో.. నెటిజన్స్ మండిపడుతున్నారు. అసలు ఇది ఒక కంటెంటా ..? చూసేవాళ్లు ఏమనుకోవాలి..? మీ సీరియల్స్ లో నటిస్తున్నట్లు ఇక్కడ కూడా  ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.  ఇంకొంతమంది మాత్రం సూపర్ కామెడీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related News

War 2 Pre Release Event : ఇప్పుడు అసలైన వార్… ఈ ఒక్క దాంతో కూలీని దాటేసింది

NTR: కాళ్ళ మీద పడ్డ అభిమాని.. ఎన్టీఆర్ ఏం చేసాడంటే

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

War 2 Pre release: అభిమానులపై కోప్పడిన తారక్.. ఇక్కడి నుంచి వెళ్లిపోనా అంటూ!

War 2 Pre release: నన్ను ఎవరూ ఆపలేరు.. పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చిన తారక్!

War 2 Pre release: తారక్ మీకు అన్న… నాకు తమ్ముడు.. స్పీచ్ అదరగొట్టిన హృతిక్!

Big Stories

×