E-Paper
Advertisement

‘కరుప్పు’ సినిమాటోగ్రాఫర్‌కు లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన హీరో సూర్య!.. దర్శకుడికి?

‘కరుప్పు’ సినిమాటోగ్రాఫర్‌కు లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన హీరో సూర్య!.. దర్శకుడికి?
Advertisement

Suriya Gifted Car: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘కరుప్పు’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మే 15న విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ వసూళ్లు సాధిస్తూ ఇప్పటికే రూ. 300 కోట్ల క్లబ్‌ లో చేరి రికార్డు సృష్టించింది. సూర్య కెరీర్‌లోనే తమిళనాడులో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘కరుప్పు’ నిలిచింది.

Read also-హర్రర్ మూవీ లవర్సా… హాట్‌స్టార్‌ లో ఉన్న టాప్ 5 చిత్రాలను అస్సలు మిస్ అవ్వకండి

Advertisement

ఈ భారీ విజయంతో చిత్రబృందం అమితానందంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో, సినిమాను విజువల్‌గా మరో లెవెల్‌కు తీసుకెళ్లిన టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ జి.కె. విష్ణు పనితీరుకు ఫిదా అయిన సూర్య, ఆయనకు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. సరికొత్త లగ్జరీ ఎలక్ట్రిక్ కారు ‘మహీంద్రా BE6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్’ ను విష్ణుకు కానుకగా అందించారు. మార్కెట్లో ఈ లగ్జరీ కారు ధర సుమారు రూ. 30 లక్షల నుండి రూ. 40 లక్షల వరకు ఉంటుందని అంచనా.

జస్ట్ గాడ్ థింగ్స్..

హీరో సూర్య స్వయంగా కారు తాళాలను అందజేస్తున్న ఫోటోను జి.కె. విష్ణు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారు. కారు ముందు సూర్యతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. “జస్ట్ గాడ్ థింగ్స్ ! థాంక్యూ సూర్య సార్. మీది చాలా పెద్ద మనసు” అంటూ ఎమోషనల్ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కేవలం సినిమాటోగ్రాఫర్‌కే కాకుండా, ఈ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ అందించిన సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ కు కూడా సూర్య కారును బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం.

Advertisement

Read also-సీఎం రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం.. హరీష్ రావుపై మేడి రవిచంద్ర ఫైర్

విజువల్స్ నెక్స్ట్ లెవెల్..

దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ చిత్రంలో సూర్య లాయర్‌గా, అలాగే ‘వీరభద్రుడి’ (కరుప్పస్వామి) అవతారంలో గూస్‌బంప్స్ తెప్పించే నటనతో ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో జి.కె. విష్ణు అందించిన లైటింగ్, కలర్ గ్రేడింగ్, కోర్టు రూమ్ డ్రామా విజువల్స్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయని ప్రేక్షకులు, సినీ విమర్శకులు ప్రశంసిస్తున్నారు. గతంలో ‘మెర్సల్’, ‘బిగిల్’, ‘జవాన్’ వంటి భారీ చిత్రాలకు పనిచేసిన జి.కె. విష్ణు, ‘కరుప్పు’ విజయంతో తన కెరీర్‌లో మరో మైలురాయిని అందుకున్నారు. సాధారణంగా సినిమాలకు నిర్మాతలు లేదా దర్శకులు గిఫ్ట్‌లు ఇవ్వడం చూస్తుంటాం, కానీ టెక్నీషియన్ల కష్టాన్ని గుర్తిస్తూ హీరో సూర్య ఇంతటి ఖరీదైన కానుకలను అందించడం పట్ల సినీ ఇండస్ట్రీలో ప్రశంసల వర్షం కురుస్తోంది. వీరికే ఈ రేంజ్ గిఫ్టులు ఇస్తే .. దర్శకుడికి ఎలాంటి గిఫ్ట్ ఇస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×